యమహా నుండి దూసుకొస్తున్న ఏరోక్స్ 155 స్కూటర్
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద యమహా సరికొత్త ఏరోక్స్ 155 స్కూటర్‌ను విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.
Recommended Video

జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం యమహా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ కేంద్రంగా జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికగా కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణకు సిద్దమైంది. ఈ వేదిక మీద 155సీసీ కెపాసిటీతో ఏరోక్స్ అనే స్పోర్టివ్ స్కూటర్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
భారత మార్కెట్‌కు పరిచయమవుతున్న యమహా ఏరోక్స్ 155 స్కూటర్ గురించి మరిన్ని ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

సరికొత్త యమహా ఏరోక్స్ 155 స్కూటర్ యమహా సర్వీస్ స్టేషన్‌లో ఉండగా గుర్తించడం జరిగింది. అదే యమహా డీలర్ కథనం మేరకు, యమహా ఈ స్పోర్టివ్ స్కూటర్‌ను ఫిబ్రవరి 25, 2018 న విపణిలోకి లాంచ్ చేస్తున్నట్లు తెలిసింది.

యమహా ఇండియా, భారతదేశపు అతి పెద్ద వాహన ప్రదర్శన వేదిక ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించి, ఆ తరువాత పూర్తి స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

యమహా ఎరోక్స్ 155 స్కూటర్‌ను యమహా లైనప్‌లో ఉన్న ఎమ్‌టి మోటార్ సైకిల్ శ్రేణి డిజైన్ అంశాలతో రూపొందించింది. కండలు తిరిగిన రూపం, పలు డిజైన్ గీతలతో ఫ్రంట్ ప్రొఫైల్‌ను అగ్రెసివ్ డిజైన్ శైలిలో అందించింది.

సౌకర్యవంతమైన మరియు విశాలమైన రైడర్ మరియు పిలియన్ సీటు, టెయిల్ సెక్షన్‌లో పదునైన డిజైన్‌లో ఉన్న టెయిల్ ల్యాంప్, వంటివి యమహా ఏరోక్స్ 155 స్కూటర్‌కు మంచి స్పోర్టివ్ లుక్ తీసుకొచ్చాయి.

యమహా తమ ఏరోక్స్ 155 స్కూటర్‌ను తొలుత 2016లో మలేషియాలో ఆవిష్కరించింది. ఆ తరువాత ఇండోనేషియా, వియత్నాం మరియు పిలిప్పీన్స్ దేశాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాదిలో ఇండియన్ మార్కెట్ మీద దృష్టి సారించింది.
Trending On DriveSpark Telugu:

యమహా ఏరోక్స్‌లో ఎల్ఇడి హెడ్ ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్, 25-లీటర్ల కెపాసిటి గల అండర్ సీట్ స్టోరేజ్, సీటు క్రింద ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్, 5.8-అంగుళాల పరిమాణం ఉన్న ఎల్‌సిడి డిస్ల్పే, స్మార్ట్ కీ సిస్టమ్ మరియు మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వంటివి అతి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

సాంకేతికంగా యమహా ఏరోక్స్ 155 స్కూటర్‌లో 155.1సీసీ కెపాసిటి గల ఫ్యూయల్ ఇంజెక్టెడ్, లిక్విడ్ కూల్డ్, సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది 14.6బిహెచ్‌పి పవర్ మరియు 13.8ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది పూర్తిగా విడుదలైతే, లిక్విడ్ కూలింగ్ మరియు ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్‌తో వచ్చే భారతదేశపు తొలి స్కూటర్‌గా నిలవనుంది.

యమహా ఏరోక్స్ 155 స్కూటర్‌లో అత్యుత్తమ హ్యాండ్లింగ్ కోసం 14-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున డ్యూయల్ షాక్ అబ్జార్వర్లు, ఫ్రంట్ వీల్‌కు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన డిస్క్ బ్రేక్ మరియు రియర్ వీల్‌కు డ్రమ్ బ్రేక్ సెటప్ కలదు.

ధర విషయానికి వస్తే ఇండియన్ మార్కెట్లో లభించే అన్ని స్కూటర్ల ధర కంటే అధికంగా ఉండనుంది. విపణిలో ఉన్న అప్రిలియా ఎస్ఆర్ 150 స్కూటర్లకు ఇది గట్టి పోటీనివ్వనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
యమహా దేశీయంగా ప్రీమియమ్ స్కూటర్ల లైనప్‌లో రాణించేందుకు తమ తొలి ఖరీదైన స్కూటర్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. డిజన్, ఫీచర్లు మరియు భద్రత పరంగా ఏరోక్స్ 155 భారతీయ వినియోగదారులను ఆకట్టుకోనుంది. మరి ఇది ఎంత వరకు నిజమనేది 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరణకు రానున్న యమహా ఏరోక్స్ 155 కోసం వేచి చూడక తప్పదు.
Trending DriveSpark Telugu YouTube Videos


Click it and Unblock the Notifications








