లోపం ఉన్న 24,000 బైకులను రీకాల్ చేసిన యమహా ఇండియా

యమహా గత ఏడాదిలో విడుదల చేసిన ఎఫ్‌జడ్25 మరియు ఫేజర్ 25 బైకులను పెద్ద సంఖ్యలో రీకాల్ చేసింది. ఈ రెండు మోడళ్లలో హెడ్ కవర్ బోల్ట్ వదులు అవుతున్న కారణంతో సుమారుగా 23,897 బైకులను వెనక్కి పిలిచింది.

By Anil

Recommended Video

Bangalore Bike Accident At Chikkaballapur | Full Details - DriveSpark

యమహా మోటార్ ఇండియా గత ఏడాదిలో విడుదల చేసిన ఎఫ్‌జడ్25 మరియు ఫేజర్ 25 బైకులను పెద్ద సంఖ్యలో రీకాల్ చేసింది. ఈ రెండు మోడళ్లలో హెడ్ కవర్ బోల్ట్ వదులు అవుతున్న కారణంతో సుమారుగా 23,897 బైకులను వెనక్కి పిలిచినట్లు యమహా అధికారికంగా ప్రకటించింది.

యమహా బైకుల రీకాల్

హెడ్ ల్యాంప్ బోల్ట్ సమస్యాత్మకంగా ఉన్న బైకుల్లో సమస్యను వెంటనే పరిష్కరించడానికి సిద్దమైనట్లు యమహా తెలిపింది. జనవరి 2017 నుండి తయారైన బైకుల్లో ఈ సమస్యను గుర్తించారు.

యమహా బైకుల రీకాల్

రీకాల్‌కు గురైన మొత్తం బైకుల్లో 21,640 యూనిట్ల యమహా ఎఫ్‌జడ్ 25 మరియు 2,257 యూనిట్ల ఫేజర్ 25 బైకులు ఉన్నాయి. వినియోగదారుల భద్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలో భాగంగా రీకాల్ చేసినట్లు మరియు ఈ సమస్య కారణంగా ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఏవీ లేవని యమహా తెలిపింది.

యమహా బైకుల రీకాల్

యమహా డీలర్ల వద్ద రీకాల్‌కు గురైన బైకుల్లో లోపాన్ని పూర్తి ఉచితంగా సవరిస్తున్నట్లు మరియు రీకాల్ జాబితాలో ఉన్న బైకులను వివరాలను ఆయా కస్టమర్లతో వ్యక్తిగతంగా తెలియజేస్తున్నట్లు తెలిసింది. కాబట్టి, మీ బైకులో సమస్య ఉన్నట్లయితే యమహా ఇండియా మిమ్మల్ని డైరక్టుగా సంప్రదిస్తుంది.

యమహా బైకుల రీకాల్

బైకు ఓనర్లను సంప్రదించడం మరియు సమస్య ఉన్న బైకుల్లో లోపాన్ని సవరించడం గురించి యమహా దేశవ్యాప్తంగా ఉన్న తమ అధీకృత డీలర్లతో కలిసి పనిచేస్తోంది. మీ వద్ద ఎఫ్‌జడ్25 మరియు ఫేజర్ 25 బైకు ఉన్నట్లయితే ఓసారి సమీపంలోని డీలర్ వద్ద మీ బైకును చెక్ చేయించుకోండి.

యమహా బైకుల రీకాల్

యమహా ఇండియా ఎఫ్‌జడ్ 25 బైకును జనవరి 2017లో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. 250సీసీ ఇంజన్ కెపాసిటి గల ఎఫ్‌జడ్ 25 క్వార్టర్ లీటర్ ఇంజన్ సెగ్మెంట్లో అత్యుత్తమ ఫలితాలు కనబరుస్తోంది. ఆ తరువాత లాంచ్ చేసిన ఫేజర్ 25 బైకులో ఎఫ్‌జడ్ 25 నుండి సేకరించిన విడి భాగాలను అందించారు.

యమహా బైకుల రీకాల్

రెండు బైకుల్లో249సీసీ కెపాసిటి గల ఆయిల్ ద్వారా చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 20.6బిహెచ్‌పి పవర్ మరియు 20ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Trending On DriveSpark Telugu:

సరదా కోసం చేసిన బైక్ రైడ్‌లో 11 ఏళ్ల చిన్నారిని చంపేశాడు, చితకబాదిన గ్రామస్థులు

రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్‌లో ఎలక్ట్రిక్ బుల్లెట్ బైకు

2017లో విడుదలైన బెస్ట్ బైకులు

యమహా బైకుల రీకాల్

సస్పెన్షన్ పరంగా ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ కలదు. బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ వీల్‌కు 282ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు రియర్ వీల్‌కు 220ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు.

యమహా బైకుల రీకాల్

యమహా ఈ రెండు బైకుల్లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ మిస్ చేసింది తప్పితే, క్వార్టర్ లీటర్ ఇంజన్ సెగ్మెంట్లో ఇదొక బెస్ట్ పర్ఫామెన్స్ నేక్డ్ వెర్షన్ బైకు. యమహా ఎఫ్‌జడ్ 25 మరియు ఫేజర్ 25 బైకుల ధరలు వరుసగా రూ. 1.19 లక్షలు మరియు 1.22 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

యమహా బైకుల రీకాల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కస్టమర్లు గుర్తించి డీలర్లకు ఫిర్యాదు చేయడానికి ముందే, యమహా మోటార్ ఇండియా ఎఫ్‌జడ్ 25 మరియు ఫేజర్ 25 బైకుల్లో లోపం ఉన్నట్లు గుర్తించి స్వచ్ఛందంగా రీకాల్ చేసింది. ఈ నిర్ణయం విక్రయించిన బైకుల పట్ల యమహా ఇండియాకు ఉన్న భాద్యతను గుర్తు చేస్తోంది. మీ వద్ద యమహా ఎఫ్‌జడ్ 25 లేదా ఫేజర్ 25 బైకు ఉన్నట్లయితే సమీపంలోని డీలరును వెంటనే సంప్రదించండి, మీ స్నేహితులు బంధువుల వద్ద ఉంటే ఈ విషయాన్ని తెలియజేయండి...

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Yamaha FZ25 & Fazer 25 Recalled In India — Nearly 24,000 Units Affected
Story first published: Tuesday, January 9, 2018, 12:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X