భారతదేశంలో కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించిన ఆంపియర్

గ్రీవ్స్ కాటన్ యాజమాన్యంలోని ఎలక్ట్రిక్ వాహన తయారీదారు అయిన ఆంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పంపిణీ యొక్క నెట్‌వర్క్‌ను బాగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థకు ఇప్పుడు దేశవ్యాప్తంగా 23 కొత్త డీలర్‌షిప్‌లు ఉన్నాయి.

భారతదేశంలో కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించిన ఆంపియర్

కొత్త డీలర్‌షిప్‌లు సంస్థ యొక్క హై-పెర్ఫార్మింగ్ మరియు ఇ-స్కూటర్లను సులభంగా పొందటానికి వినియోగదారులకు అనుమతిస్తుంది. ఇవన్నీ పర్యావరణ అనుకూలమైనవి మరియు ఖర్చు కిలోమీటరుకు 0.15 రూపాయలు తక్కువ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణ హితాలుగా ఉంటాయి. ఎందుకంటే వీటికి ఇంధనం అవసరం లేదు కావున వీటి వల్ల ఎటువంటి కాలుష్యం జరగదు.

భారతదేశంలో కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించిన ఆంపియర్

ప్రస్తుతం భారతదేశం మొత్తంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు రాజస్థాన్ వ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌ల నుండి ఆంపియర్ ఉన్న అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లకు వినియోగదారులకు అందించే అవకాశం ఉంది.

భారతదేశంలో కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించిన ఆంపియర్

సంస్థ యొక్క ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలో ఫాస్ట్ సెల్లింగ్, హై-స్పీడ్ జీల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు మిడ్ రేంజ్ మరియు ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అయిన వి-48 ఎల్ఎ, మాగ్నస్ 60, రియో ఎల్ఎ మరియు రియో లి వంటివి ఉన్నాయి.

భారతదేశంలో కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించిన ఆంపియర్

గ్రీవ్స్ కాటన్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఓ) శ్రీ నాగేష్ బసవన్‌హల్లి మాట్లాడుతూ గ్రీవ్స్ కాటన్‌ను పూర్తి ఆటోమొబైల్ ఎకోసిస్టమ్ ప్లేయర్‌గా స్థాపించడానికి మేము కృషి చేస్తున్నాము అన్నారు. మా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆర్మ్, ఆంపియర్ వెహికల్స్ ద్వారా ప్రజలు రోజూ ప్రయాణిండంలో మార్పు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. డీలర్షిప్ల యొక్క విస్తరణ బాగా జరగడానికి మేము కృషి చేస్తున్నామన్నారు.

భారతదేశంలో కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించిన ఆంపియర్

తరువాత ఆంపియర్ వెహికల్స్ యొక్క చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ పి.సంజీవ్ మాట్లాడుతూ ఈ శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లు అన్ని రకాల రైడర్‌లకు సరిపోతాయి. యువత, పెద్దవారు అనే భేదభావం లేకుండా ఏ వయసు వారికైనా ఈ వాహనాలు బాగా ఉపయోగపడతాయి.అధునాతన కొనుగోలుదారులు కంఫర్ట్ కోరుకునేవారు బిజీ బిజినెస్ రైడర్‌లకు కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి అని తెలిపారు. ఇప్పటిదాకా భారతదేశం అంతటా 50,000 అమ్మకాలను దాటాయి అన్నారు. ఇప్పటికే దాదాపు 180 కంటే ఎక్కువ పట్టణాలు మరియు నగరాల్లో విస్తరించి ఉన్నాయి అని చెప్పారు.

భారతదేశంలో కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించిన ఆంపియర్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు స్మార్ట్ గా ఉండటమే కాకుండా పర్యావరణ అనుకూలంగా ఉంటాయి. ప్రతిప్రయాణికునికి ఈ వాహనాలు బాగా ఉపయోగపడతాయి అనడానికి సంస్థ యొక్క కొత్త విస్తరణ ఒక నిదర్శనమని ఆంపియర్ వెహికల్స్ భావిస్తున్నాయి.

Read More:ప్రియాంక గాంధీని స్కూటర్‌పై తీసుకెళ్లిన వ్యక్తికి జరిమానా విధించిన పోలీసులు... ఎందుకంటే?

భారతదేశంలో కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించిన ఆంపియర్

సరసమైన ధరలకు లభించడమే కాకుండా, అధిక పనితీరు కలిగిన ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ స్కూటర్లను తాము లాంచ్ చేస్తూనే ఉన్నామని కంపెనీ యాజమాన్యం తెలిపింది. ఆంపియర్ వాహనాలు తమ జీల్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఉచిత భీమా పథకాన్ని ప్రవేశపెట్టాయి. అంటే కాకుండా ఫేమ్-II పథకం ద్వారా రూ .1,000 విలువైన ప్రయోజనం మరియు ఉచిత ఉపకరణాలను ఇవ్వడానికి వినియోగదారు-స్నేహపూర్వక ఆఫర్లను ప్రకటించాయి.

Read More: రాయల్ ఎన్ఫీల్డ్ లో విడుదలకానున్న మరో కొత్త బైక్! ఇప్పుడే చూడండి...?

భారతదేశంలో కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించిన ఆంపియర్

భారతదేశంలో ఆంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఆలోచనలు :

ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగం ఇప్పటికీ దేశంలో మొదటి దశలోనే ఉన్నప్పటికీ వీటి అమ్మకాలు మరియు వినియోగాయాలు మాత్రం వేగంగా పెరుగుతున్నాయి. ఆంపియర్ ఎలక్ట్రిక్ వాహనాలు భారతీయ ఎలక్ట్రిక్ మొబిలిటీ పరిశ్రమలో గణనీయమైన ఉనికిని కలిగి ఉన్నాయి. దీనికి నిదర్శనంగా దేశంలో దాదాపు 23 డీలర్షిప్ లు విస్తరించాయి. ఇతడి అభివృద్ధికి కారణమైన ఆంపియర్‌లో మొత్తం జట్టుకు అభినందనలు తెలపాలి.

Read More:ఇంటిగ్రేటెడ్ వెహికల్ సేఫ్టీ సిస్టమ్‌ ప్రవేశపెట్టిన ఇండియన్ ఆర్మీ!

Most Read Articles

English summary
Ampere Electric Vehicles Opens 23 New Dealerships Across India-Read in telugu
Story first published: Tuesday, December 31, 2019, 10:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X