విపణిలోకి బజాజ్ పల్సర్ 125.. ఇప్పుడు మరింత కొత్తగా

బజాజ్ ఆటో విపణిలోకి సరికొత్త బజాజ్ పల్సర్ 125 స్ల్పిట్-సీట్ మోడల్‌ను లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. బజాజ్ ఇది వరకే విడుదల చేసిన పల్సర్ 125 నియోన్ పై స్థానంలో నిలవనుంది. పలు నూతన స్టైలింగ్ ఫీచర్లు మరియు స్ల్పిట్ సీట్ కలిగిన దీని ధర పల్సర్ నియోన్ 125 వేరియంట్ కంటే రూ. 3 వేల వరకు ఎక్కువగా ఉండనుంది.

విపణిలోకి బజాజ్ పల్సర్ 125.. ఇప్పుడు మరింత కొత్తగా

బజాజ్ ఆటో ఇండియన్ మార్కెట్లోకి పల్సర్ 125 వేరియంట్‌ను లాంచ్ చేస్తున్నపుడు, పల్సర్ రేంజ్‌లోని అతి చిన్న పవర్ ఫుల్ బైక్ కస్టమర్లను అంతగా ఆకర్షించలేకపోయింది. కానీ పల్సర్ బైకు కొనాలనే యువత కలను తీర్చింది. అయితే, అదే బడ్జెట్ రేంజ్‌లో పవర్ ఫుల్ బైక్ + స్టైలింగ్ డిజైన్ అందించాలనే ఆలోచనతో పల్సర్ 125 కొత్త వేరియంట్‌ తీసుకొచ్చింది.

విపణిలోకి బజాజ్ పల్సర్ 125.. ఇప్పుడు మరింత కొత్తగా

బజాజ్ పల్సర్ 125 నియోన్ వేరియంట్‌ను ఆగష్టు 14, 2019 న ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 64,000 లు(ఎక్స్-షోరూమ్)గా ఖరారు చేశారు. ఇందులో 125సీసీ ఇంజన్ రావడంతో ఏబీఎస్ అవసరం లేదు. దాంతో ధర కూడా చాలా తక్కువగా నిర్ణయించారు. ప్రస్తుతం పల్సర్ రేంజ్‌లో అత్యంత సరసమైన మోడల్‌గా నిలిచింది.

విపణిలోకి బజాజ్ పల్సర్ 125.. ఇప్పుడు మరింత కొత్తగా

ఇప్పుడు పల్సర్ 125 సిరీస్‌లోకి మరో కొత్త మోడల్‌ పరిచయం చేసేందుకు సిద్దమయ్యారు. ఈ మోడల్ చూడటానికి అచ్చం రెగ్యులర్ బైక్ మాదిరిగానే ఉన్నప్పటికీ పలు రకాల స్టైలిష్ అంశాలు కొత్తగా కనిపిస్తాయి.

విపణిలోకి బజాజ్ పల్సర్ 125.. ఇప్పుడు మరింత కొత్తగా

ఫ్రంట్ డిజైన్‌లో అందరికీ బాగా గుర్తుండిపోయిన పల్సర్ ఫేస్ యథావిధిగా వచ్చింది. రిఫ్లక్టర్ హెడ్ ల్యాంప్ మరియు పైలర్ ల్యాంప్స్ వచ్చాయి. షార్ప్ అండ్ స్టైలిష్ ఫ్యూయల్ ట్యాంక్ పల్సర్ 125 ‌వేరియంట్‌కు మరింత అందాన్ని జోడించింది. స్పోర్ట్స్ బైక్ ఫీల్ కలిగించేందుకు ఇంజన్ కింద ఆకర్షణీమైన ఇంజన్ గార్డ్ అమర్చారు.

విపణిలోకి బజాజ్ పల్సర్ 125.. ఇప్పుడు మరింత కొత్తగా

రియర్ డిజైన్‌లో ఆకర్షణీయమైన టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. పల్సర్ నియోన్ 125 వేరియంట్లో ఉన్నటువంటి సింగల్ గ్రాబ్ రెయిల్ కాకుండా.. ఇందులో రెండుగా వేరు చేయబడ్డ స్ల్పిట్ గ్రాబ్ రెయిల్స్ అందించారు. అన్నింటికంటే ఇందులో ప్రతిఒక్కరూ గుర్తించదగిన కీలక మార్పు ఏమిటంటే... ఆకర్షణీయమైన సరికొత్త బాడీ గ్రాఫిక్స్.

విపణిలోకి బజాజ్ పల్సర్ 125.. ఇప్పుడు మరింత కొత్తగా

ఫ్రంట్ మడ్ గార్డ్, ఫ్యూయల్ ట్యాంక్, ఇంజన్ గార్డ్ మరియు రెండు చక్రాల మీద సరికొత్త స్టైలిష్ గ్రాఫిక్స్ చూడవచ్చు. మరో భారీ మార్పు సింగల్ సీట్ స్థానంలో రైడర్ మరియు పిలియన్ రైడర్‌కు వేర్వేరుగా స్ల్పిట్ సీట్ (రెండుగా వేరు చేయబడ్డ)ను అమర్చారు. దీంతో పల్సర్ 125 వేరియంట్ ఓవరాల్ డిజైన్ చాలా కొత్తగా అనిపిస్తోంది.

విపణిలోకి బజాజ్ పల్సర్ 125.. ఇప్పుడు మరింత కొత్తగా

బజాజ్ పల్సర్ 125లో సాంకేతికంగా ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. బైక్ పొడవు 2055ఎమ్ఎమ్, వెడల్పు 765ఎమ్ఎమ్ మరియు 1323ఎమ్ఎమ్ వీల్‌బేస్ ఉంది. పల్సర్ 125 బరువు 139 కిలోలుగా ఉంది.

విపణిలోకి బజాజ్ పల్సర్ 125.. ఇప్పుడు మరింత కొత్తగా

బజాజ్ పల్సర్ 125 వేరియంట్లో 125సీసీ కెపాసిటీ గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 11.8బిహెచ్‌పి పవర్ మరియు 11ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున ట్విన్ గ్యాస్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి.

విపణిలోకి బజాజ్ పల్సర్ 125.. ఇప్పుడు మరింత కొత్తగా

బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ వీల్‌కు 240ఎమ్ఎమ్ డిస్క్ మరియు వెనుక వైపున 130ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు. సురక్షితమైన రైడింగ్ కోసం కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అందించారు. దీనినే కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అని కూడా అంటారు. ఫ్రంట్ లేదా రియర్ ఏ బ్రేక్ అప్లే చేసిన రెండు చక్రాలకు సమానంగా బ్రేకింగ్ పవర్ అందుతుంది.

Source:Dino's Vault

Most Read Articles

English summary
Bajaj Pulsar 125 With Split Seats & Sporty Graphics To Be Launched Soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X