పల్సర్ మరియు డామినార్ ధరలపై షాకింగ్ నిర్ణయం తీసుకొన్న బజాజ్

భారత మార్కెట్లో బజాజ్ పల్సర్ కు ఉన్న క్రెజ్ అంత ఇంత కాదు, యువత అత్యధికంగా ఇష్టపడే బైక్లలో ఇది ఒకటి అని చెప్పవచ్చు. ఇది ఒకటే కాదు బజాజ్ ఉత్పత్తులలో డామినార్ బైక్ కూడా ఇలాంటి ఆధారంగానే కలిగి ఉంది. యువతకి ఇది ఒక డ్రీమ్ బైక్ అని చెప్పవచ్చు. అయితే బజాజ్ వీటిపై షాకింగ్ వార్తను వెల్లడించింది అదేమిటో వివరంగా తెలుసుకొందాం రండి..

పల్సర్ మరియు డామినార్ ధరలపై షాకింగ్ నిర్ణయం తీసుకొన్న బజాజ్

రాబోవు భద్రతా నిబంధనకు అనుగుణంగా ప్రతి వాహన తయారీ సంస్థ వారు తమ వాహనాలను బిఎస్-6 ఉద్గర నిబంధనలను పాటించే విధంగా వాహనాలను తయారుచేస్తున్నారు. వీటిని తాయారు చేయడానికి సాంకేతికంగా చాలా ఖర్చు కూడా అవుతుంది. దీనికి తగ్గట్టుగానే వారి వాహనాలపై కూడా ధరలను పెంచవలసి ఉంటుంది.

పల్సర్ మరియు డామినార్ ధరలపై షాకింగ్ నిర్ణయం తీసుకొన్న బజాజ్

బజాజ్ ఆటో తన మొత్తం పల్సర్ 150 రేంజ్ లో ధరలను భారత మార్కెట్లో పెంచింది. పల్సర్ 150 కు రూ. 479 నుంచి రూ. 2980 మధ్య ధర పెంపు మారుతూ ఉంటుంది. ఇందులో మూడు వేరియెంట్లు ఉన్నాయి అవి నియాన్, సింగిల్-డిస్క్ ఏబిఎస్ మరియు ట్విన్-డిస్క్ ఏబిఎస్.

పల్సర్ మరియు డామినార్ ధరలపై షాకింగ్ నిర్ణయం తీసుకొన్న బజాజ్

ఇదే కాకుండా బజాజ్ తన ఫ్లాగ్ షిప్ డామినార్ 400 ఆఫర్ ధరలను కూడా దేశంలో పెంచింది. ఈ ఏడాది మార్చిలో ప్రారంభం జరిగిన 2019 బజాజ్ డామినార్ 400 పై రూ.6000 మేర పెంచడం జరిగింది.

పల్సర్ మరియు డామినార్ ధరలపై షాకింగ్ నిర్ణయం తీసుకొన్న బజాజ్

ఈ సవరించిన ధరలు బజాజ్ పల్సర్ 150 రేంజ్ ఇప్పుడు నియాన్ బైక్ రూ.71,200 ధరతో ఉంది, అయితే ముందు దీని ధర రూ.68,250 గా ఉండగా దీనిపై దాదాపు రూ.2,950 పెరిగింది.

పల్సర్ మరియు డామినార్ ధరలపై షాకింగ్ నిర్ణయం తీసుకొన్న బజాజ్

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

బజాజ్ పల్సర్ 150 సింగిల్-డిస్క్ ఏబిఎస్ మరియు ట్విన్-డిస్క్ ఏబిఎస్ కొత్త మేర పెరుగుదల కనిపించింది అంటే వీటిపై వరుసగా రూ.479 మరియు రూ.499 పెరిగాయి.

పల్సర్ మరియు డామినార్ ధరలపై షాకింగ్ నిర్ణయం తీసుకొన్న బజాజ్

ఈ రెండు మోటార్ సైకిళ్ల కొత్త ధరలు ఇప్పుడు సింగిల్-డిస్క్ ఏబిఎస్ రూ.84,960, ట్విన్-డిస్క్ ఏబిఎస్ రూ.88,838 గా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా ఉన్నాయి. మరోవైపు 2019 బజాజ్ డామినార్ 400 రూ.6000 అత్యధిక ధర పెంపును ప్రకటించింది.

పల్సర్ మరియు డామినార్ ధరలపై షాకింగ్ నిర్ణయం తీసుకొన్న బజాజ్

ఈ 2019 డామినార్ మోడల్ ను ఈ ఏడాది మొదట్లో రూ.1.74 లక్షల ధరతో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫ్లాగ్ షిప్ మోటార్ సైకిల్ రూ.1.80 లక్షల ధరతో లభ్యమవుతోంది. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా ఉన్నాయి.

పల్సర్ మరియు డామినార్ ధరలపై షాకింగ్ నిర్ణయం తీసుకొన్న బజాజ్

ధరల పెరుగుదల ఈ బైక్ లపై కాకుండా మిగతా అన్ని మోటార్ సైకిళ్లు మారకుండా యథాతథంగా ఉంటాయి. ఈ బైక్లలో 149 సిసి సింగిల్-సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ద్వారా బజాజ్ పల్సర్ 150 రేంజ్ లో కొనసాగిస్తోంది.

పల్సర్ మరియు డామినార్ ధరలపై షాకింగ్ నిర్ణయం తీసుకొన్న బజాజ్

ఇది 13.8 బిహెచ్పి మరియు 13.4 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఐదు-స్పీడ్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. డామినార్ 400 లో 373 సిసి సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ద్వారా ఆధారితమైంది. ఇది 37 బిహెచ్పి మరియు 34 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది, ఇందులో ఆరు-స్పీడ్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.

పల్సర్ మరియు డామినార్ ధరలపై షాకింగ్ నిర్ణయం తీసుకొన్న బజాజ్

డామినార్ 400 ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్స్ తో వస్తుంది మరియు వెనుక వైపున మోనో-షాక్ ఉంటుంది. బ్రేకింగ్ విషయానికొస్తే ముందు వైపు 320 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 230 మిమీ డిస్క్ లను కలిగి ఉంది, ఇందులో స్టాండర్డ్ ఏబిఎస్ సపోర్ట్ చేయబడింది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 30, 2019, 10:25 [IST]
English summary
Bajaj Increases Prices Of Pulsar 150 & Dominar 400 — Up To Rs 6000 Hike In Prices
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+