భారత మార్కెట్లో బోల్తా కొట్టిన 5 బైకులు ఏవో తెలుసా

ఇండియన్ మోటార్ సైకిల్ మార్కెట్ ఎల్లప్పుడూ కఠినమైన పోటీ ఉంటుంది. మార్కెట్ లో అతి పెద్ద తయారీదారులు అయిన హోండా, హీరో లు మాత్రమే చాలా వరకు అమ్మకాలను నమోదు చేసుకొన్నాయి. టాప్ త్రీ మోడల్స్ లో యాక్టివా, స్ప్లెండర్ మరియు హెచ్ ఎఫ్ డీలక్స్ మాత్రమే నెలకు దాదాపు 6 లక్షల యూనిట్ల వరకు అమ్మకాలతో ఉన్నాయి.

భారత మార్కెట్లో బోల్తా కొట్టిన 5 బైకులు ఏవో తెలుసా

మార్కెట్లో బ్రాండ్ పేరుకు ఎక్కువ మంది కట్టుబడి ఉండటానికి ఇష్టపడతారు, దీని వల్ల కొత్తగా వచ్చే బైకులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గత దశాబ్దంలో, అనేక మోటార్ సైకిళ్లను ప్రవేశపెట్టారు, ఇవి చూడడానికి గొప్పగా కనిపించినప్పటికీ, కొనుగోలుదారులను ఆకర్షిండంలో విఫలమైంది. వీటిలో 5 మోటార్ సైకిల్స్ ఈ జాబితాలో ఉన్నాయి అవి ఏటివో చుద్దాం రండి.

భారత మార్కెట్లో బోల్తా కొట్టిన 5 బైకులు ఏవో తెలుసా

కవాసకి జెడ్ 250

దీనిని ఇండియన్ మార్కెట్లో అత్యంత సరసమైన మోడల్ గా అక్టోబర్ 2014 పరిచయం చేశారు. ఈ బైక్ శక్తివంతమైన జెడ్800 మరియు జెడ్1000 యొక్క ప్రేరణ తో వచ్చింది. నింజా 250 నుంచి 249 సిసి సమాంతర ట్విన్ మోటార్ను తీసుకొన్నారు. 6-స్పీడ్ గేర్ బాక్స్ కు జతచేయబడి, ఇంజిన్ 32బిహెచ్ పి పవర్ మరియు 21 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కవాసకి జెడ్ 250 రూ. 2.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో వచ్చింది.

భారత మార్కెట్లో బోల్తా కొట్టిన 5 బైకులు ఏవో తెలుసా

ఇది విఫలం అవడానికి గల ముఖ్య కారణం అధిక ధర కలిగి ఉండడమే. రెండోది పవర్ మరియు ఫీచర్లను లేకపోవడం. ఈ జపనీస్ బైక్ మొదటి సంవత్సరంలో 120 యూనిట్లు పైగా అమ్ముడుపోయాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్యలు 38 యూనిట్ల వద్ద ఉన్నాయి. 2018-19 లో కేవలం 2 బైకుల వరకు అమ్మకాలు జరిగాయి. అంతే కాదు, జనవరి 2019 నుంచి ఒక్క యూనిట్ కూడా విక్రయించనట్లు తాజా డేటా వెల్లడించింది. కవాసకి అంతిమంగా ఈ నెల మొదట్లో తన భారతీయ వెబ్ సైట్ నుండి జెడ్ 250 తొలగించింది.

భారత మార్కెట్లో బోల్తా కొట్టిన 5 బైకులు ఏవో తెలుసా

సుజుకి ఇనాజుమా

సుజుకి నుంచి వచ్చిన ఈ బైక్ కూడా మార్కెట్లో సరి అయిన అమ్మకాలను నమోదు చేయలేదు. ఇందులో 248 సిసి లిక్విడ్ కూల్డ్ ట్విన్ సిలిండర్ ఉన్నాయి. 26.4బిహెచ్పి మరియు 22 ఎన్ఎమ్ టార్క్ గణాంకాలు కూడా వినియోగదారులను ఆకర్షించడంలో విఫలమయ్యాయి. సుజుకి తరువాత కొన్ని నెలల తర్వాత ధరలో కోతను విధించింది , ధర రూ. 2.31 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది.

భారత మార్కెట్లో బోల్తా కొట్టిన 5 బైకులు ఏవో తెలుసా

రెండున్నర సంవత్సర కాలంలో ఈ బైక్ కేవలం 232 అమ్మకాలను నమోదు చేసింది. 2019 లో సుజుకి చివరకు జిక్సర్ ఎస్ఎఫ్ 250 భారత మార్కెట్కు పరిచయం చేసింది. ఇందులో భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఒక మోనో సిలిండర్ అభివృద్ధి చేయబడింది. వచ్చే కొన్ని నెలల్లో జిక్సర్ 250 తో ఈ సెగ్మెంట్ మరింత బలోపేతం కానుంది.

