రాయల్ ఎన్ఫీల్డ్‌కు దడ పుట్టించిన బెనెల్లీ ఇంపీరియాలే 400

ఇటాలియన్ టూ వీలర్ తయారీ దిగ్గజం బెనెల్లీ ఇటీవల ఇండియన్ మార్కెట్లోకి కొత్తగా విడుదల చేసిన ఇంపీరియాలే 400 మోటార్ సైకిల్‌ డెలివరీలను అధికారికంగా ప్రారంభించింది. అక్టోబర్ 22న రూ. 1.69 లక్షల ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధరతో బెనెల్లీ ఇంపీరియాలె 400 బైకును లాంచ్ చేశారు.

రాయల్ ఎన్ఫీల్డ్‌కు దడ పుట్టించిన బెనెల్లీ ఇంపీరియాలే 400

తాజాగా అందిన సమాచారం మేరకు, దేశీయంగా డెలివరీలను ప్రారంభించినట్లు తెలిసింది. 23 రోజుల్లో 352 బుకింగ్స్ నమోదయ్యాయి. బెనెల్లీ ఇండియాలో ఇప్పుటి వరకు అత్యధికంగా నమోదు చేసుకున్న బుకింగ్స్ ఇవే కావడంతో బెనెల్లీ బ్రాండ్ యొక్క బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిల్‌గా ఇంపీరియాలె 400 నిలిచింది.

రాయల్ ఎన్ఫీల్డ్‌కు దడ పుట్టించిన బెనెల్లీ ఇంపీరియాలే 400

కొత్తగా విడుదలైన ఈ బైకును కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు బెనెల్లీ అధికారిక వెబ్‌సైట్లో రూ. 4,000 అడ్వాన్స్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న 24 షోరూముల్లో అంతే మొత్తాన్ని చెల్లించి ఈ మోటార్ సైకిల్‌ను బుక్ చేసుకోవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్‌కు దడ పుట్టించిన బెనెల్లీ ఇంపీరియాలే 400

ఈ ఏడాది చివరి నాటికి తమ డీలర్ల సంఖ్యను 30 కేంద్రాలకు పెంచుతామని బెనెల్లీ ఇది వరకే ప్రకటించింది. ఇంపీరియాలె 400 మోడల్ అత్యుత్తమ ఫలితాల కనబరచడంతో ఇదే రేంజ్‌‌లో మరిన్ని ఉత్పత్తులను తీసుకొస్తున్నట్లు కూడా ప్రకటించింది.

రాయల్ ఎన్ఫీల్డ్‌కు దడ పుట్టించిన బెనెల్లీ ఇంపీరియాలే 400

బెనెల్లీ ఇంపీరియాలె 400 మోటార్ సైకిల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్‌కు సరాసరి పోటీనిస్తుంది. ఇందులో రెట్రో స్టైల్ రౌండ్ హెడ్ ల్యాంప్, టెయిల్ ల్యాంప్స్ మరియు టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి. నీటి బిందువు ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డబుల్-పోడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మోటార్ సైకిల్స్‌కు పాత లుక్ తీసుకొచ్చింది.

రాయల్ ఎన్ఫీల్డ్‌కు దడ పుట్టించిన బెనెల్లీ ఇంపీరియాలే 400

ఇంపీరియాలె 400 క్లాసిక్ స్టైల్ మోటార్ సైకిల్‌‌లో 374సీసీ కెపాసిటీ గల సింగల్ సిలిండర్ బిఎస్-6 ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ 20.7బిహెచ్‌పి పవర్ మరియు 29ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికల్లా దీనిని బిఎస్-6 ఇంజన్‌తో మళ్లీ లాంచ్ చేసే అవకాశం ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్‌కు దడ పుట్టించిన బెనెల్లీ ఇంపీరియాలే 400

ఇంపీరియాలె 400 రెట్రో బైకులో సస్పెన్షన్ కోసం ముందు వైపున 41ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ప్రి-లోడ్ అడ్జెస్ట్‌మెంట్ ఫంక్షన్ గల డ్యూయల్-షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. బ్రేకింగ్ డ్యూటీ నిర్వర్తించేందుకు ఫ్రంట్ వీల్‌కు 300ఎమ్ఎమ్ డిస్క్ మరియు రియర్ వీల్‌కు 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ అందివ్వడం జరిగింది.. మెరుగైన బ్రేకింగ్ కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ కూడా జోడించారు.

రాయల్ ఎన్ఫీల్డ్‌కు దడ పుట్టించిన బెనెల్లీ ఇంపీరియాలే 400

బెనెల్లీ ఇంపీరియాలె 400 బైకు మీద కంపెనీ మూడేళ్లు లేదా అపరిమిత కిలోమీటర్ల వారంటీ అందిస్తోంది. అంతే కాకుండా దీని మీద మొదటి రెండేళ్ల పాటు ఉచిత సర్వీస్ కూడా లభిస్తోంది. అంతే కాకుండా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సర్వీసింగ్ చేయించేందుకు కస్టమర్లు వార్షిక మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కూడా ఎంచుకోవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్‌కు దడ పుట్టించిన బెనెల్లీ ఇంపీరియాలే 400

బెనెల్లీ ఇంపీరియాలె 400 మోటార్ సైకిల్ మార్కెట్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్ 350, జావా 350 మరియు జావా ఫార్టీ-టూ మోటార్ సైకిళ్లకు గట్టి పోటీనిస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కంటే 11 కిలోలు ఎక్కువ బరువు ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్‌కు దడ పుట్టించిన బెనెల్లీ ఇంపీరియాలే 400

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం

బెనెల్లీ ఇంపీరియాలె 400 బైకు మీద బుకింగ్స్ ప్రారంభించినప్పటి నుండి అత్యంత సానుకూలమైన స్పందన లభించింది. పాత కాలం నాటి రెట్రో డిజైన్, అత్యుత్తమ పవర్‌నిచ్చే శక్తివంతమైన ఇంజన్, మరియు ధరకు తగ్గ విలువలు కలిగి ఉండటంతో బెనెల్లీ ఇంపీరియాలె 400 మోడల్ ఊహించని సక్సెస్ అందుకుంది.

Most Read Articles

English summary
Benelli Imperiale 400 Deliveries Commence: Will Rival Royal Enfield Classic 350. Read in Telugu.
Story first published: Thursday, October 31, 2019, 12:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X