సరికొత్త అప్‌డేట్స్‌తో విడుదలైన యమహా FZ-S FI:ధర రూ. 86,042లు

Written By:
Recommended Video - Watch Now!
Indian Army Soldiers Injured In Helicopter Fall - DriveSpark

జపాన్ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం యమహా అప్‌డేట్స్ నిర్వహించిన ఎంట్రీ లెవల్ పర్ఫామెన్స్ బైకు ఎఫ్‌జడ్-ఎస్ ఎఫ్ఐ(FZ-S FI)ను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. సరికొత్త యమహా ఎఫ్‌జడ్-ఎస్ ఎఫ్ఐ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 86,042 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

యమహా ఎఫ్‌జడ్-ఎస్ ఎఫ్ఐ

యమహా తమ పాపులర్ ఎఫ్‌జడ్-ఎస్ ఎఫ్ఐ పర్ఫామెన్స్ బైకులో వెనుక వైపున 220ఎమ్ఎమ్ హైడ్రాలిక్ సింగల్ డిస్క్ బ్రేక్ మరియు ముందు వైపున 282ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్‌లను అందించి అప్‌డేట్ చేసింది.

యమహా ఎఫ్‌జడ్-ఎస్ ఎఫ్ఐ

రియర్ డిస్క్ బ్రేక్ అప్‌డేట్‌తో వచ్చిన బైకులో గతంలో ఉన్న 5-స్పోక్ డిజైన్ అల్లాయ్ వీల్స్ స్థానంలో 10-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ పరిచయం చేసింది. అదనంగా ఎఫ్‌జడ్-ఎస్ ఎఫ్ఐ బైకు అర్మాడా బ్లూ కలర్ ఆప్షన్ కూడా వచ్చింది.

యమహా ఎఫ్‌జడ్-ఎస్ ఎఫ్ఐ

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యమహా విక్రయ కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చిన FZ-S FI బైకులో 149సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 12.9బిహెచ్‌పి పవర్ మరియు 12.8ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

యమహా ఎఫ్‌జడ్-ఎస్ ఎఫ్ఐ

యమహా ఇండియా సుమారుగా పదేళ్ల క్రితమే FZ-S పాపులర్ బైకును లాంచ్ చేసింది. జపాన్ దిగ్గజం అప్పటి నుండి నిలకడగా ఫలితాలు సాధిస్తోంది. విపణిలో ఉన్న సుజుకి జిక్సర్, బజాజ్ పల్సర్ 160 మరియు హోండా సిబి హార్నెట్ 160ఆర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

Trending On DriveSpark Telugu:

రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

మొదటిసారి రోడ్డెక్కిన 2018 మారుతి స్విఫ్ట్

ప్రతి కారులో తప్పనిసరిగా ఉండాల్సిన యాక్ససరీలు!

యమహా ఎఫ్‌జడ్-ఎస్ ఎఫ్ఐ

యమాహా మోటార్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాయ్ కురియన్ మాట్లాడుతూ, "భారత్‌లో మోటార్ సైకిళ్ల ప్యాషన్ ఉన్న అభిమానులకు ఎఫ్‌జ్ సిరీస్ బైకులు ప్రధాన ఎంపికగా నిలిచాయి. గత పదేళ్లలో విడుదలైనప్పటి నుండి కొన్ని లక్షల మంది ఎఫ్‌జ్ బైక్ ప్రేమికుల హృదయాలను దోచుకుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేకుతో పాటు రియర్ డిస్క్ బ్రేకును కూడా అప్‌డేట్ చేశామని చెప్పుకొచ్చాడు.

యమహా ఎఫ్‌జడ్-ఎస్ ఎఫ్ఐ

"నిర్మాణం, డిజైన్, సుపీరియర్ ఇంజన్ టెక్నాలజీ, అత్యుత్తమ మైలేజ్, మరియు బెస్ట్ సస్పెన్షన్ వంటి అంశాలతో యమహా ఎఫ్‌జడ్ సిరీస్ బైకులు మంచి సక్సెస్ అందుకున్నాయని", ఆయన తెలిపాడు.

యమహా ఎఫ్‌జడ్-ఎస్ ఎఫ్ఐ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2018 యమహా ఎఫ్‌జడ్-ఎస్ ఎఫ్ఐ బైకులో రియర్ డిస్క్ బ్రేక్ జోడింపుతో మోటార్ సైకిల్ యొక్క స్టెబిలిటి మరియు కంట్రోల్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 150సీసీ సెగ్మెంట్లో యమహా ఎఫ్‌జడ్-ఎస్ సెగ్మెంట్ లీడర్‌గా రాణిస్తోంది. ఇప్పుడు నూతన అప్‌డేట్స్‌తో సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Yamaha FZ-S FI With Rear Disc Brake & Several Updates Launched In India; Priced At Rs 86,042
Story first published: Friday, January 12, 2018, 18:57 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark