యమహా సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ విడుదల: ఇవీ ప్రత్యేకతలు!!

జపనీస్ టూ వీలర్ల తయారీ దిగ్గజం యమహా ఇండియన్ మార్కెట్లోకి తమ తొలి ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ ర్యాలీ స్కూటర్ సిగ్నస్ రే జడ్ఆర్ ర్యాలీ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది.

By Anil Kumar

యమహా టూ వీలర్స్ ఇండియా విపణిలోకి సరికొత్త యమహా సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ స్కూటర్‌ను విడుదల చేసింది. జపనీస్ టూ వీలర్ల తయారీ దిగ్గజం యమహా ఇండియన్ మార్కెట్లోకి తమ తొలి ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ ర్యాలీ స్కూటర్ సిగ్నస్ రే జడ్ఆర్ ర్యాలీ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. సరికొత్త యమహా సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ వేరియంట్ ధర రూ. 57,898 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

యమహా సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ విడుదల: ఇవీ ప్రత్యేకతలు!!

యమహా గ్లోబల్ టూ వీలర్ల ప్రేరణతో సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్‌ను రూపొందించారు. రే జడ్ఆర్ స్టాండర్డ్ వేరియంట్‌తో పోల్చుకుంటే స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ డిజైన్ స్పోర్టివ్‌గా ఉంది. కొత్తగా విడుదలైన యమహా సిగ్నస్ రేజడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ జూలై 2018 చివరి వారం నుండి దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

యమహా సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ విడుదల: ఇవీ ప్రత్యేకతలు!!

యమహా ఎమ్‌టి-09 బైకు ప్రేరణతో వచ్చిన సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ఎడిషన్ స్కూటర్ ఫ్రంట్ డిజైన్‌లో "వింగ్ స్టైల్ ఫెయిరింగ్" ఉంది. ఈ రెక్కల ఆకారంలో ఉన్న ఈ ఫ్రంట్ ఫెయిరింగ్ విండ్ స్క్రీన్ తరహాలో స్కూటర్‌కు మంచి స్పోర్టివ్ లుక్ తీసుకొచ్చింది.

యమహా సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ విడుదల: ఇవీ ప్రత్యేకతలు!!

యమహా సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్‌లో ముందు వైపున ఉన్న ఫెండర్స్‌ను అడ్జెస్ట్ చేసుకోవచ్చు. స్పోర్టివ్ రైడింగ్‌లో బురద మరియు మట్టి నుండి మనల్ని రక్షిస్తాయి. అంతే కాకుండా, ఈ స్కూటర్‌లో "రైజింగ్ ఎయిర్ డిజైన్" కలదు. ఇందులో పదునైన మరియు స్పోర్టివ్ మిర్రర్స్ మరియు డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.

యమహా సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ విడుదల: ఇవీ ప్రత్యేకతలు!!

కొత్తగా విడుదలైన యమహా సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ స్కూటర్‌లో అదే 113సీసీ కెపాసిట గల గాలితో చల్లబడే బ్లూ-కోర్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, సీటీవీ గేర్‌బాక్స్ గల ఇది 7.1బిహెచ్‌పి పవర్ మరియు 8.1ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

యమహా సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ విడుదల: ఇవీ ప్రత్యేకతలు!!

యమహా సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ స్కూటర్‌లో ముందు వైపున 170ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున డ్రమ్ బ్రేక్ ఉంది. అల్లాయ్ వీల్స్, 21-లీటర్ల విశాలమైన అండర్ సీట్ స్టోరేజ్, ఫ్రంట్ పాకెట్, కీ సెక్యూర్ గ్రిప్ సిస్టమ్, ఎడ్జీ మరియు హై రైజింగ్ టెయిల్ లైట్ మరియు రెండు దశలలో అడ్జెస్ట్ చేసుకునే వీలున్న సీటు తదితర కీలకమైన ఫీచర్లు ఉన్నాయి.

యమహా సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ విడుదల: ఇవీ ప్రత్యేకతలు!!

యమహా సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ స్కూటర్ రెండు విభిన్న రంగుల్లో లభ్యమవుతుంది. అవి, ర్యాలీ రెడ్ మరియు రేసింగ్ బ్లూ. సస్పెన్షన్ పరంగా ముందు వైపున మెరుగైన టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ ఉంది.

యమహా సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ విడుదల: ఇవీ ప్రత్యేకతలు!!

యమహా ఇండియన్ విభాగం దేశీయ స్కూటర్ల విపణిలోకి సిగ్నస్ రే జడ్ఆర్ స్కూటర్‌ను స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్‌లో లాంచ్ చేసింది. సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ స్కూటర్‌ను ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది.

More from DriveSpark

Article Published On: Monday, July 16, 2018, 12:58 [IST]
English summary
Read In Telugu: Yamaha Cygnus Ray ZR ‘Street Rally’ Edition Launched In India; Priced At Rs 57,898
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+