ఏరోక్స్ 155 స్కూటర్‌ను షోరూమ్‌లో ప్రదర్శించిన యమహా

యమహా తమ ఏరోక్స్ 155 స్కూటర్ గురించి ప్రజా స్పందన మరియు సందర్శకులు అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రదర్శించింది. అత్యాధునిక మరియు గుడ్ లుకింగ్ ఏరోక్స్ 155 స్కూటర్‌ను ఇండియాకు ఖరారు చేసింది.

By Anil Kumar

యమహా డీలర్ షోరూమ్‌లో ఓ సరికొత్త స్కూటర్‌ను ప్రదర్శించాడు. చూడటానికి చాలా కొత్తగా, అట్రాక్టివ్‌గా ఉండటంతో కొనుగోలు చేయడానికి ఎంతో మంది కస్టమర్లు ప్రయత్నించారు. అయితే ఆ స్కూటర్ అమ్మకానికి కాదు కేవలం షోరూమ్‌కు వచ్చే కస్టమర్ల కోసం తిలకించడానికి మాత్రమే ప్రదర్శించినట్లు చెప్పుకొచ్చాడు.

యమహా ఏరోక్స్ 155

యమహా తమ ఏరోక్స్ 155 స్కూటర్ గురించి ప్రజా స్పందన మరియు సందర్శకులు అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రదర్శించింది. నిజమే, దేశీయ స్కూటర్ల విపణిలో అగ్రగామి సంస్థగా ఉన్న హోండాను ఢీకొట్టేందుకు యమహా ఇండియా ప్రణాళికల్లో ఇదీ ఒకటి. అవును జపాన్ దిగ్గజం యమహా అతి త్వరలో హోండా గ్రాజియా స్కూటర్‌కు పోటీగా సరికొత్త ఏరోక్స్ 155 స్కూటర్‌ను తీసుకురానుంది.

యమహా ఏరోక్స్ 155

ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఆటో ఎక్స్ పోకు ముందు దేశీయ రహదారుల మీద అత్యంత రహస్యంగా పరీక్షించింది. అంతే కాకుండా, మలేషియా, ఫిలిప్పీన్స్, వియత్నా మరియు ఇండోనేషియా వంటి మార్కెట్లో లాంచ్ చేసింది.

యమహా ఏరోక్స్ 155

యమహా షోరూమ్‌లో ప్రదర్శించి ఏరోక్స్ 155 స్కూటర్‌లో ట్విన్ ఐ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, బ్రేక్ లైట్లు, స్మార్ట్ కీ సిస్టమ్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 5.8-అంగుళాల పరిమాణంలో ఉన్న ఎల్‌సీడీ స్క్రీన్ వంటి ఫస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్లు ఎన్నో ఉన్నాయి.

యమహా ఏరోక్స్ 155

యమహా ఏరోక్స్ 155 స్కూటర్‌లో 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు 25 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కెపాసిటి ఉంది. బ్రేకింగ్ కోసం ఫ్రంట్ వీల్‌కు ఏబీఎస్ అనుసంధానం గల డిస్క్ మరియు వెనుక వైపున డ్రమ్ బ్రేక్ సిస్టమ్ ఉంది.

యమహా ఏరోక్స్ 155

సస్పెన్ పరంగా ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. ముందు మరియు వెనుక వైపున్న అల్లాయ్ వీల్స్‌కు వరుసగా 110 మరియు 140 కొలతల్లో ఉన్న టైర్లు అందివ్వడం జరిగింది.

యమహా ఏరోక్స్ 155

యమహా ఏరోక్స్ ప్రీమియం స్కూటర్‌లో 155సీసీ కెపాసిటి గల బ్లూకోర్ లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 14.8బిహెచ్‌పి పవర్ మరియు 14.4ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ మరియు ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ గల భారతదేశపు తొలి స్కూటర్ యమహా ఏరోక్స్ 155 కానుంది.

యమహా ఏరోక్స్ 155

యమహా ఇండియా ఏరోక్స్ 155 స్కూటర్‌ను అఫీషియల్‍గా లాంచ్ చేస్తే, విపణిలో ఉన్న అప్రిలియా ఎస్ఆర్150, అప్‌కమింగ్ సుజుకి బర్గ్‌మ్యాన్ 155 మరియు వెస్పా శ్రేణిలో ఉన్న పలు స్కూటర్లకు గట్టి పోటీనివ్వనుంది.

యమహా ఏరోక్స్ 155

యమహా ఏరోక్స్ 155 ధర గురించి ఎలాంటి సమాచారం లేదు, అయితే మార్కెట్లో ఉన్న పరిస్థితుల పరంగా చూస్తే దీని ధర అంచనాగా రూ. 75,000 నుండి రూ. 80,000 మధ్య ఉండవచ్చు. తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అంతర్జాతీయ మోడల్ ఏరోక్స్ 155లో కొన్ని ఫీచర్లను తొలగించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: Yamaha Aerox scooter on display at a Yamaha dealership in India
Story first published: Friday, June 22, 2018, 17:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X