బుకింగ్ లను ప్రారంభించబోతున్న సిఎఫ్ మోటో

చైనాకు చెందిన ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ సిఎఫ్ మోటో భారత మార్కెట్లో పోయిన నెలలో తన మోటార్ సైకిల్ తో ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ సంస్థ వారి సిఎఫ్ మోటో అనే కొత్త బైక్ ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. దీని బుకింగ్ లు ఇప్పుడు అధికారికంగా ప్రారంభించనుంది.

బుకింగ్ లను ప్రారంభించబోతున్న సిఎఫ్ మోటో

ఏఎండబ్ల్యూ మోటార్ సైకిల్స్ సిఎఫ్ మోటో ని పరిచయం చేసింది, మరియు ఇది జులై 19 నాడు 300ఎన్‌కే, 650ఎన్‌కే, 650ఎంటి, మరియు 650జిటి అనే మొత్తం నాలుగు ఉత్పత్తులు దేశీయంగా పరిచయం చేసింది, ఏఎండబ్ల్యూ మోటార్ సైకిల్స్ ఈ మోటార్ సైకిల్స్ కొరకు బుకింగ్ అధికారికంగా ఆగస్టు 5 న ప్రారంభం అవుతుందని ప్రకటించింది.

బుకింగ్ లను ప్రారంభించబోతున్న సిఎఫ్ మోటో

మొత్తం నాలుగు సిఎఫ్ మోటో మోటార్ సైకిళ్లను సికెడి ద్వారా దిగుమతి చేసుకుని ఏఎండబ్ల్యూ మోటార్ సైకిల్స్ ' హైదరాబాద్ ఫెసిలిటీ వద్ద ఉంచబడుతాయి. ఈ కంపెనీ ప్రస్తుతం ముంబై, బెంగళూరు, హైద్రాబాద్, కోల్ కతా, చెన్నై మరియు గౌహతి వద్ద షోరూమ్ లను కలిగి ఉంది.

బుకింగ్ లను ప్రారంభించబోతున్న సిఎఫ్ మోటో

వీటి ధరల విషయానికి వస్తే సిఎఫ్ మోటో 300ఎన్‌కే రూ. 2.29 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) పరిచయ ధరతో అందుబాటులో ఉంది మరియు ఇది కెటిఎమ్ 390 డ్యూక్, బిఎమ్ డబ్ల్యూ జి310ఆర్, మరియు హోండా సిబి300ఆర్ వాటిపై పోటీగా నిలువనుంది.

బుకింగ్ లను ప్రారంభించబోతున్న సిఎఫ్ మోటో

ఇది ఈ సెగ్మెంట్లో ఉన్న మిగతా వాటితో పోలిస్తే అతి చవకైన మోటార్ సైకిల్. 300ఎన్‌కేలో 292.4 సిసి లిక్విడ్ కూల్డ్ సింగిల్-సిలెండర్ 4-వాల్వ్ డిఓహెచ్సి ఇంజిన్ ను కలిగి ఉంది, ఇది 33.9 బిహెచ్పి పవర్ మరియు 20.5 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

బుకింగ్ లను ప్రారంభించబోతున్న సిఎఫ్ మోటో

ఇందులోని ఆరు-స్పీడ్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంది. కవాసకి జెడ్650 కంటే రూ.1.70 లక్షల చవకగా, రూ. 3.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) పరిచయ ధరకు ఈ సిఎఫ్ మోటో 650ఎన్‌కే అందుబాటులో ఉంది.

బుకింగ్ లను ప్రారంభించబోతున్న సిఎఫ్ మోటో

ఇందులో 649.3 సిసి లిక్విడ్-కూల్డ్ సమాంతర ట్విన్-సిలిండర్ 8-వాల్వ్ డిఓహెచ్సి ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో 61.54బిహెచ్పి మరియు 56 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ఇంజన్ కు ఆరు-స్పీడ్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంది.

బుకింగ్ లను ప్రారంభించబోతున్న సిఎఫ్ మోటో

సిఎఫ్ మోటో 650ఎంటి ప్రస్తుతం రూ.4.99 లక్షల ధరతో (ఎక్స్-షోరూమ్, ఇండియా) అందుబాటులో ఉంది. ఈ మోటార్ సైకిల్ లో ఉన్న 649.3 సిసి లిక్విడ్-కూల్డ్ సమాంతర ట్విన్-సిలిండర్ ఇంజన్ 70.7 బిహెచ్పి పవర్ మరియు 62 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేయును.

బుకింగ్ లను ప్రారంభించబోతున్న సిఎఫ్ మోటో

ఇందులోని ఇంజన్ కు ఆరు-స్పీడ్ ట్రాన్స్ మిషన్ ను జత చేయబడి ఉంది. ఇది కవాసకి వెర్సిస్ 650 తో పోటీ పడుతోంది. సిఎఫ్ మోటో 650జిటి అనేది ఒక పరిచయ ధరకు అందుబాటులో లేని ఏకైక మోటార్ సైకిల్.

బుకింగ్ లను ప్రారంభించబోతున్న సిఎఫ్ మోటో

ఇది రూ.5.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కలిగి ఉండవచ్చు. ఇందులో 649.3 సిసి లిక్విడ్-కూల్డ్ సమాంతర ట్విన్ ఎయిట్-వాల్వ్ ఇంజిన్ ద్వారా ఆధారితమైంది, ఇది 61.2 బిహెచ్పి పవర్ మరియు 58.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ఇంజన్ కు ఆరు-స్పీడ్ ట్రాన్స్ మిషన్ ను జత చేయబడి ఉంది.

Most Read Articles

English summary
CFMoto Bookings To Begin In India — Dates And Prices Revealed - Read in Telugu.
Story first published: Friday, August 2, 2019, 14:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X