స్ట్రీట్ ర్యాలీ స్కూటర్ సిద్దం చేస్తున్న యమహా

యమహా రే జడ్ఆర్ జపాన్ దిగ్గజం యమహా యొక్క 110సీసీ స్పోర్టివ్ స్కూటర్. ఇప్పుడు, యమగహా ఇండియా రే జడ్ఆర్ స్కూటర్‍‌ను సరికొత్త వేరియంట్లో లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. యమహా ఇటీవల విడుదల చేసిన రీజర్ వ

By Anil Kumar

యమహా రే జడ్ఆర్ జపాన్ దిగ్గజం యమహా యొక్క 110సీసీ స్పోర్టివ్ స్కూటర్. ఇప్పుడు, యమగహా ఇండియా రే జడ్ఆర్ స్కూటర్‍‌ను సరికొత్త వేరియంట్లో లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. యమహా ఇటీవల విడుదల చేసిన రీజర్ వీడియోలో యమహా రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ వేరియంట్ స్కూటర్‌ను చూపించింది.

యమహా రే జడ్ఆర్ స్ట్రీట్

అంతే కాకుండా, యమహా ఇండియా ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఆటో ఎక్స్‌పోలో రే జడ్ఆర్ స్కూటర్‌ను పలు స్పోర్టివ్ గ్రాఫిక్స్ మరియు గోల్డెన్ అల్లాయ్ వీల్స్‌తో ఆవిష్కరించింది.

యమహా రే జడ్ఆర్ స్ట్రీట్

యమహా రివీల్ చేసిన టీజర్ వీడియోలోని స్కూటర్ గమనిస్తే రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ అనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న రే జడ్ఆర్ స్కూటర్‌తో పోల్చితే ర్యాలీ స్ట్రీట్ వేరియంట్ స్పోర్టివ్ డిజైన్‌లో ఉంటుంది.

యమహా రే జడ్ఆర్ స్ట్రీట్

యమహా రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ స్కూటర్‌లో పలు కాస్మొటిక్ అప్‌డేటట్స్, డిజైన్ పరంగా నూతన శైలిలో ఉన్న బాడీ డీకాల్స్ మరియు బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. రే జడ్ఆర్ ర్యాలీ స్ట్రీట్ వేరియంట్ స్టాండర్డ్ రే జడ్ఆర్ కంటే అత్యంత స్పోర్టివ్‌గా ఉంది.

యమహా రే జడ్ఆర్ స్ట్రీట్

అంతే కాకుండా, ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించినటువంటి రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ మోడల్‌లో ఉన్న సరికొత్త ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో వచ్చే అవకాశం ఉంది. ఇవి మినహాయిస్తే, డిజైన్ మరియు మెకానికల్‌గా ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు.

యమహా రే జడ్ఆర్ స్ట్రీట్

సాంకేతికంగా యమహా రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ స్పోర్టివ్ స్కూటర్‌లో అదే మునుపటి శక్తివంతమైన 113సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. సీవీటీ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది 7.1బిహెచ్‌పి పవర్ మరియు 8.1ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

యమహా రే జడ్ఆర్ స్ట్రీట్

యమహా రే జడ్ఆర్ స్పోర్టివ్ వేరియంట్ స్ట్రీట్ ర్యాలీ స్కూటర్‌లో ముందు వైపున 170ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున డ్రమ్ బ్రేక్ ఉంది. అదే విధంగా సస్పెన్షన్ కోసం ముందు వైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ వంటివి ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయ స్కూటర్ల విపణిలో స్పోర్టివ్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో యమహా ఇండియా విభాగం తమ రే జడ్ఆర్ 110 స్కూటర్‌ను స్పోర్టివ్ వెర్షన్‌లో లాంచ్ చేయడానికి కసరత్తులు ప్రారంభించింది. మరికొన్ని వారాల్లోపే దీని విడుల ఉండనుంది.

More from DriveSpark

Article Published On: Sunday, July 15, 2018, 9:00 [IST]
English summary
Read In Telugu: Yamaha Ray ZR Street Rally Scooter Teased Ahead Of Launch
Read more on: #yamaha #యమహా
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+