బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకులపై లక్ష రూపాయల విలువైన ఆఫర్లు

బిఎమ్‌డబ్ల్యూ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ మోటార్ సైకిళ్లు.. జి310 ఆర్ మరియు జి310జిఎస్ బైకులపై ఇయర్ ఎండ్ ఆఫర్లు తీసుకొచ్చింది. బిఎమ్‌డబ్ల్యూ మోటార్ సైకిళ్ల విభాగం "బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్" ఈ రెండు బైకుల మీద గరిష్టంగా 1 లక్ష రూపాయల విలువైన ఆఫర్లు ప్రకటించింది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకులపై లక్ష రూపాయల విలువైన ఆఫర్లు

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ ధర రూ. 2.99 లక్షలు మరియు జి310జిఎస్ ధర రూ. 3.49 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి. జర్మన్ దిగ్గజం బిఎమ్‌డబ్ల్యూ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న చీపెస్ట్ మోటార్ సైకిళ్లు కూడా ఇవే.

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకులపై లక్ష రూపాయల విలువైన ఆఫర్లు

ఒక సంవత్సరం పాటు ఉచిత ఇన్సూరెన్స్, ఉచిత రోడ్ ట్యాక్స్, ఉచిత రిజిస్ట్రేషన్ మరియు లోన్‌లో బైక్ తీసుకునే వారికి అతి తక్కువ వడ్డీ రేటును బిఎమ్‌డబ్ల్యూ కల్పిస్తోంది. రెండు బైకుల మీద అదనంగా మూడేళ్ల పాటు కంపెనీ వారంటీ మరియు అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీని కూడా అందిస్తోంది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకులపై లక్ష రూపాయల విలువైన ఆఫర్లు

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ మరియు జి310జిఎస్ రెండు బైకుల్లో కూడా 313సీసీ సామర్థ్యం ఉన్న లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండ్ పెట్రోల్ ఇంజన్ కలదు. బిఎస్-6 ప్రమాణాలను పాటించే ఈ ఇంజన్ గరిష్టంగా 34బిహెచ్‌పి పవర్ మరియు 28.4ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకులపై లక్ష రూపాయల విలువైన ఆఫర్లు

జి310ఆర్ (స్ట్రీట్ ఫైటర్ బైక్)) మరియు జి310జిఎస్ (ఆఫ్-రోడ్ బైక్) రెండింటిలో కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అందించారు. వీటిలో ముందు వైపున 41ఎమ్ఎమ్ సస్పెన్షన్ ట్రావెల్ గల అప్‌సైడ్-డైన్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్వర్ ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకులపై లక్ష రూపాయల విలువైన ఆఫర్లు

బ్రేకింగ్ విధుల నిర్వర్తించేందుకు ఫ్రంట్ వీల్‌కు 300ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్, రియర్ వీల్‌కు 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు జోడించారు. మెరుగైన బ్రేకింగ్ సిస్టమ్ కోసం డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను తప్పనిసరి ఫీచర్‌గా అందించారు.

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకులపై లక్ష రూపాయల విలువైన ఆఫర్లు

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ స్ట్రీట్ ఫైటర్ మోటార్ సైకిల్ విపణిలో ఉన్న కెటిఎమ్ డ్యూక్ 390, బజాజ్ డామినర్ 400, యమహా వైజడ్ఎఫ్ ఆర్3, కవాసకి నింజా 300 మరియు టీవీఎస్ అపాచే 310ఆర్ఆర్ మోటార్ సైకిళ్లకు గట్టి పోటీనిస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకులపై లక్ష రూపాయల విలువైన ఆఫర్లు

బిఎమ్‌డబ్ల్యూ జి310జిఎస్ ఆఫ్ రోడర్ బైక్ ఇండియన్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్, కవాసకి వెర్సేస్-ఎక్స్ 300 మరియు అతి త్వరలో విడుదల కానున్న కెటిఎమ్ అడ్వెంచర్ 390 మోడళ్లకు సరాసరి పోటీనిస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకులపై లక్ష రూపాయల విలువైన ఆఫర్లు

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైక్ 500సీసీ రేంజ్‌లోపు వచ్చిన కంపెనీ యొక్క మొట్టమొదటి మోడల్. ప్రస్తుతం దీనిని టీవీఎస్ మోటార్ కంపెనీ భాగస్వామ్యంతో తీసుకొచ్చారు. 310ఆర్ మరియు టీవీఎస్ అపాచే 310ఆర్ఆర్ బైకులను కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద డెవలప్ చేశారు.

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకులపై లక్ష రూపాయల విలువైన ఆఫర్లు

310 ట్విన్ మోటార్ సైకిళ్లను జర్మనీలోని బిఎమ్‌డబ్ల్యూ మ్యూనిచ్ ఆర్&డీలో అభివృద్ది చేశారు, కానీ వీటి ఉత్పత్తి మాత్రం తమిళనాడులో ఉన్న హోసూర్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు.

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకులపై లక్ష రూపాయల విలువైన ఆఫర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ మరియు జి310జిఎస్ బైకులనే ఇప్పుడు ఎక్స్-షోరూమ్ ధరతోనే ఇంటికి తీసుకెళ్లచ్చు. రిజిస్ట్రేషన్, రోడ్-ట్యాక్స్, ఇన్సూరెన్స్‌తో పాటు ఆన్-రోడ్ ధరలో అదనంగా వచ్చే 1 లక్ష రూపాయల విలువైన ఖర్చులను బిఎమ్‌డబ్ల్యూనే భరిస్తుంది. ఇయర్ ఎండ్ సేల్స్‌లో భాగంగానే ఈ ఆఫర్లను తీసుకొచ్చారు.

Most Read Articles

English summary
BMW G 310 R, G 310 GS: Year-End Benefits Of Up To Rs 1 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X