యమహా ఆర్15 మీద పెరిగిన ధర

యమహా ఇండియా తమ ఆర్15 వి3.0 బైకు ధరను స్వల్పంగా పెంచింది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో సరికొత్త యమహా ఆర్15 వి3.0 బైకును రూ. 1.25 లక్షలు పరిచయాత్మక ఎక్స్-షోరూమ్ ధ

యమహా ఇండియా తమ ఆర్15 వి3.0 (Yamaha R15 V3.0) బైకు ధరను స్వల్పంగా పెంచింది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో సరికొత్త యమహా ఆర్15 వి3.0 బైకును రూ. 1.25 లక్షలు పరిచయాత్మక ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేశారు.

యమహా ఆర్15 మీద పెరిగిన ధర

యమహా లైనప్‌‌లో ఉన్న ఆర్6 మరియు ఆర్1 సూపర్ బైకుల ప్రేరణతో 150సీసీ ఫుల్లీ ఫెయిర్డ్ మోటార్ ఆర్15 బైకును మూడవ వెర్షన్‌లో తీసుకొచ్చింది. ఇండియన్ మార్కెట్లో అత్యంత పాపులారిటీ దక్కించుకున్న ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకుల్లో యమహా ఆర్15 ఒకటి.

యమహా ఆర్15 మీద పెరిగిన ధర

పెట్టుబడి ఖర్చులు అధికమవ్వడంతో 2018 యమహా ఆర్15 మీద ధరలు పెంపు చేపట్టినట్లు తెలిసింది. ఆర్15 వి3.0 బైకు ఆర్15ఎస్ వేరియంట్‌ పాటుగా లభిస్తోంది. ఈ సింగల్ పీస్ సీట్ వెర్షన్‌ను మునుపటి మోడల్ ఆధారంగా రూపొందించారు.

యమహా ఆర్15 మీద పెరిగిన ధర

సరికొత్త 2018 యమహా ఆర్15 వి3.0 బైకులో 155సీసీ సామర్థ్యం గల ఎస్ఓహెచ్‌సి, లిక్విడ్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. స్లిప్పర్ క్లచ్ సహాయంచో 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 19.3బిహెచ్‌పి పవర్ మరియు 15ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

యమహా ఆర్15 మీద పెరిగిన ధర

సస్పెన్షన్ పరంగా యమహా ఆర్15లో ముందు వైపున కన్వెన్షనల్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనక వైపున మోనోషోక్ అబ్జార్వర్ వంటివి ఉన్నాయి. బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు వైపున 282ఎమ్ఎమ్ మరియు వెనుక వైపున 220ఎమ్ఎమ్ చుట్టుకొలతలో ఉన్న సింగల్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

యమహా ఆర్15 మీద పెరిగిన ధర

టూ వీలర్ సేఫ్టీ ఫీచర్లలో అత్యంత కీలకమైన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కనీసం ఆప్షనల్‌గా కూడా లభ్యమవ్వలేదు. 2018 యమహా ఆర్15 వి3.0 లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్, ఫుల్లీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ మరియు గేర్ షిఫ్ట్ టైమింగ్ లైట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

యమహా ఆర్15 మీద పెరిగిన ధర

యమహా ఇండియా అతి త్వరలో ఆర్15 యొక్క మోటోజీపీ ఎడిషన్ విడుదల చేయాలని భావిస్తోంది. యమహా ఆర్15 మోటోజీపీ ఎడిషన్ ఇప్పటికే పలు పశ్చిమాసియా మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఇందులో కాస్మొటిక్ మెరుగు మినహాయిస్తే, సాంకేతికంగా మరియు డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

యమహా ఆర్15 మీద పెరిగిన ధర

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో అత్యంత చౌకైన ధరలో లభించే బెస్ట్ ట్రాక్-ఫోకస్డ్ మోటార్ సైకిల్ యమహా ఆర్15. వి3.0 వెర్షన్ విడుదలతో యమహా ఆర్15 నెలవారీ విక్రయాలు 3,000 నుండి 7,000 యూనిట్లకు పెరిగాయి. యమహా ఆర్15 వి3.0 దేశీయంగా ఉన్న హోండా సిబిఆర్ 150, సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ మరియు బజాజ్ పల్సర్ ఆర్200 వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

Read more on: #yamaha #యమహా
English summary
Read In Telugu: 2018 Yamaha R15 V3.0 Price Hike — Increased By Rs 2,000
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X