యమహా రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ డెలివరీలు ప్రారంభం

యమహా టూ వీలర్స్ ఇండియా ఇటీవల సరికొత్త రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ స్కూటర్‌ను విపణిలోకి లాంచ్ చేసింది స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ సిగ్నస్ రే జడ్ఆర్ స్కూటర్ యొక్క కొత్త వేరియంట్. యమహా రే జడ్ఆర్ స్ట్రీట్

By Anil Kumar

యమహా టూ వీలర్స్ ఇండియా ఇటీవల సరికొత్త రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ స్కూటర్‌ను విపణిలోకి లాంచ్ చేసింది స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ సిగ్నస్ రే జడ్ఆర్ స్కూటర్ యొక్క కొత్త వేరియంట్. యమహా రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ ధర రూ. 57,898 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

యమహా రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్

రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ స్కూటర్లు ఇప్పుడు డీలర్లను చేరుతున్నాయి, డెలివరీలు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. యమహా ఇండియా ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఆటో ఎక్స్ పోలో రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ స్కూటర్‌ను ఆవిష్కరించింది.

యమహా రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్

యమహా అంతర్జాతీయ మోడళ్ల ప్రేరణతో రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన‌ను రూపొందించారు. సాధారణ వెర్షన్‌తో పోల్చుకుంటే స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ స్కూటర్ చూడటానికి అగ్రెసివ్ మరియు స్పోర్టివ్ డిజైన్ శైలిలో ఉంటుంది.

యమహా రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్

సరికొత్త యమహా సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ ఫ్రంట్ డిజైన్‌లో వింగ్-స్టైల్ రూపంలో ఉన్న ఫెయింరింగ్ గుర్తించవచ్చు. ఎమ్‌టి-09 ప్రేరణతో రూపొందించిన ఫెయిరింగ్ విండ్ స్కీన్ మాదిరిగా కూడా పనిచేస్తుంది.

యమహా రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్

యమహా రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్‌లో అత్యాధునిక నూతన ఫీచర్లతో పరిచయం అయ్యాయి. మూవబుల్ ఫ్రంట్ ఫెండర్, కీ సెక్యూర్ గ్రిప్ సిస్టమ్, టు-లెవల్ హైట్ అడ్జెస్ట్ సీటు, ఆల్-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు స్కూటర్ బాడీ మరియు ఫెయిరింగ్ మీద స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ గ్రాఫిక్స్ ఉన్నాయి.

యమహా రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్

యమహా సిగ్నస్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ స్కూటర్‌లో సాంకేతికంగా 113సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సీవీటీ ట్రాన్స్‌మిషన్ గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 7.1బిహెచ్‌పి పవర్ మరియు 8.10ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

యమహా రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యమహా రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ స్కూటర్ విపణిలో ఉన్న హోండా డియో, టీవీఎస్ జూపిటర్, హీరో మాయెస్ట్రో ఎడ్జ్ మరియు హోండా యాక్టివా 5జీ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది. అగ్రెసివ్ డిజైన్ మరియు స్పోర్టివ్ గ్రాఫిక్స్‌తో యువ కొనుగోలుదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

More from DriveSpark

Article Published On: Wednesday, August 1, 2018, 18:03 [IST]
English summary
Read In Telugu: Yamaha Ray ZR ‘Street Rally’ Edition Deliveries Begin
Read more on: #yamaha #యమహా
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+