టీవీఎస్ బైకుల ధరలకు రెక్కలు.. ఏకంగా రూ. 40 వేల వరకు!

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 బైక్ కొనే ఆలోచనలో ఉన్నారా..? అయితే ఈ స్పోర్ట్స్ బైక్ కొనేందుకు మంచి తరుణం ఇదే. ఎందుకంటే జనవరి 01, 2020 నుండి ఈ బైక్ ధర ఏకంగా రూ. 40 వేల వరకు పెరగనుంది. రహస్యంగా లీకైన టీవీఎస్ తాజా ధరల పట్టికలో త్వరలో పెరగనున్న కొత్త ధరలు బయటికొచ్చాయి.

టీవీఎస్ బైకుల ధరలకు రెక్కలు.. ఏకంగా రూ. 40 వేల వరకు!

గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు పాత బిఎస్-4 ఇంజన్ స్థానంలో బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించే కొత్త ఇంజన్‌ను అన్ని వాహనాల్లో తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నూతన ప్రమాణాలకు అనుగుణంగా ఇంజన్‌లను అభివృద్ది చేయడంతో ఇప్పుడు అన్ని మోడళ్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.

టీవీఎస్ బైకుల ధరలకు రెక్కలు.. ఏకంగా రూ. 40 వేల వరకు!

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 స్పోర్ట్స్ మోటార్ సైకిల్ బిఎస్-6 ఇంజన్ అప్‌డేట్స్‌తో జనవరి 01, 2020 న మార్కెట్లో విడుదలవ్వనుంది. బిఎస్-4తో పోల్చుకుంటే బిఎస్-6 వెర్షన్ ధర 20 శాతం వరకు పెరగనుంది. అంటే, ఏకంగా రూ. 38,780 వరకు ధర పెరుగుతుంది.

టీవీఎస్ బైకుల ధరలకు రెక్కలు.. ఏకంగా రూ. 40 వేల వరకు!

టీవీఎస్ స్కూటర్లు మరియు బైకుల కొత్త ధరలకు సంభందించి రహస్యంగా లీకైన పేపర్లలో అన్ని మోడళ్ల కొత్త మరియు పాత ధరలను వివరంగా పేర్కొన్నారు. టీఎమ్-బిహెచ్‌పి వెబ్‌సైట్ కథనం మేరకు.. టీవీఎస్ ఎక్స్ఎల్100 మీద కనిష్టంగా రూ. 7,450 లు, అన్ని కమ్యూటర్ బైకులు మరియు స్కూటర్ల మీద రూ. 8,000 నుండి రూ. 10,00 వరకు అదే విధంగా అపాచే ఆర్ఆర్ 310 స్పోర్ట్స్ బైక్ మీద గరిష్టంగా రూ. 39 వేల వరకు ధరలు పెరగనున్నాయి.

టీవీఎస్ బైకుల ధరలకు రెక్కలు.. ఏకంగా రూ. 40 వేల వరకు!

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 బైక్ కంపెనీ యొక్క అతి ముఖ్యమైన మరియు ఖరీదైన మోడల్. ఇందులోని 313సీసీ, ఫ్యూయల్ ఇంజెక్షన్, లిక్విడ్ కూల్డ్ 4-స్ట్రోక్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో గరిష్టంగా 34బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టీవీఎస్ బైకుల ధరలకు రెక్కలు.. ఏకంగా రూ. 40 వేల వరకు!

టీవీఎస్ అభివృద్ది చేసి, తయారు చేస్తున్న ఇదే ఇంజన్ బిఎమ్‌డబ్ల్యూ విక్రయిస్తున్న జి310ఆర్ మరియు జి310జిఎస్ బైకుల్లో కూడా ఉంది. అపాచే ఆర్ఆర్ 310 బైకులో ఇటీవల స్లిప్పర్-క్లచ్ కూడా పరిచయం చేశారు, ఫస్ట్ బ్యాచ్ ఆర్ఆర్ 310 బైకులు కొన్న కస్టమర్లు స్లిప్పర్ క్లచ్‌ను ఫిట్ చేయించుకోవచ్చు.

