సేల్స్‌లో సరికొత్త సంచలనం సృష్టించిన బెనెల్లీ ఇంపీరియల్ 400 బైక్

బెనెల్లీ ఇండియా ఇటీవల రెట్రో-స్టైల్ క్రూయిజర్ మోటార్ సైకిల్, ఇంపీరియర్ 200 బైకును విపణిలోకి లాంచ్ చేసింది. సరికొత్త బెనెల్లీ ఇంపీరియల్ 400 బైక్ ప్రారంభ ధర రూ. 1.69 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

సేల్స్‌లో సరికొత్త సంచలనం సృష్టించిన బెనెల్లీ ఇంపీరియల్ 400 బైక్

బెనెల్లీ ఇంపీరియల్ 400 మోటార్ సైకిల్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. అనతి కాలంలో ఏకంగా 4,000 లకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి. డీలర్లు మరియు ఆన్‌లైన్ రెండింటి ద్వారా 4,000 బైకులు బుక్ అయ్యాయని బెనెల్లీ ప్రతినిధులు తెలిపారు.

సేల్స్‌లో సరికొత్త సంచలనం సృష్టించిన బెనెల్లీ ఇంపీరియల్ 400 బైక్

ఇటలీకి చెందిన ఖరీదైన బైకుల తయారీ సంస్థ బెనెల్లీ తీసుకొచ్చిన సరసమైన మోడల్ ఇంపీరియల్ 400. ఇండియాలో భారీ సక్సెస్ సాధించిన బెనెల్లీ మోడళ్లలో ఇప్పటి వరకు ఇదే టాప్.

రిపోర్ట్స్ ద్వారా అందిన సమాచారం మేరకు, బెనెల్లీ కంపెనీకి ఇండియాలో ఇప్పటి వరకు అత్యధిక బుకింగ్స్ సాధించి పెట్టిన మోడల్ కూడా ఇదే. బెనెల్లీ ఇంపీరియల్ 400 బైక్ విడుదలైనప్పటి నుండి షోరూములకు ఎక్కువ మంది వస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు.

సేల్స్‌లో సరికొత్త సంచలనం సృష్టించిన బెనెల్లీ ఇంపీరియల్ 400 బైక్

బెనెల్లీ ఇంపీరియల్ 400 రెట్రో థీమ్‌లో వచ్చిన క్లాసిక్ స్టైలింగ్ బైక్. గుండ్రటి హెడ్‌ల్యాంప్, ట్విన్-పోడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, నీటి బిందువు ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, విశాలమైన హ్యాండిల్ బార్ మరియు రైడర్, పిలియన్ రైడర్ కోసం వేర్వేరు సీట్లు మరియు ఫోక్ వీల్స్ వంటివి బైక్‌కు పాత లుక్ తీసుకొచ్చాయి.

సేల్స్‌లో సరికొత్త సంచలనం సృష్టించిన బెనెల్లీ ఇంపీరియల్ 400 బైక్

సాంకేతికంగా బెనెల్లీ ఇంపీరియల్ 400 బైకులో 374సీసీ కెపాసిటీ గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 20.6బిహెచ్‌పి పవర్ మరియు 29ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ప్రస్తుతం ఇది బిఎస్-4 వెర్షన్, త్వరలో బిఎస్-6 ఇంజన్‌ను అందివ్వనున్నారు.

సేల్స్‌లో సరికొత్త సంచలనం సృష్టించిన బెనెల్లీ ఇంపీరియల్ 400 బైక్

హైవేల్లో బిందాస్‌గా దూసుకెళ్లే క్రూయిజర్ బైక్ బెనెల్లీ ఇంపీరియల్ 400 బైకులో ముందు వైపున 41ఎమ్ఎమ్ ట్రావెల్ గల టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ప్రిలోడ్-అడ్జస్టబుల్ డ్యూయల్-షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి.

సేల్స్‌లో సరికొత్త సంచలనం సృష్టించిన బెనెల్లీ ఇంపీరియల్ 400 బైక్

బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు చక్రానికి 300ఎమ్ఎమ్ డిస్క్ మరియు రియర్ వీల్‌కు 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు అందించారు. మెరుగైన బ్రేకింగ్ కోసం ఇందులో డ్యూయల్ ఛానల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‍‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందించారు.

సేల్స్‌లో సరికొత్త సంచలనం సృష్టించిన బెనెల్లీ ఇంపీరియల్ 400 బైక్

ఇంపీరియల్ 400 మోటార్ సైకిల్ ఫ్రంట్ 19-ఇంచుల స్పోక్ వీల్ మరియు రియర్ 18-ఇంచుల వీల్ మీద, 110/90 మరియు 130/80 కొలతల్లో ఉన్న టైర్ల మీద పరుగులు తీస్తుంది. బైక్ మొత్తం బరువు 205కిలోలు, గ్రౌండ్ క్లియరెన్స్ 165ఎమ్ఎమ్ మరియు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 12-లీటర్లుగా ఉంది.

సేల్స్‌లో సరికొత్త సంచలనం సృష్టించిన బెనెల్లీ ఇంపీరియల్ 400 బైక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయ!

బెనెల్లీ ఇంపీరియల్ 400 బైక్ మీద రోడ్డు మీద వెళుతుంటే ప్రతి ఒక్కరూ మిమ్మల్నే చూడాల్సిందే.. ఇప్పటి వరకు ఇలాంటి మోడల్ ఈ ప్రైజ్ రేంజ్‌లో మార్కెట్లో లేదంటే నమ్మండి! రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఉన్నప్పటికీ టెక్నికల్ సమస్యలు, సర్వీసింగ్ సమస్యలు మరియు ధర కూడా కాస్త ఎక్కువే దీనికి తోడు ఎటు చూసినా క్లాసిక్ 350 బైకులు వద్దన్నా కనబడుతుంటాయి. బహుశా ఈ అంశాల నేపథ్యంలోనే బెనెల్లీ ఇంపీరియల్ 400 బైక్ భారీ హిట్ కొట్టిందని చెప్పవచ్చు.

విపణిలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మరియు బుల్లెట్ 350 బైకులకు సరాసరి పోటీనిస్తోంది.

Most Read Articles

English summary
Benelli Imperiale Bookings Cross 4000 Units. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X