యమహా ఆర్15కు పోటీగా అప్రిలియా చీపెస్ట్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్

అప్రిలియా మోటార్ సైకిల్స్ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త 150సీసీ మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్‌గా పేరుగాంచిన యమహా ఆర్15 మోటార్ సైకిల్‌కు సరాసరి పోటీనిచ్చేలా అప్రిలియా సంస్థ సరికొత్త 150సీసీ స్పోర్ట్స్ బైకును సిద్దం చేస్తోంది.

యమహా ఆర్15కు పోటీగా అప్రిలియా చీపెస్ట్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్

ఇటాలియన్ బైక్ తయారీ సంస్థ అప్రిలియా మోటార్‌సైకిల్స్ వచ్చే ఏడాది ఢిల్లీవేదికగా జరబోయే 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఈ సరికొత్త 150సీసీ స్పోర్ట్స్ బైకును ఆవిష్కరించనుంది. దీనితో పాటు మరిన్ని కొత్త బైకులు మరియు స్కూటర్లను సందర్శన వేదికపై ఆవిష్కరించనుంది.

యమహా ఆర్15కు పోటీగా అప్రిలియా చీపెస్ట్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్

తాజాగా అందిన సమాచారం మేరకు, కొత్త 150సీసీ అప్రిలియా మోటార్ సైకిల్‍‌కు చివరి దశ పరీక్షలు జరుగుతున్నట్లు తెలిసింది. ప్రత్యేకించి ఇండియన్ రోడ్లు మరియు రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగానే దీనిని పరీక్షిస్తున్నారు. తీవ్ర అంచనాలు సృష్టిస్తున్న ఈ మోడల్ బహుశా 2018 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన ఆర్ఎస్ 150 లేదా టువోనో 150 కావచ్చని మార్కెట్ వర్గాల అభిప్రాయం.

యమహా ఆర్15కు పోటీగా అప్రిలియా చీపెస్ట్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్

దేశవ్యాప్తంగా ఉన్న పలు షోరూముల్లో ప్రైవేట్‌గా నిర్వహించిన కార్యక్రమంలో అప్రిలియా సంస్థ ఈ రెండు బైకులను సందర్శనకు ఉంచింది. ఈ రెండు బైకులు ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఏదేమైనప్పటికీ ధరను అత్యంత పోటీగా నిర్ణయించేందుకు ఇండియన్ వెర్షన్‌లో పలు కీలక ఫీచర్లు మిస్సయ్యే అవకాశం ఉంది.

యమహా ఆర్15కు పోటీగా అప్రిలియా చీపెస్ట్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్

అప్రిలియా ఆర్ఎస్ 150 మరియు టువోనో 150 రెండు బైకుల్లో కూడా సాంకేతికంగా 149-సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 17.7బిహెచ్‌పి పవర్ మరియు 14ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

యమహా ఆర్15కు పోటీగా అప్రిలియా చీపెస్ట్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్

ఇంటర్నేషనల్ వెర్షన్ బైకుల్లో ముందువైపున 40ఎమ్ఎమ్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్వర్, ముందు మరియు వెనుక చక్రాలకు 300ఎమ్ఎమ్ మరియు 218ఎమ్ఎమ్ చుట్టుకొలత గల డిస్క్ బ్రేకులు ఉన్నాయి. మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థ కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ స్టాండర్డ్ ఫీచర్‌గా అందించారు.

యమహా ఆర్15కు పోటీగా అప్రిలియా చీపెస్ట్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్

అప్రిలియా ఆర్ఎస్ 150 ఫుల్లీ ఫెయిర్డ్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్ మరియు టువోనో 150 మోటార్ సైకిల్ స్ట్రీట్ ఫైటర్ బైక్. ఆర్ఎస్‌వి4 నుండి ఆర్ఎస్150 బైకును, 1100 టువోనో ని4 డిజైన్ ఆధారంగా టువోనో 150 బైకుని డిజైన్ చేశారు.

యమహా ఆర్15కు పోటీగా అప్రిలియా చీపెస్ట్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్

రెండు బైకుల్లో కూడా ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, అప్రిలియా సిగ్నేచర్ ట్రిపుల్ హెడ్‌ల్యాంప్ డిజైన్, అగ్రెసివ్ స్టైలింగ్ డిజైన్ మరియు సెమీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఎన్నో డిజైన్ ఎలిమెంట్లు ఉన్నాయి.

యమహా ఆర్15కు పోటీగా అప్రిలియా చీపెస్ట్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అప్రిలియా 150సీసీ బైకును గత ఏడాది ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ఆవిష్కరించారు. ఇది పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైతే విపణిలో ఉన్న యమహా ఆర్‌15, సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 155 మరియు కాస్త పెద్ద ఇంజన్ ఉన్న కెటీఎమ్ ఆర్సీ 200 మోటార్ సైకిళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Aprilia To Launch New 150cc Motorcycle In India At 2020 Auto Expo: To Rival The Yamaha R15. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X