యమహా ఆర్15 వి3.0 మోటోజీపీ ఎడిషన్‌ విడుదలకు ఏర్పాట్లు పూర్తి

జపాన్ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం యమహా టూ వీలర్స్ విపణిలోకి సరికొత్త వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0 బైకును మోటోజీపీ ఎడిషన్‌లో ఆవిష్కరించాడనికి సిద్దమైంది. యమహా ఇండియా తాజాగా ఆర్15 వి3.0 మోటోజీపీ ఎడిషన్ బైకు టీ

By Anil Kumar

జపాన్ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం యమహా టూ వీలర్స్ విపణిలోకి సరికొత్త వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0 బైకును మోటోజీపీ ఎడిషన్‌లో ఆవిష్కరించాడనికి సిద్దమైంది. యమహా ఇండియా తాజాగా ఆర్15 వి3.0 మోటోజీపీ ఎడిషన్ బైకు టీజర్ వీడియోను రివీల్ చేసింది.

యమహా ఆర్15 వి3.0 మోటోజీపీ ఎడిషన్‌

యమహా ఇండియా ఈ ఆగష్టులో వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0 మోటోజీపీ ఎడిషన్ బైకును ఇది వరకటి కథంలో ప్రచురించాము. అనుకున్నట్లుగానే, మోటోజీపీ ఎడిషన్‌ విడుదలకు కసరత్తులు ప్రారంభించింది.

యమహా ఆర్15 వి3.0 మోటోజీపీ ఎడిషన్‌

యమహా టూ వీలర్స్ అంతర్జాతీయంగా ఉన్న పలు మార్కెట్లలో ఇప్పటికే ఆర్15 వి3.0 మోటోజీపీ బైకును విక్రయిస్తోంది. ఈ మోటోజీపీ ఎడిషన్‌లో కాస్మొటిక్ అప్‌డేట్స్ మినహాయిస్తే, సాంకేతికంగా మరియు డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

యమహా ఆర్15 వి3.0 మోటోజీపీ ఎడిషన్‌

సరికొత్త యమహా ఆర్15 వి3.0 మోటోజీపీ ఎజిషన్ బైకులో అదే మునుపటి 155సీసీ సామర్థ్యం గల లిక్విడ్-కూల్డ్ ఇంజన్ కలదు. స్లిప్పర్ క్లచ్ సహాయంతో అనుసంధానం చేసిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ గల ఈ ఇంజన్ గరిష్టంగా 19బిహెచ్‌పి పవర్ మరియు 15ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

యమహా ఆర్15 వి3.0 మోటోజీపీ ఎడిషన్‌

యమహా ఆర్15 వి3.0 బైకులో పలుచటి ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఆల్-న్యూ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఏరోడైనమికల్‌గా డిజైన్ చేసిన టెయిల్ ల్యాంప్, విశాలమైన వెనుకటైరు వంటి విభిన్నమైన ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా, సీటు కవర్, ట్యాంక్ ప్యాడ్, ఫ్రేమ్ స్లైడర్, స్కిడ్ ప్లేట్, మెట్జలర్ రియర్ టైర్ మరియు డేటోనా మఫ్లర్ పలు అత్యాధునిక యాక్ససరీలు పరిచయం అయ్యాయి.

యమహా ఆర్15 వి3.0 మోటోజీపీ ఎడిషన్‌

యమహా ఇండియా ఇటీవల స్టాండర్డ్ ఆర్15 వి3.0 మీద రూ. 2,000 మేర ధరను పెంచింది. కాబట్టి ఆర్15 మోటోజీపీ వేరియంట్ ధర స్టాండర్డ్ వేరియంట్ కంటే కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ, మోటోజీపీ వెర్షన్ కంపెనీకి ఖచ్చితంగా సేల్స్ పెంచనున్నాయి.

యమహా ఆర్15 వి3.0 మోటోజీపీ ఎడిషన్‌

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యమహా ఆర్15 వి3.0 మోటోజీపీ వెర్షన్ బైక్‌కు మంచి స్పోర్టివ్ తత్వాన్ని తీసుకొచ్చింది. భారతదేశపు ఎంట్రీ లెవల్ స్పోర్ట్ మోటార్ సైకిల్ యమహా ఆర్15 వి3.0 యొక్క మోటోజీపీ ఎడిషన్‌ను స్టాండర్డ్ వేరియంట్‌తో పోల్చిచూసినపుడు బాడీ డీకాల్స్ మీద అక్కడక్కడా మోటోజీపీ గ్రాఫిక్స్ మరియు లోగోలను గుర్తించవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, August 11, 2018, 11:42 [IST]
English summary
Read In Telugu: Yamaha R15 Version 3.0 MotoGP Edition Teased Ahead Of Launch
Read more on: #yamaha #యమహా
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+