మోటోజీపీ ఎడిషన్‌లో సిద్దమైన యమహా ఆర్15 వెర్షన్ 3.0

జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం యమహా ఆగష్టు 2018లో ఆర్15 వెర్షన్ 3.0 మోడల్‌ను మోటోజీపీ ఎడిషన్‌లో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు తెలిసింది.

By Anil Kumar

యమహా తమ సరికొత్త వైజడ్ఎఫ్-ఆర్15 వెర్షన్ 3.0 మోడల్‌ను మోటోజీపీ ఎడిషన్‌లో అతి త్వరలో ఇండియాలో ఆవిష్కరించనుంది. తాజాగ అందిన సమాచారం మేరకు, జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం యమహా ఆగష్టు 2018లో ఆర్15 వెర్షన్ 3.0 మోడల్‌ను మోటోజీపీ ఎడిషన్‌లో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు తెలిసింది.

యమహా ఆర్15 మోటోజీపీ ఎడిషన్‌

సరికొత్త యమహా ఆర్15 వి3.0 ఫ్యాక్టరీ మోటోజీపీ మోటార్ సైకిల్ శైలిలో బ్లూ పెయింట్ స్కీమ్‌లో రానుంది. ఆర్15 బైకులో ముందు మరియు పక్కవైపుల మూవిస్టర్ లోగోలు వస్తాయి. అంతే కాకుండా, బైక్ అండర్ బెల్లీ డీకాల్స్ మీద ENEOS లోగో వస్తుంది.

యమహా ఆర్15 మోటోజీపీ ఎడిషన్‌

ఏదేమైనప్పటికీ, రేసింగ్ ఛాంపియన్స్ వాలెంటినో రోస్సీ మరియు మావెరిక్ వినేల్స్ రేసింగ్ నెంబర్లు ఈ యమహా ఆర్15 మోటోజీపీ ఎడిషన్ మోటార్ సైకిళ్ల మీద మిస్సయ్యాయి. మోటోజీపీ ఎడిషన్ ఆర్15 ఇప్పటికే పలు పశ్చిమాసియా మార్కెట్లలో విడుదలయ్యింది.

యమహా ఆర్15 మోటోజీపీ ఎడిషన్‌

మోటోజీపీ ఎడిషన్ యమహా ఆర్15 బైకులో కాస్మొటిక్ అప్‌డేట్స్ మరియు పెయింట్ స్కీమ్ మినహాయిస్తే మెకానికల్‌గా ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు. సాంకేతికంగా యమహా ఆర్15 మోటోజీపీ ఎడిషన్‌లో 155సీసీ కెపాసిటి గల ఫోర్-స్ట్రోక్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 19బిహెచ్‌పి పవర్ మరియు 15ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

యమహా ఆర్15 మోటోజీపీ ఎడిషన్‌

యమహా ఆర్15 వి3.0లో ప్రధానంగా గుర్తించదగిన ఇతర మార్పుల్లో, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్లిప్పర్ క్లచ్ మరియు ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. అంతర్జాతీయ మోడల్‌లో అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ ఉండగా ఇండియన్ మోడల్‌లో స్టాండర్డ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ ఉన్నాయి.

యమహా ఆర్15 మోటోజీపీ ఎడిషన్‌

ఇండియన్ మార్కెట్లో ఉన్న యమహా ఆర్15 వి3.0 మోటార్ సైకిల్ థండర్ గ్రే మరియు రేసింగ్ బ్లూ అనే రెండు పెయింట్ స్కీమ్‌లో లభ్యమవుతోంది. సరికొత్త మోటోజీపీ ఎడిషన్ ఈ రెండు మోడళ్లకు అదనంగా లభిస్తుంది.

యమహా ఆర్15 మోటోజీపీ ఎడిషన్‌

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మిడిల్ క్లాస్ అబ్బాయిల రేసింగ్ మోటార్ సైకిల్‌గా యమహా ఆర్15 బైకు బాగా ప్రసిద్ది చెందింది. రేసింగ్ ప్రియులకు మోటోజీపీ రైడింగ్ అనుభూతిని కల్పించేందుకు యమహా తమ ఎంట్రీ లెవల్ రేస్ మోటార్ సైకిల్‌ను మోటోజీపీ ఎడిషన్‌లో విడుదలకు సిద్దం చేసింది.

యమహా ఆర్15 మోటోజీపీ ఎడిషన్‌

యమహా ఆర్15 వి3.0 స్టాండర్డ్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 1.26 లక్షలు ఎక్స్-షోరూమ్‌(ఢిల్లీ)గా ఉంది. అయితే, మోటోజీపీ ఎడిషన్ ధర ఇంకాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Source: Autocar India

More from DriveSpark

Article Published On: Friday, June 22, 2018, 19:02 [IST]
English summary
Read In Telugu: Yamaha R15 Version 3.0 MotoGP Edition India Launch Details Revealed
Read more on: #yamaha #యమహా
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+