2020 జనవరి చివరి వారంలో ప్రారంభం కానున్న బజాజ్ చేతక్ డెలివరీలు
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బజాజ్ చేతక్ వాహనం ప్రారంభించడానికి మరెంతో దూరం లేదు. గత నెలలో స్కూటర్ కోసం బుక్ చేసుకున్న బజాజ్ చేతక్ ప్రియులకు కంపెనీ ఒక శుభవార్త తీసుకుని వచ్చింది.అది ఏమిటంటే వచ్చే సంవత్సరం జనవరి లో ప్రారంభిస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం తెలియజేసింది.

కంపెనీ తెలియజేసిన ఈ విషయాన్ని గమనించినట్లైతే పూణే మరియు బెంగళూరు రెండు ప్రాంతాలలో కూడా ఒకేసారి డెలివరీ ప్రారంభించవచ్చని మనకు తెలుస్తుంది. బజాజ్ చేతక్ ఎంచుకున్నదాని ప్రకారం ప్రారంభంలో KTM డీలర్‌షిప్ ల ద్వారా విక్రయించబడతాయి.

ఇప్పటివరకు బజాజ్ చేతక్ గురించి మనకు ఎన్ని విషయాలు తెలిసినప్పటికి వాటి నిర్దిష్టమైన ధర మాత్రం జనవరిలో తెలిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి చేతక్ గురించి మనకు తెలిసిన విషయం ఏమిటంటే దీనిలో 4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇంకా ఇది ప్రత్యేకమైన ఆటోమేటెడ్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది

చేతక్ లో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ తొలగించడానికి వీలు కాకుండా ఉంటుంది. బజాజ్ చేతక్ తన మైలేజ్ ని రెండు విధాలుగా వినియోగదారునికి అందిస్తుంది. ఎకో మోడ్ లో 95 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్ లో 85 కిలోమీటర్లు మైలేజ్ ని అందిచనుంది.

బజాజ్ చేతక్ లో ఫెదర్ టచ్, స్విచ్ గేర్, ఫుల్-ఎల్ఈడి లైటింగ్, డిజిటల్ కన్సోల్ వంటివి మనకు ప్రతిబింబిస్తాయి. చేతక్ లో ఇటువంటి ప్రత్యేకమైన అమరికలు అమర్చబడ్డాయి. ఈ విధంగా చేతక్ ను తాయారు చేయడానికి దాదాపుగా రూ. 1 లక్షకు పైగా ఖర్చు అవుతుందని భావిస్తున్నారు.

కంపెనీ ఎండి రాజీవ్ మాట్లాడుతూ బజాజ్ చేతక్ యొక్క ధర ఆకర్షణీయంగా ఉంటుంది అని ఒక ప్రకటనలో తెలియజేసారు. దీని ధర ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ సుమారు రూ. 1.5 లక్షలు ఉండే అవకాశం ఉండవచ్చు.

కొత్త బజాజ్ చేతక్ కు ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవడానికి మనం ఇంకా రెండు వారాలు వేచి ఉండాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి పూణే మరియు బెంగళూరులలో కస్టమర్లు చేతక్ కోసం ఇంకా కొంత సమయం వేచి చూడక తప్పదు.

భారతదేశం సాంకేతికరంగంలో నిరంతరం పరుగులు పెడుతూనే ఉంది. కాలానికి అనుగుణంగా వాహనాలలోకూడా నిరంతరం మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ మార్పులలో భాగంగానే ఈ మధ్య ఎక్కువగా ఎలెక్ట్రిక్ వాహనాలపైనా వాహనప్రియులకు ఇష్టం పెరిగింది. దీని ఫలితంగానే ఈ బజాజ్ చేతక్ మార్కెట్ లోకి విడుదలవ్వబోతోంది. ఇప్పుడు చాలామంది వాహన ప్రియులు చేతక్ కోసం ఎదురుచూస్తున్నారు.

బజాజ్ చేతక్ గురించి తెలుసుకోవసిన మరికొన్ని విషయాలు:
బజాజ్ వారి చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లో రిట్రో స్టైలింగ్ ఉంటుంది. చేతక్ చూడటానికి చాల అందంగా ఉంటుంది. కర్వీ బాడీ వర్క్ ,మల్టీ స్పోక్ వీల్ తో పాటు కాంటౌర్డ్ సీట్ వంటివి ఇందులో ఉంటాయి. రాబోయే కొత్త సంవత్సరంలో విడుదలయ్యే చేతక్ ఆధునిక యుగంలో వెస్పాను ప్రతిధ్వనిస్తుంది.


Click it and Unblock the Notifications