భారత మార్కెట్లో బోల్తా కొట్టిన 5 బైకులు ఏవో తెలుసా

హీరో ఇంపల్స్

హోండా తో విడిపోయిన తర్వాత వారి మొదటి ఉత్పత్తి గా హీరో అడ్వెంచర్ మోటార్ సైకిల్స్ ను విడుదల చేసింది. హీరో ఇంపల్స్ ని మొదటిసారిగా ఆగస్టు 2011 లండన్ లో ప్రదర్శించారు మరియు అదే సంవత్సరం అక్టోబరులో ఈ బైక్ ను భారతదేశంలో రూ.66,800 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో ప్రారంభించారు.

భారత మార్కెట్లో బోల్తా కొట్టిన 5 బైకులు ఏవో తెలుసా

హీరో ఇంపల్స్ 149.2 సిసి ఎయిర్-కూల్డ్, కార్బ్యురేటెడ్ ఇంజన్లో 13.2 బిహెచ్ పి పవర్ మరియు 13.4 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దక్షిణ అమెరికా మార్కెట్లో ఆన్ ఆఫ్ రోడ్ మెషీన్ రిటైల్డ్ అయిన హోండా ఎన్ఎక్స్ఆర్ ఆధారంగా ఈ బైక్ ను నిర్మించారు. చివరకు ఎక్స్ పల్స్ 200 మరియు ఎక్స్ పల్స్ 200టి అడ్వెంచర్ ఓరియంటెడ్ మోటార్ సైకిల్స్ మే 2019 లో ప్రవేశపెట్టబడ్డాయి.

భారత మార్కెట్లో బోల్తా కొట్టిన 5 బైకులు ఏవో తెలుసా

బజాజ్ వి15

ఫిబ్రవరి 2016 నాడు రూ.61,999 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) తో విరుధ్దల చేసారు, భారతదేశపు మొట్టమొదటి విమాన వాహక నౌక ఐఎన్ ఎస్ విక్రాంత్ నుంచి లోహపు ముక్కను కలిగి ఉన్నదని వి15 యొక్క కీ సెల్లింగ్ పాయింట్ పేర్కొంది. అయితే, బజాజ్ ఐఎన్ ఎస్ విక్రాంత్ యొక్క ఇండస్ట్రబుల్ మెటల్ నుంచి నిర్మించిన బైక్ గా దీనిని మార్కెటింగ్ చేసింది. వి15 ప్రారంభంలో మంచి సంఖ్యలు చేసింది మరియు బజాజ్ యొక్క అతిపెద్ద అమ్మకపు నమూనాలో ఒకటిగా నిలిచింది.

భారత మార్కెట్లో బోల్తా కొట్టిన 5 బైకులు ఏవో తెలుసా

కంపెనీ డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు చిన్న కెపాసిటీ వి12 ను కూడా ప్రవేశపెట్టింది. బజాజ్ వి15, 149.5 సిసి ఎయిర్-కూల్డ్ డిటిఎస్- ఐ కలిగి ఉంది. ఇందులోని ఇంజన్ 12 బిహెచ్ పి మరియు, 12.7 ఎన్ఎమ్ ల టార్క్ ను ఉత్పత్తి చేయగలదు. పోను పోను అమ్మకాలు తగిపోయాయి. తరువాత బజాజ్ ఈ బైక్ ను కొద్దిగా తేలికపాటి సౌందర్య నవీకరణలను డిసెంబర్ 2018 లో అప్ డేట్ చేసింది. అయినా అమ్మకాలు పెద్దగా వెళ్ళలేదు. ఫలితంగా, బజాజ్, ఎబిఎస్ యొక్క సేఫ్టీ నెట్ తో బైక్ ని అప్ గ్రేడ్ చేయకుండా నిలిపి వేసింది.

భారత మార్కెట్లో బోల్తా కొట్టిన 5 బైకులు ఏవో తెలుసా

సుజుకి బ్యాండ్ఇట్

సుజుకి బ్యాండ్ఇట్ 1250ఎస్ ఇన్ లైన్ 4-సిలిండర్ కలిగి ఉన్నాయి. ఇంజిన్ 99 బిహెచ్ పి పవర్ మరియు 108 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 254 కేజీల బరువైన కెర్బ్ బరువు కారణంగా ఔత్సాహికులను దానికి దూరంగా ఉంచింది. మరి బైక్ విఫలమైందని ఇంకో కారణం రూ.8.5 లక్షలు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) అని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
5 Failed Bikes In India. Read inTelugu.
Story first published: Monday, July 8, 2019, 12:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X