యమహా ఆర్15 మోటోజీపీ ఎడిషన్ ధర రూ. 1.30 లక్షలు

యమహా ఇండియా విపణిలోకి సరికొత్త వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0 మోటోజీపీ ఎడిషన్ బైకును విడుదల చేసింది. సరికొత్త యమహా ఆర్15 మోటోజీపీ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 1.30 లక్షలుగా ఉంది.

By Anil Kumar

యమహా ఇండియా విపణిలోకి సరికొత్త వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0 మోటోజీపీ ఎడిషన్ బైకును విడుదల చేసింది. సరికొత్త యమహా ఆర్15 మోటోజీపీ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 1.30 లక్షలుగా ఉంది. యమహా ఆర్15 స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 1.27 లక్షలతో పోల్చుకుంటే, మోటోజీపీ వేరియంట్ ధర 3,000 రుపాయలు అధికంగా ఉంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

యమహా వైజడ్ఎఫ్-ఆర్15 వి 3.0 మోటోజీపీ ఎడిషన్

యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి 3.0 మోటోజీపీ లిమిటెడ్ ఎడిషన్ బైకు. అంటే పరిమిత సంఖ్యలో మాత్రమే లభిస్తుంది. ఇది సరికొత్త యమహా రేసింగ్ బ్లూ కలర్ పెయింట్ స్కీమ్‌లో వచ్చింది. అంతే కాకుండా, బైకులోని ట్యాంక్, బాడీ డీకాల్స్ మరియు సైడ్ ప్యానళ్ల మీద మోటోజీపీ బ్రాండింగ్ వచ్చింది.

యమహా వైజడ్ఎఫ్-ఆర్15 వి 3.0 మోటోజీపీ ఎడిషన్

యమహా ఆర్15 మోటోజీపీ ఎడిషన్ బైకులో ముందు మరియు పక్కవైపుల మూవీస్టర్ లోగో కలదు. అంతే కాకుండా, ఇంజన్ క్రింది భాగంలో ఉన్న బెల్లీ ప్యాన్ ENEOS లోగో వచ్చింది. అయితే, లిమిటెడ్ ఎడిషన్ మోటోజీపీ వేరియంట్లో యమహా మోటోజీపీ రైడర్లయిన వాలెంటీనో రోస్సీ మరియు మావెరిక్ వినేల్స్ సీరియల్ నెంబర్లు మిస్సయ్యాయి.

యమహా వైజడ్ఎఫ్-ఆర్15 వి 3.0 మోటోజీపీ ఎడిషన్

రేసింగ్ బ్లూ పెయింట్ స్కీమ్, నూతన బాడీ డీకాల్స్ మరియు మోటోజీపీ బ్రాండింగ్ లోగోలు మినహాయిస్తే డిజైన్ మరియు సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఏదేమైనప్పటికీ, రెగ్యులర్ ఆర్15 తో పోల్చితే మోటోజీపీ వేరియంట్ ఎంతో స్పోర్టివ్‌గా ఉంది.

యమహా వైజడ్ఎఫ్-ఆర్15 వి 3.0 మోటోజీపీ ఎడిషన్

లిమిటెడ్ ఎడిషన్ యమహా ఆర్15 వి 3.0 బైకులో సాంకేతికంగా అదే మునుపటి 155సీసీ సామర్థ్యం గల, ఫోర్ స్ట్రోక్, సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌ బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 19బిహెచ్‌పి పవర్ మరియు 15ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

యమహా వైజడ్ఎఫ్-ఆర్15 వి 3.0 మోటోజీపీ ఎడిషన్

ఫీచర్ల విషయానికి వస్తే, యమహా ఆర్15లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఫుల్లీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, 17-అంగుళాల పరిమాణంలో ఉన్న ఎమ్ఆర్ఎఫ్ టైర్లు (మెట్జలర్ టైర్లు ఆప్షనల్‌గా లభిస్తున్నాయి) మరియు స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

యమహా వైజడ్ఎఫ్-ఆర్15 వి 3.0 మోటోజీపీ ఎడిషన్

సస్పెన్షన్ పరంగా ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ ఉన్నాయి. బ్రేకింగ్ విధులు నిర్వర్తించడానికి ముందు వైపున 282ఎమ్ఎమ్ మరియు వెనుక వైపున 220ఎమ్ఎమ్ కొలతల్లో ఉన్న డిస్క్ బ్రేకులు ఉన్నాయి. అయితే, టూ వీలర్ల సేఫ్టీలో అత్యంత కీలకమైన ఏబిఎస్ ఫీచర్‌ను కనీసం ఆప్షనల్‌గా కూడా అందివ్వలేదు.

యమహా వైజడ్ఎఫ్-ఆర్15 వి 3.0 మోటోజీపీ ఎడిషన్

యమహా ఇండియా ఆర్15 మోటోజీపీ ఎడిషన్ విడుదలతో పాటు, "కాల్ ఆఫ్ ది బ్లూ" అనే క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా ఎఫ్‌జడ్ఎస్-ఎఫ్ఐ (FZS-Fi) వేరియంట్‌ను రియర్ డిస్క్ బ్రేక్‌తో విడుదల చేసింది.

యమహా వైజడ్ఎఫ్-ఆర్15 వి 3.0 మోటోజీపీ ఎడిషన్

మార్పులు చేర్పులతో విడుదలైన ఎఫ్‌జడ్ఎస్-ఎఫ్ఐ ఇప్పుడు మ్యాట్ గ్రీన్ మరియు డార్క్ నైట్ అనే రెండు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. సరికొత్త యమహా ఎఫ్‌జడ్ఎస్-ఎఫ్ఐ ధర రూ. 87,042 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

యమహా వైజడ్ఎఫ్-ఆర్15 వి 3.0 మోటోజీపీ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యమహా ఇండియా సరికొత్త ఆర్15 మోటోజీపీ ఎడిషన్ బైకును కేవలం కాస్మొటిక్ హంగులతో మాత్రమే విడుదల చేసింది. అయితే, సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు. యమహా ఆర్15 విపణిలో ఉన్న సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్, హోండా సిబిఆర్150 మరియు బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 16, 2018, 15:46 [IST]
English summary
Read In Telugu: Yamaha YZF-R15 V 3.0 MotoGP Edition Launched In India At Rs 1.30 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+