మరో రెండు కొత్త రంగుల్లో యమహా ఫ్యాసినో

Written By:

యమహా ఇండియా తమ ఫ్యాసినో స్టైలిష్ స్కూటర్‌లో మరో రెండు కొత్త రంగులను పరిచయం చేసింది. యమహా ఫ్యాసినో ఇప్పుడు రెండు విభిన్న రంగుల్లో లభిస్తోంది. అవి, గ్లామరస్ గోల్డ్ మరియు డ్యాపర్ బ్లూ.

కొత్త రంగుల్లో యమహా ఫ్యాసినో

కొత్త కలర్ ఆప్షన్స్‌లో పరిచయమైన యమహా ఫ్యాసినో అవే మునుపటి ధరలతో లభిస్తోంది. అన్ని కలర్ ఆప్షన్స్‌లో లభమయ్యే యమహా ఫ్యాసినో స్కూటర్ ప్రారంభ ధర రూ. 54,593 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. జపాన్ దిగ్గజం యమహా భారత్‌లో రే జడ్ స్కూటర్ తరువాత అందిస్తున్న అత్యంత సరసమైన మోడల్ ఫ్యాసినో.

కొత్త రంగుల్లో యమహా ఫ్యాసినో

నూతన రంగుల జోడింపు మినహా, యమహా ఫ్యాసినో స్కూటర్‌లో డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు. ఫ్యాసినో ఫ్రంట్ డిజైన్ బ్లాక్ ప్యానల్స్ మరియు ఎయిర్ వెంట్స్‌తో చాలా విభిన్నంగా ఉటుంది. డ్యూయల్ టోన్ సీట్ కవర్ మరియు రియర్ రైడర్ కోసం పెద్ద పరిమాణంలో ఉన్న గ్రాబ్ రెయిల్ ఉంది.

కొత్త రంగుల్లో యమహా ఫ్యాసినో

సాంకేతికంగా, యమహా ఫ్యాసినో స్కూటర్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇందులో ఉన్న అదే మునుపటి 113సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ బ్లూ-కోర్ ఇంజన్ 7బిహెచ్‌పి పవర్ మరియు 8.1ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి సివిటి ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

కొత్త రంగుల్లో యమహా ఫ్యాసినో

సస్పెన్షన్ పరంగా యమహా ఫ్యాసినో స్కూటర్‌లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్వర్ కలదు. 103కిలోలు బరువున్న ఇందులో 5.2-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కలదు. యమహా కథనం మేరకు, ఫ్యాసినో గరిష్ట మైలేజ్ లీటరుకు 66కిలోమీటర్లుగా ఉంది.

కొత్త రంగుల్లో యమహా ఫ్యాసినో

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియాలో యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని యమహా ఇండియా ఫ్యాసినో స్టైలిష్ స్కూటర్‌ను విడుదల చేసింది. తాజాగా, మరో రెండు కొత్త రంగులను పరిచయం చేయడంతో కస్టమర్లను మరింత ఆకట్టుకోనుంది. ఫ్యాసినో స్కూటర్‌ను గ్లామరస్ గోల్డ్, డ్యాపర్ బ్లూ, బీమింగ్ బ్లూ, డాజ్లింగ్ గ్రే, సిజ్లింగ్ సియాన్, స్పాట్‌లైట్ వైట్, సిస్సీ సియాన్ వంటి రంగుల్లో ఎంచుకోవచ్చు.

మరో రెండు కొత్త రంగుల్లో యమహా ఫ్యాసినో

1. కారుకు కుడి లేదా ఎడమవైపునే స్టీరింగ్ వీల్ ఉంటుంది మధ్యలో ఎందుకు ఉండదు?

2.రాయలసీమలో ఖచ్చితంగా వెళ్లాల్సిన 15 రోడ్ ట్రిప్స్

3.ఆరు ఎయిర్ బ్యాగులతో అత్యంత సరసమైన ధరలో లభించే కార్లు

4.టియాగో కారు ఢీకొట్టడంతో రెండుగా చీలిపోయిన ట్రాక్టర్: ఇదీ కారు పరిస్థితి!

5.125సీసీ స్కూటర్ కొంటున్నారా...? అయితే దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!!

Read more on: #yamaha #యమహా
English summary
Read In Telugu: Yamaha Fascino Gets Two New Colour Options
Story first published: Monday, April 9, 2018, 16:18 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark