స్కూటర్ ధర రూ. 15 వేలు.. జరిమానా రూ. 23 వేలు

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు ఓ స్కూటర్ యజమానికి ట్రాఫిక్ పోలీసులు దిమ్మతిరిగే షాకిచ్చారు. వెహికిల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్స్ వెంట తీసుకువెళ్లలేదని ఓ వ్యక్తికి రూ.23వేల జరిమానా విధించారు. కొత్తగా అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఈ జరిమానా విధించారు. అయితే ఆ వ్యక్తి తన స్కూటీ విలువే 15 వేల రూపాయలయితే.. జరిమానా ఏకంగా రూ. 23వేలు వచ్చిందన్నాడు. ఈ సంఘటన గుర్గావ్‌లో చోటుచేసుకుంది.

స్కూటర్ ధర రూ. 15 వేలు.. జరిమానా రూ. 23 వేలు

పూర్తి వివరాల్లోకి వెళితే.. గుర్గావ్‌కి చెందిన దినేష్ మదన్ అనే వ్యక్తి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అతనికి జరిమానా విధించాడు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ.. తన స్కూటర్ విలువ కూడా రూ.15వేలకు మించదని చెప్పాడు. భవిష్యత్తులో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించనని పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.

స్కూటర్ ధర రూ. 15 వేలు.. జరిమానా రూ. 23 వేలు

తాను తన ఇంటి దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ పేపర్ల ఫోటోలను వాట్సాప్ ద్వారా తెప్పించేలోపే పోలీసు అధికారి చలానా రాసేసాడని చెప్పాడు. ఆయన కొద్దిసేపు ఆగి ఉంటే తనకు కొంతమేరకైనా జరిమానా తగ్గి ఉండేదని వాపోయాడు. ఇక నుంచి తాను అన్ని డాక్యుమెంట్స్ తన వెంటనే ఉంచుకుంటానని చెప్పాడు.

స్కూటర్ ధర రూ. 15 వేలు.. జరిమానా రూ. 23 వేలు

అతను డ్రైవింగ్ లైసెన్స్ (DL) వెంట తెచ్చుకోనుందుకు రూ.5 వేలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) వెంట లేనందు మరో రూ.5 వేలు, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు రూ.2 వేలు, హెల్మెట్ పెట్టుకోనందుకు వెయ్యి రూపాయలు, పొల్యూషన్ చట్టాన్ని అతిక్రమించినందుకు రూ.10 వేలు మొత్తం కలిపి రూ.23 వేలు జరిమానా విధించారు.

స్కూటర్ ధర రూ. 15 వేలు.. జరిమానా రూ. 23 వేలు

కొత్తగా అమల్లోకి వచ్చిన ట్రాఫిక్స్ రూల్స్ ప్రకారం అతివేగంగా వాహనం నడిపితే రూ.2 వేలు జరిమానా, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.2 వేలు, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ. వెయ్యి జరిమానా విధిస్తారు. అదేవిధంగా మూడు నెలల ఇన్సూరెన్స్ కూడా సస్పెన్షన్ చేసే అవకాశం ఉంది.

స్కూటర్ ధర రూ. 15 వేలు.. జరిమానా రూ. 23 వేలు

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5 వేలు, అర్హత లేని వారు వాహనం నడిపితే రూ. 10 వేలు జరిమానా, సీటు బెల్టు పెట్టుకోకుంటే రూ. వెయ్యి, ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే రూ.5 వేలు, మద్యం సేవించివాహనం నడిపితే రూ. 10 వేలు జరిమానా విధిస్తారు.

More from DriveSpark

Article Published On: Friday, September 6, 2019, 12:15 [IST]
English summary
Delhi Man Issued Challan Worth Rs 23,000 For Violating Traffic Rules: No License Helmet & Documents. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+