Just In
Don't Miss
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్కూటర్ ధర రూ. 15 వేలు.. జరిమానా రూ. 23 వేలు
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు ఓ స్కూటర్ యజమానికి ట్రాఫిక్ పోలీసులు దిమ్మతిరిగే షాకిచ్చారు. వెహికిల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్స్ వెంట తీసుకువెళ్లలేదని ఓ వ్యక్తికి రూ.23వేల జరిమానా విధించారు. కొత్తగా అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఈ జరిమానా విధించారు. అయితే ఆ వ్యక్తి తన స్కూటీ విలువే 15 వేల రూపాయలయితే.. జరిమానా ఏకంగా రూ. 23వేలు వచ్చిందన్నాడు. ఈ సంఘటన గుర్గావ్లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గుర్గావ్కి చెందిన దినేష్ మదన్ అనే వ్యక్తి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అతనికి జరిమానా విధించాడు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ.. తన స్కూటర్ విలువ కూడా రూ.15వేలకు మించదని చెప్పాడు. భవిష్యత్తులో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించనని పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.

తాను తన ఇంటి దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ పేపర్ల ఫోటోలను వాట్సాప్ ద్వారా తెప్పించేలోపే పోలీసు అధికారి చలానా రాసేసాడని చెప్పాడు. ఆయన కొద్దిసేపు ఆగి ఉంటే తనకు కొంతమేరకైనా జరిమానా తగ్గి ఉండేదని వాపోయాడు. ఇక నుంచి తాను అన్ని డాక్యుమెంట్స్ తన వెంటనే ఉంచుకుంటానని చెప్పాడు.

అతను డ్రైవింగ్ లైసెన్స్ (DL) వెంట తెచ్చుకోనుందుకు రూ.5 వేలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) వెంట లేనందు మరో రూ.5 వేలు, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు రూ.2 వేలు, హెల్మెట్ పెట్టుకోనందుకు వెయ్యి రూపాయలు, పొల్యూషన్ చట్టాన్ని అతిక్రమించినందుకు రూ.10 వేలు మొత్తం కలిపి రూ.23 వేలు జరిమానా విధించారు.

కొత్తగా అమల్లోకి వచ్చిన ట్రాఫిక్స్ రూల్స్ ప్రకారం అతివేగంగా వాహనం నడిపితే రూ.2 వేలు జరిమానా, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.2 వేలు, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ. వెయ్యి జరిమానా విధిస్తారు. అదేవిధంగా మూడు నెలల ఇన్సూరెన్స్ కూడా సస్పెన్షన్ చేసే అవకాశం ఉంది.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5 వేలు, అర్హత లేని వారు వాహనం నడిపితే రూ. 10 వేలు జరిమానా, సీటు బెల్టు పెట్టుకోకుంటే రూ. వెయ్యి, ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే రూ.5 వేలు, మద్యం సేవించివాహనం నడిపితే రూ. 10 వేలు జరిమానా విధిస్తారు.