మార్కెట్లోకి కొత్త బజాజ్ చేతక్ స్కూటర్: 14 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చింది!

బజాజ్ చేతక్ స్కూటర్.. 14 ఏళ్ల క్రితం ఇండియన్ రోడ్ల మీద ఇదొక పాపులర్ మోడల్.. మార్కెట్లో మకుటం లేని మహరాజుగా పరిశ్రమను ఏలింది. కానీ ఎప్పటికప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ మరియు పోటీని తట్టుకోలేక మార్కెట్ నుండి నిష్క్రమించింది. కానీ ఈ స్కూటర్ గురించి తలుచుకోగానే అభిమానులు 20 ఏళ్ల వెనక్కి వెళ్లిపోతారు.

మార్కెట్లోకి కొత్త బజాజ్ చేతక్ స్కూటర్: 14 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చింది!

బజాజ్ ఆటో ఆవిష్కరించిన సరికొత్త బ్రాండ్ "అర్బనైట్ డివిజన్" క్రింద బజాజ్ ఉత్పత్తి చేస్తున్న తొలి మోడల్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్. సరికొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు 2020 జనవరి నుండి మార్కెట్లోకి రానున్నాయి.

మార్కెట్లోకి కొత్త బజాజ్ చేతక్ స్కూటర్: 14 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చింది!

బజాజ్ ఆటో చేతక్ స్కూటర్‌ను సుమారుగా 14 ఏళ్ల తర్వాత ఇండియన్ మార్కెట్లోకి సరికొత్తగా ఆవిష్కరించింది. సెప్టెంబర్ 25 నుండి పూనేలో ఉన్న చకన్ ప్రొడక్షన్ ప్లాంటులో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఉత్పత్తి చేయనున్నారు.

మార్కెట్లోకి కొత్త బజాజ్ చేతక్ స్కూటర్: 14 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చింది!

బజాజ్ ఆటో ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చిన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇదే. అయితే, ఇది వరకే దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్ షోరూముల ద్వారానే చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తారు. కానీ దీనికి సంభందించి సాంకేతిక వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

మార్కెట్లోకి కొత్త బజాజ్ చేతక్ స్కూటర్: 14 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చింది!

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే, కంపెనీకి చెందిన పాత చేతక్ డిజైన్‌నే పోలి ఉంటుంది. చాలా వరకు రీడిజైన్ చేయబడిన బాడీ పార్ట్స్, గుండ్రటి హెడ్ ల్యాంప్ మరియు అతి తక్కువ స్టైలింగ్‌తో సింపుల్‌గా డిజైన్ చేయడంతో చూడ్టానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

మార్కెట్లోకి కొత్త బజాజ్ చేతక్ స్కూటర్: 14 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చింది!

డిజైన్ పరంగా పాత కాలం నాటి రెట్రో స్టైలింగ్‌లో వచ్చినప్పటికీ.. టెక్నాలజీ మరియు ఫీచర్ల మేళవింపుతో వచ్చింది. ఫుల్లీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, పగటి పూట ప్రకాశవంతంగా వెలిగే లైట్లు, ఇకో మరియు స్పోర్ట్ అనే రెండు విభిన్న రైడింగ్ మోడ్స్, రివర్స్ అసిస్ట్ మరియు రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి టెక్నాలజీ ఇందులో వచ్చింది.

మార్కెట్లోకి కొత్త బజాజ్ చేతక్ స్కూటర్: 14 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చింది!

సస్పెన్షన్ పరంగా.. సింగల్ సైడ్ ట్రెయిలింగ్ ఆర్మ్ ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ ఉన్నాయి. రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు మెరుగైన బ్రేకింగ్ కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు రీజనరేటివ్ సిస్టమ్ వంటివి వచ్చాయి.

మార్కెట్లోకి కొత్త బజాజ్ చేతక్ స్కూటర్: 14 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చింది!

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వైట్ మరియు ఇవోరి అనే రెండు క్లాసిక్ సింగల్ టోన్ పెయింట్ స్కీమ్‌లలో లభించనుంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ పూర్తి స్థాయిలో మార్కెట్లోకి వస్తే.. విపణిలో ఉన్న అథర్ 450, ఒకినవ ప్రైజ్, ఆంపర్ మరియు ట్వంటీటూ మోటార్స్ విక్రయిస్తున్న పలు ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీనిస్తుంది.

మార్కెట్లోకి కొత్త బజాజ్ చేతక్ స్కూటర్: 14 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చింది!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ ఎట్టకేలకు తమ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. బజాజ్ అర్బనైట్ క్రింద తీసుకొచ్చిన చేతక్ ఎలక్ట్రిక్ మార్కెట్లో ఒక కొత్త అలజడి సృష్టించింది. భారీ అంచనాలతో విపణిలోకి వస్తోన్న చేతక్ ఎలక్ట్రిక్ ధర సుమారుగా 1 లక్ష రూపాయల వరకు ఉండవచ్చు.

Most Read Articles

English summary
Bajaj Chetak Electric Scooter Unveiled In India: ‘Chetak’ Moniker Makes Its Comeback After 14 Years. Read in Telugu.
Story first published: Thursday, October 17, 2019, 15:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X