యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి2.0 కు శాశ్వత వీడ్కోలు

యమహా భారతదేశపు మోస్ట్ పాపులర్ మోటార్ సైకిల్ వైజడ్ఎఫ్-ఆర్15 వి2.0 బైకు విక్రయాలను శాశ్వతంగా నిలిపివేసింది. అవును, మీరు చదివింది నిజమే యమహా తమ ఇండియా టూ వీలర్ వెబ్‌సైట్ నుండి ఆర్15 వి2.0 బైకును తొలగించి

By Anil Kumar

యమహా భారతదేశపు మోస్ట్ పాపులర్ మోటార్ సైకిల్ వైజడ్ఎఫ్-ఆర్15 వి2.0 బైకు విక్రయాలను శాశ్వతంగా నిలిపివేసింది. అవును, మీరు చదివింది నిజమే యమహా తమ ఇండియా టూ వీలర్ వెబ్‌సైట్ నుండి ఆర్15 వి2.0 బైకును తొలగించింది.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి2.0 కు శాశ్వత వీడ్కోలు

యమహా విడుదల చేసిన మూడవ తరం ఆర్15 వి3.0 అత్యుత్తమ విక్రయాలు సాధిస్తుండటంతో, ఆర్15 వి2.0 మోడల్‌కు ఆశించిన డిమాండ్ లభించలేదు. దీంతో సెకండ్ జనరేషన్ ఆర్15 విక్రయాలకు పుల్‌స్టాప్ పెట్టేసింది.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి2.0 కు శాశ్వత వీడ్కోలు

భారతదేశపు ఎంట్రీ లెవల్ పర్ఫామెన్స్ స్పోర్ట్స్ బైకుల సెగ్మెంట్లో ఆర్15 అత్యంత కీలకమైన ఉత్పత్తి. యమహా ఆర్1 అతి పెద్ద రేస్ బైకు ప్రేరణతో రూపొందించిన ఆర్15 మోడల్ దేశీయంగా భారీ విజయాన్ని అందుకుంది. దీని విజయ పరంపర ఇప్పుడు మూడవ జనరేషన్ వరకు తీసుకొచ్చింది.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి2.0 కు శాశ్వత వీడ్కోలు

యమహా ఇండియా విభాగం తొలి ఆర్15 మోడల్‌ను పోలి ఉండేలా సింగల్ సీటుతో లభించే ఆర్15 ఎస్ మోడల్‌ను కూడా విక్రయిస్తోంది. ఆశ్చర్యకరంగా ఆర్15 ఎస్ మోడల్‌ను వెబ్‌సైట్లో అలాగే ఉంచి, ఆర్15 వి2.0 మోడల్‌ను తొలించింది. ఆశించిన ఆదరణ లభించకపోవడమే దీనిని మార్కెట్ నుండి తొలగించడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి2.0 కు శాశ్వత వీడ్కోలు

నిజానికి, యమహా ఆర్15 వి3.0 బైకును విడుదల చేసినపుడు, వి2.0 వెర్షన్‌ను మార్కెట్ నుండి తొలగించకుండా, యథావిధిగా విక్రయించింది. తొలుత ఆర్15 వి3.0 ఆశించిన ఫలితాలు సాధించకపోయినా గత కొన్ని నెలలుగా వి3.0 అమ్మకాలు పుంజుకున్నాయి. కాబట్టి, మూడవ తరానికి చెందిన ఆర్15 మంచి సక్సెస్ అందుకోవడంతో ఆర్15 వి2.0 కు శాశ్వతంగా పుల్‌స్టాప్ పెట్టేసింది.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి2.0 కు శాశ్వత వీడ్కోలు

యమహా ఇటీవల విపణిలోకి ఆర్15 మోటోజీపీ ఎడిషన్ బైకును విడుదల చేసింది. మోటోజీపీ ప్రేరణతో తీసుకొచ్చిన ఈ లిమిటెడ్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 1.30 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. బైకు బాడీ మీద ప్రత్యేకమైన డీకాల్స్ మరియు మోటోజీపీ లోగోలతో పాటు పలు సింబల్స్ ఉన్నాయి.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి2.0 కు శాశ్వత వీడ్కోలు

యమహా ఆర్15 వి3.0 బైకులో సాంకేతికంగా 155సీసీ కెపాసిటి గల లిక్విడ్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీ గల మరియు 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానమైన ఇంజన్ గరిష్టంగా 19బిహెచ్‌పి పవర్ మరియు 15ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే, ఆర్15 వి2.0 బైకులో స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీ లేదు.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి2.0 కు శాశ్వత వీడ్కోలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యమహా ఇండియా ఎంతో తెలివిగా ఆర్15 వి2.0 బైకును మార్కెట్లో కొనసాగిస్తూనే, వి3.0 బైకును లాంచ్ చేసింది. ఆర్15 వి3.0 విక్రయాలు పుంజుకోగానే వి2.0 బైకును మార్కెట్ నుండి తొలగించింది. కాబట్టి, ఇక మీదట ఆర్15 వి2.0 మోటార్ సైకిల్‌ను ఎంచుకోవాలంటే యమహా షోరూమ్‌కు కాకుండా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మంచి మోడల్ బైకును చూసి కొనుగోలు చేయడం ఎంతో ఉత్తమం.

More from DriveSpark

Article Published On: Monday, August 20, 2018, 9:46 [IST]
English summary
Read In Telugu: Yamaha YZF-R15 V2.0 Discontinued In India
Read more on: #yamaha #యమహా
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+