జూన్ నెలలో బైక్ సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసా

2019 జూన్ నెలకు సంబంధించిన బైక్ అమ్మకాల నివేదికను దేశంలోని వివిధ ద్విచక్ర వాహన తయారీదారులు విడుదల చేశారు. బైక్ సేల్స్ రిపోర్ట్ లో ప్రధాన టూ వీలర్ తయారీదారుల మధ్య ఎగుడు దిగుడు అమ్మకాలు నమోదు జరిగాయి. మరి దేశంలోని కొన్ని ముఖ్యమైన బ్రాండ్ల నుంచి సేల్స్ రిపోర్ట్ ఏవిధంగా ఉందొ చూద్దాం రండి..

జూన్ నెలలో బైక్ సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసా

హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్, ప్రపంచంలోనే అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ కూడా భారత మార్కెట్లో కఠినమైన సేల్స్ ని ఎదుర్కొంటోంది. ఈ భారత ద్విచక్ర వాహన తయారీ సంస్థ గత ఏడాది జూన్ నెలలో 7,04562 యూనిట్ల నమోదు జరిగితే, 2019 జూన్ నెలలో 6,16526 యూనిట్లను కంపెనీ విక్రయించింది అంటే కేవలం 12.49 శాతం అమ్మకాలు తగినట్లు నమోదు చేసింది.

జూన్ నెలలో బైక్ సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసా

ఇది భారతీయ మార్కెట్ లో గడిచిన రెండు నెలల కాలంలో ఎక్స్ ట్రిమ్ 200 ఎస్, ఎక్స్పల్స్ 200, మాయెస్ట్రో ఎడ్జ్ 125 మరియు ప్లెజర్ 110 అనే నాలుగు కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది, అంతే కాకుండా ఇటీవల స్ప్లెండర్ ఐస్మార్ట్ తొలి బీఎస్-6 కాంప్లయన్స్ మోటార్ సైకిల్ ను కూడా ప్రవేశపెట్టింది.

జూన్ నెలలో బైక్ సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసా

రాయల్ ఎన్ఫీల్డ్

చెన్నై కేంద్రంగా ఉన్న ఈ మోటార్ సైకిల్ తయారీ సంస్థకు కూడా కఠినమైన సంవత్సరం అని చెప్పవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ తన తక్కువ సేల్స్ ని జూన్ 2019 లో కూడా కొనసాగింది. అయితే దేశీయ మార్కెట్లో 24 శాతం అమ్మకాలను కోల్పోయినట్లు కంపెనీ ప్రకటించింది.

జూన్ నెలలో బైక్ సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసా

గత ఏడాది జూన్ నెలలో 72,558 యూనిట్లతో పోలిస్తే జూన్ 2019 లో రాయల్ ఎన్ఫీల్డ్ 55,082 యూనిట్లను విక్రయించింది. ఎగుమతుల పరంగా అయితే, రాయల్ ఎన్ఫీల్డ్ జూన్ 2018 లో 1,889 యూనిట్ల అమ్మకాల నుండి 72 శాతం అద్భుతమైన వృద్ధితో గత నెలలో 3,257 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అయితే వీరి కంబైన్డ్ సేల్స్ (డొమెస్టిక్ + ఎక్స్ పోర్ట్) 22 శాతం క్షిణించినట్లు ప్రకటించింది.

జూన్ నెలలో బైక్ సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసా

టివిఎస్ మోటార్

ఆటోమోటివ్ మార్కెట్లో టివిఎస్ మోటార్ కూడా దేశంలో మందగమనంగా సేల్ అవుతున్న తెలుస్తోంది. భారత ద్విచక్ర వాహన సంస్థ దేశీయ మార్కెట్లో జూన్ 2019 లో 2,26279 యూనిట్ల అమ్మకాలను, జూన్ 2018 లో 2,46176 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 8 శాతం క్షిణించినట్లు నమోదు చేసుకొంది.

జూన్ నెలలో బైక్ సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసా

బజాజ్ ఆటో

దేశంలో ఉన్న కొన్ని ద్విచక్ర వాహన బ్రాండ్లలో బజాజ్ ఆటో ఒకటి, ఇది మార్కెట్లో తన అమ్మకాలను నిలకడగా ఉంచుకోగలిగింది. అయినప్పటికీ, వారి దేశీయ ద్విచక్ర వాహనాల అమ్మకాలు గత సంవత్సరం 2,00949 అమ్మకాలు ఉండగా, జూన్ 2019 లో 1,99340 అమ్మకాలతో 1 శాతం క్షీణించినట్లు తెలిసింది.

జూన్ నెలలో బైక్ సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసా

ఇవి ఎగుమతి మార్కెట్ లో మంచి వృద్ధిని సంపాదించాయి. బజాజ్ ఎగుమతి మార్కెట్ లో 11 శాతం వృద్ధిని నమోదు చేసింది,అంటే జూన్ 2018 లో 36803 యూనిట్లను సేల్ చేయగా జూన్ 2019 లో 1,51951 యూనిట్లను ఎగుమతి చేసింది.

జూన్ నెలలో బైక్ సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసా

సుజుకి మోటార్ సైకిల్స్

జపాన్ కంపెనీ భారతదేశంలో జూన్ 2019 నెలలో 29 శాతంతో గణనీయమైన డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసింది. ఈ సంస్థ గత ఏడాది ఇదే నెలలో 52,217 యూనిట్లతో పోలిస్తే జూన్ 2019 లో కలిపి మొత్తం 67,491 యూనిట్లు విక్రయించింది. దేషిష్ హాండా, వైస్ ప్రెసిడెంట్, సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్, ఈ విధంగా పేర్కొన్నాడు

జూన్ నెలలో బైక్ సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసా

"ఆటోమొబైల్ పరిశ్రమకు ఒక క్లిష్టమైన సమయం ఉన్నప్పటికీ, సుజుకి మోటార్ సైకిల్ ఇండియా డబుల్ డిజిట్ గ్రోత్ ద్వారా మొదటి త్రైమాసికంలో బలమైన అమ్మకాలను నమోదు చేసింది. భారతీయ ద్విచక్ర వాహన కొనుగోలుదారుడు మనపై పెట్టిన నమ్మకాన్ని మేము ప్రగాఢ కృతజ్ఞత తెలుపుతున్నాము. ఈ క్రెడిట్ లో అధిక వాటా మా డీలర్ నెట్వర్క్ కు కూడా వెళుతుంది".

Most Read Articles

English summary
The bike sales report for the month of June 2019 has been released by various two-wheeler manufacturers in the country.Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X