టీవీఎస్ బైకుల ధరలకు రెక్కలు.. ఏకంగా రూ. 40 వేల వరకు!

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 ఇండయన్ కంపెనీ తీసుకొచ్చిన పర్ఫెక్ట్ స్పోర్ట్స్ బైక్. 300సీసీ బైక్ అయినప్పటికీ చూడటానికి 600సీసీ మోటార్ సైకిల్‌ తరహాలో ఉంటుంది. అగ్రెసివ్ బాడీ స్టైల్, ట్రెల్లిస్ రెడ్ కలర్ ఫ్రేమ్, అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపునున్న మోనో-షార్ అబ్జార్వర్లు కంప్లీట్ స్పోర్ట్స్ బైక్ రూపొన్ని తీసుకొచ్చాయి.

Most Read:హస్క్‌వర్ణ నుండి స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 బైకులు
టీవీఎస్ బైకుల ధరలకు రెక్కలు.. ఏకంగా రూ. 40 వేల వరకు!

రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు, మెరుగైన బ్రేకింగ్ కోసం డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందించారు. ఇంతకు ముందెప్పుడూ పరిచయం కానటువంటి డిఫరెట్ హెడ్ ల్యాంప్ మరియు ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ దీని సొంతం. ఇండియన్ మార్కెట్‌తో పాటు పలు విదేశాలకు దీనిని ఎగుమతి కూడా చేస్తున్నారు.

Most Read: కియా మరో సంచలనం: ఒక్క దెబ్బతో ఐదు కంపెనీలను వెనక్కి నెట్టేసింది

టీవీఎస్ బైకుల ధరలకు రెక్కలు.. ఏకంగా రూ. 40 వేల వరకు!

టీవీఎస్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని షోరూముల్లో ఆర్ఆర్ 310 స్పోర్ట్స్ బైకును విక్రయిస్తోంది. బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ 300సీసీ స్పోర్ట్స్ మోటార్ సైకిల్‌గా పేరుగాంచింది. అంతే కాకుండా టీవీఎస్ వన్-మేక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ కూడా నిర్వహిస్తోంది. అందుకోసం ఆర్ఆర్ 310 బైక్ రెగ్యులర్ వెర్షన్ కంటే రేస్ వెర్షన్ మరింత టార్క్ మరియు పవర్ ఇస్తుంది.

Most Read:కెటిఎమ్ 790 అడ్వెంచర్ కూడా వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

టీవీఎస్ బైకుల ధరలకు రెక్కలు.. ఏకంగా రూ. 40 వేల వరకు!

బిఎస్-6 మరియు బిఎస్-4 మధ్య ఎలాంటి తేడా ఉండదు, ఇంజన్ పవర్‌లో కూడా మార్పు ఉండదు. అయితే, బిఎస్-4 కంటే బిఎస్-6 ఇంజన్‌లు కర్బన కాలుష్యాన్ని తక్కువగా రిలీజ్ చేస్తాయి. గాలి కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ బిఎస్-6 ప్రమాణాలను ప్రవేశపెట్టింది.

టీవీఎస్ బైకుల ధరలకు రెక్కలు.. ఏకంగా రూ. 40 వేల వరకు!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కొత్త ప్రమాణాలకు అనుగుణంగా అన్ని బైకుల మరియు స్కూటర్లను అప్‌గ్రేడ్ చేస్తున్నందుకు గాను టీవీఎస్ తమ ఉత్పత్తుల మీద భారీగా ధరలు పెంచింది. చిన్న తరహా బైకుల ధరలు కూడా ఏకంగా రూ. 10 వేల వరకు పెరుగుతున్నాయి. ఈ నిర్ణయం టీవీఎస్ సేల్స్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో మరి!

Most Read Articles

English summary
bs6 tvs motorcycles scooters price hike details-Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X