బజాజ్ నుండి సరికొత్త ఎన్ఎస్125 బైక్: విడుదల ఎప్పుడంటే?

బజాజ్ ఆటో అతి త్వరలో సరికొత్త బజాజ్ ఎన్ఎస్ 125 బైకును విపణిలోకి ప్రవేశపెట్టనుంది. పలు అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే విడుదలైన ఎన్ఎస్ 125 బైకును దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో నెల రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

దేశీయ దిగ్గజం బజాజ్ ఆటో నుండి వస్తోన్న చీపెస్ట్ స్ట్రీట్ ఫైటర్ ఎన్ఎస్ 125 బైక్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి...

బజాజ్ నుండి సరికొత్త ఎన్ఎస్125 బైక్: విడుదల ఎప్పుడంటే?

పూనేకు చెందిన భారతదేశపు దిగ్గజ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో గత ఏడాది పోలాండ్‌లో సరికొత్త ఎన్ఎస్ 125 బైకును తొలిసారిగా ఆవిష్కరించింది. పోలాండులోనే ఎన్ఎస్ 125 బైకును 7,999 PLN(పోలాండ్ కరెన్సీ)ధరతో విడుదల చేసింది. పలు అంతర్జాతీయ మార్కెట్లతో పాటు కొలంబియాలో కూడా దీనిని విడుదల చేశారు.

బజాజ్ నుండి సరికొత్త ఎన్ఎస్125 బైక్: విడుదల ఎప్పుడంటే?

బజాజ్ ఆటో ఇప్పుడు తమ సొంత మార్కెట్ మీద దృష్టిసారించింది. అవును, ఎన్ఎస్ 125 బైకును వచ్చే ఆగష్టు నెలలో పూర్తి స్థాయిలో లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఎన్ఎస్ స్ట్రీట్ ఫైటర్ సిరీస్‌లో ప్రస్తుతం 200 మరియు 160 అనే మోడళ్లు ఉన్నాయి. వీటికి జతగా 125 మోడల్ చేరుతుండటంతో అందరూ ఇది నిజంగానే ఎన్ఎస్ 125 బైకా ? అని అడుగుతున్నారు.

బజాజ్ నుండి సరికొత్త ఎన్ఎస్125 బైక్: విడుదల ఎప్పుడంటే?

గత రెండు మూడు నెలల నుండి బజాజ్ పల్సర్ బైకులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రత్యేకించి 125 సెగ్మెంట్లో ఉన్న మంచి ఫలితాలను కనబరుస్తున్నాయి. ఈ సెగ్మెంట్లో వీలైనంత మార్కెట్ వాటాను సొంతం చేసుకోవాలని బజాజ్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఎన్ఎస్ 125 బైక్ తెరమీదకొచ్చింది.

బజాజ్ నుండి సరికొత్త ఎన్ఎస్125 బైక్: విడుదల ఎప్పుడంటే?

125 సీసీ బైకుల సెగ్మెంట్లో అత్యధిక వాటాను సొంతం చేసుకునేందుకు ప్రతి నెలా 2.50 లక్షల 125సీసీ బైకులను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నాము. ఇందులో భాగంగానే వచ్చే ఆగష్టులో ఓ కొత్త 125సీసీ బైకును విపణిలోకి ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు రాజీవ్ బజాజ్ ఓ ప్రకటనలో తెలిపారు.

బజాజ్ నుండి సరికొత్త ఎన్ఎస్125 బైక్: విడుదల ఎప్పుడంటే?

సరికొత్త బజాజ్ ఎన్ఎస్ 125 చూడటానికి అచ్చం ఎన్ఎస్ సిరీస్ బైకులనే పోలి ఉంటుంది. సరికొత్త బాడీ గ్రాఫిక్స్, పెయింట్ స్కీమ్స్స, మ్యాట్ ఫినిషింగ్‌లో ఉన్న ఎగ్జాస్ట్ మఫ్లర్, వేర్వేరుగా అందించిన సీటు మరియు విశాలమైన టైర్లు దీని ప్రత్యేకత. అంతే కాకుండా బైక్ మొత్తానికి స్పోర్టివ్ ఫీల్‌నిచ్చేలా ఇంజన్ దగ్గర ఓ చిన్న గార్డ్ కూడా అందించారు.

బజాజ్ నుండి సరికొత్త ఎన్ఎస్125 బైక్: విడుదల ఎప్పుడంటే?

ఇతర డిజైన్ అంశాలను పరిశీలిస్తే పల్సర్ 135 ఎల్ఎస్ బైకు గుర్తుకొస్తుంది. పదునైన హెడ్‌ల్యాంప్ డిజైన్, ఎత్తైన ఫ్రంట్ విండ్ స్క్రీన్, అనలాగ్ టాకో మీటర్ గల సెమీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు డిజిటల్ డిస్ల్పే వంటివి ఉన్నాయి. నలుపు, ఎరుపు, తెలుపు మరియు పసుపు రంగుల్లో లభించే అవకాశం ఉంది.

బజాజ్ నుండి సరికొత్త ఎన్ఎస్125 బైక్: విడుదల ఎప్పుడంటే?

బజాజ్ ఎన్ఎస్ 125 బైకులో బ్రేకింగ్ విధులు నిర్వర్తించేందుకు ముందువైపున 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున 130ఎన్ఎమ్ డ్రమ్ సిస్టమ్ కలదు. మెరుగైన రైడింగ్ సౌలభ్యం కోసం ముందువైపున కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనుకవైపున నైట్రాక్స్ షాక్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది.

బజాజ్ నుండి సరికొత్త ఎన్ఎస్125 బైక్: విడుదల ఎప్పుడంటే?

బజాజ్ ఎన్ఎస్ 125 బైకులో సాంకేతికంగా 124.45సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 12బిహెచ్‌పి పవర్ మరియు 11ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

బజాజ్ నుండి సరికొత్త ఎన్ఎస్125 బైక్: విడుదల ఎప్పుడంటే?

ఇది 125సీసీ మోటార్ సైకిల్ కాబట్టి ఇందులో ఏబీఎస్ అవసరం లేదు. దీంతో విపణిలో విపరీతమైన పోటీ ఉండేలా ఎన్ఎస్ 125 ధరలు నిర్ణయించే అవకాశం ఉంది. ఏబీఎస్ లేకపోయినా.. కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (సీబీఎస్) ఇందులో ఉంది. దీని ధర సుమారుగా రూ. 70,000 ఎక్స్‌-షోరూమ్(ఇండియా)గా ఉండవచ్చు.

Most Read Articles

English summary
Bajaj NS 125 Launching Next Month — Ready To Dominate The 125cc Segment. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X