బెనెల్లీ లియాన్సినో 250 ప్రీమియం బైక్ విడుదల: ధర మరియు స్పెసిఫికేషన్స్

ప్రముఖ ఇటాలియన్ మోటార్‌సైకిల్ తయారీ దిగ్గజం బెనెల్లీ ఇండియన్ మార్కెట్లో సరికొత్త ప్రీమియం బైకును రిలీజ్ చేసింది. బెనెల్లీ లియాన్సినో 250 బైకును రూ. 2.5 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేశారు. బెనెల్లీ సరిగ్గా రెండు నెలల క్రితం తీసుకొచ్చిన లియాన్సినో 500 బైక్ యొక్క స్మాలర్ వెర్షన్‌గా లియాన్సినో 250 బైకును చీపెస్ట్ ప్రీమియం బైకులు ఎంచుకునే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు.

బెనెల్లీ లియాన్సినో 250 ప్రీమియం బైక్ విడుదల: ధర మరియు స్పెసిఫికేషన్స్

బెనెల్లీ లియాన్సినో 250 మోటార్‌సైకిల్‌ను రూ. 6000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. బుక్ క్యాన్సిల్ చేసుకుంటే బుకింగ్ మొత్తాన్ని పూర్తిగా వెనక్కి చెల్లిస్తారు. ట్రెడిషన్ మరియు ఇన్నోవేషన్ కాంబినేషన్‌లో లియాన్సినో 250 బైకును డెవలప్ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. సిటీ మరియు లాంగ్ రైడింగ్ అవసరాలకు చక్కగా సరిపోయేలా రూపొందించారు.

బెనెల్లీ లియాన్సినో 250 ప్రీమియం బైక్ విడుదల: ధర మరియు స్పెసిఫికేషన్స్

ఎన్నో అత్యాధునిక డిజైన్ ఎలిమెంట్లతో పురాతణ డిజైన్ శైలిలో లియాన్సినో 250 బైక్‌కు సరికొత్త రూపాన్నిచ్చారు. లియాన్సినో 250 విడుదల ఇండియన్ ఎంట్రీ లెవల్ పర్ఫామెన్స్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో అత్యంత సరసమైన బైకుగా నిలిచింది.

బెనెల్లీ లియాన్సినో 250 ప్రీమియం బైక్ విడుదల: ధర మరియు స్పెసిఫికేషన్స్

సరికొత్త బెనెల్లీ లియాన్సినో 250 బైకులో సాంకేతికంగా 249సీసీ కెపాసిటీ గల లిక్విడ్ కూల్డ్ ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ కలదు. డబుల్ ఓవర్‌హెడ్ క్యామ్‌షాఫ్ట్ కలదు, ఇంజన్ హెడ్‌లో 4-వాల్వ్‌లు ఉన్నాయి. 37ఎమ్ఎమ్ థ్రోటిల్ బాడీ మరియు ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ వంటి అత్యాధునిక ఆవిష్కరణలు దీని సొంతం.

బెనెల్లీ లియాన్సినో 250 ప్రీమియం బైక్ విడుదల: ధర మరియు స్పెసిఫికేషన్స్

బెనెల్లీ లియాన్సినో 250 బైకులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 25.4బిహెచ్‌పి పవర్ మరియు 21ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

బెనెల్లీ లియాన్సినో 250 ప్రీమియం బైక్ విడుదల: ధర మరియు స్పెసిఫికేషన్స్

250సీసీ పర్ఫామెన్స్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లోకి వచ్చిన బెనెల్లీ లియాన్సినో 250 బైకులో స్టీల్ ట్యూబ్ ట్రెల్లిస్ ఫ్రేమ్, ఇంజన్ మరియు రేడియేటర్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో వచ్చాయి. బ్లాక్ అండ్ సిల్వర్ ఎగ్జాస్ట్ మఫ్లర్, సింగల్ పీస్ సీట్ మరియు ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్ ఇందులో ప్రధాన హైలెట్స్‌గా నిలిచాయి.

బెనెల్లీ లియాన్సినో 250 ప్రీమియం బైక్ విడుదల: ధర మరియు స్పెసిఫికేషన్స్

లియాన్సినో 500 బైక్ తరహాలోనే సరికొత్త 250సీసీ లియాన్సినో బైకులో కూడా సిగ్నేచర్ లేజర్-కట్ లైయన్ సింబల్ ఫ్రంట్ ఫెండర్‌లో గమనించవచ్చు. బెనెల్లీ లియాన్సినో 250 నాలుగు విభిన్న రంగుల్లో లభిస్తోంది. అవి, బ్రౌన్, గ్రే, రెడ్ మరియు వైట్.

బెనెల్లీ లియాన్సినో 250 ప్రీమియం బైక్ విడుదల: ధర మరియు స్పెసిఫికేషన్స్

బెనెల్లీ లియాన్సినో 250 బైకులో ముందువైపున 41ఎమ్ఎమ్ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్ మరియు వెనుక వైపున ప్రిలోడెడ్ అడ్జస్టబుల్ మోనో-షాక్ అబ్జార్వర్ ఉంది. ఇరువైపులా 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, వీటి ముందువైపున 110/70-R17 సెక్షన్, వెనుక వైపున 150/60-R17 సెక్షన్ టైర్లను అందివ్వడం జరిగింది.

బెనెల్లీ లియాన్సినో 250 ప్రీమియం బైక్ విడుదల: ధర మరియు స్పెసిఫికేషన్స్

బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ వీల్‌కు 280ఎమ్ఎమ్ 4-పిస్టన్ కాలిపర్ గల ఫ్లోటింగ్ డిస్క్ మరియు వెనుక వైపున సింగల్ పిస్టన్ గల 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. అత్యుత్తమ మరియు మెరుగైన బ్రేకింగ్ కోసం డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ టెక్నాలజీని తప్పనిసరి ఫీచర్‌గా వచ్చింది.

బెనెల్లీ లియాన్సినో 250 ప్రీమియం బైక్ విడుదల: ధర మరియు స్పెసిఫికేషన్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

నిజానికి బెనెల్లీ ఈ లియాన్సినో 250 బైకును రూ. 2.25 లక్షల రేంజ్‌లో ఎప్పుడో లాంచ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం హోండా టూ వీలర్స్ ఈ క్వార్టర్ లీటర్ (2.5-లీటర్ ఇంజన్) ఇంజన్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా రాణిస్తోంది. ఇటాలియన్ బ్రాండ్ పేరుకు విపరీతంగా వెచ్చించే కస్టమర్లు చాలా కరువయ్యారు.

నాణ్యత, ధరకు తగ్గ విలువలు ఇలా ఎన్నో అంశాల పరంగా ఓ అంచనాకు వచ్చాకనే బ్రాండ్ వరకు వెళుతున్నారు కస్టమర్లు. ఏదేమైనప్పటికీ క్లాసిక్ అండ్ మోడ్రన్ డిజైన్ శైలిలో వచ్చిన బెనెల్లీ లియాన్సినో 250 మోడల్ కంపెనీ మంచి సేల్స్ తెచ్చిపెడుతుందనే చెప్పాలి.

Most Read Articles

English summary
Benelli Leoncino 250 Launched In India: Priced At Rs 2.5 Lakh. Read in Telugu.
Story first published: Saturday, October 5, 2019, 18:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X