మరో రెండు రంగుల్లో యమహా సిగ్నస్ రే జడ్ఆర్

Written By:

యమహా మోటార్ ఇండియా తమ సిగ్నస్ రే జడ్ఆర్‌ స్పోర్టివ్ స్కూటర్‌లో మరో రెండు కొత్త రంగులను పరిచయం చేసింది. యమహా సిగ్నస్ రే జడ్ఆర్ ఇప్పుడు అర్మాండా బ్లూ మరియు డార్క్‌నైట్ బ్లాక్ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది.

యమహా సిగ్నస్ రే జడ్ఆర్

కలర్ ఆప్‍‌డేట్స్‌తో వచ్చిన యమహా సిగ్నల్ రే జడ్ఆర్ ధరలలో ఎలాంటి మార్పులు జరగలేదు. డ్రమ్ వేరియంట్ ధర రూ. 53,451 మరియు డిస్క్ వేరియంట్ ధర రూ. 55,898 మరియు డార్క్‌నైట్ ఎడిషన్ ధర రూ. 56,898. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి. మరియు రెండు కొత్త కలర్ ఆప్షన్స్ కూడా డిస్క్ బ్రేక్ వేరియంట్లో మాత్రమే లభిస్తున్నాయి.

యమహా సిగ్నస్ రే జడ్ఆర్

సాంకేతికంగా యమహా సిగ్నస్ రే జడ్ఆర్‌లో అదే 113సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. సివిటి ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభించే ఇది 7బిహెచ్‌పి పవర్ మరియు 8.1ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిగ్నస్ రే జడ్ఆర్ మొత్తం బరువు 103కిలోలుగా ఉంది.

Recommended Video - Watch Now!
New Honda Activa 5G Walkaround, Details, Specifications, First Look
యమహా సిగ్నస్ రే జడ్ఆర్

యమహా సిగ్నస్ రే జడ్ఆర్ స్కూటర్‌లో ఇంజన్ కంబషన్(మండే) సామర్థ్యం అధికంగా ఉండటంతో సెగ్మెంట్ బెస్ట్ మైలేజ్ ఇస్తోంది. దీని మైలేజ్ లీటర్‌కు 66కిలోమీటర్లుగా ఉంది. 20-లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, సులభంగా రైడ్ చేసేందుకు సాధ్యపడే ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ట్యూబ్ లెస్ టైర్లు వంటి ఇతర ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

యమహా సిగ్నస్ రే జడ్ఆర్

యువ కొనుగోలుదారులను టార్గెట్ చేసుకుని యమహా ఇండియా సిగ్నస్ రే జడ్ఆర్ స్కూటర్‌ను ఇది వరకే విపణిలోకి లాంచ్ చేసింది. అదే విధంగా సిగ్నస్ ఆల్ఫా మరియు ఫ్యాసినో స్కూటర్లను ప్రత్యేకించి ఫ్యామిలీ కోసం ప్రవేశపెట్టింది. ఇప్పుడు మరో రెండు కలర్ ఆప్షన్స్ పరిచయం చేయడంతో కస్టమర్లు విభిన్న రంగుల్లో సిగ్నస్ రే జడ్ఆర్ ఎంచుకునే అవకాశం కలిగింది.

యమహా సిగ్నస్ రే జడ్ఆర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ స్కూటర్ల విభాగంలో యువతను టార్గెట్ చేస్తున్న స్పోర్టివ్ స్కూటర్లలో యమహా సిగ్నస్ రే జడ్ఆర్ స్కూటర్ ఒకటి. అత్యుత్తమ మైలేజ్ అగ్రెసివ్ మరియు స్పోర్టివ్ శైలిలో ఉన్న డిజైన్ మరియు పలు ప్రీమియమ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మరో రెండు నూతన కలర్ ఆప్షన్స్ పరిచయం చేయడంతో కస్టమర్లకు మరింత చేరువకానుంది.

Read more on: #yamaha #యమహా
English summary
Read In Telugu: Yamaha Cygnus Ray ZR Gets Two New Colour Options
Story first published: Monday, March 19, 2018, 9:44 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark