ఇండియాలో డుకాటి హైపర్ మోటార్డ్ 950 లాంచ్ డేట్ ఖరారు....!
డుకాటి భారతీయ మార్కెట్లో 2019 హైపర్ మోటార్డ్ 950 ను ప్రారంభించనుంది. 2019 డుకాటి హైపర్ మోటార్డ్ 950 ను జూన్ 12 వ తేదీన భారతదేశంలో ప్రారంభించనున్నట్లు ధృవీకరించింది.2018 అక్టోబరు నెలలో EICMA లో మోటార్సైకిల్ మొదట ప్రదర్శించబడింది.

డుకాటి హైపర్ మోటార్డ్ 950 రెండు రకాల్లో అందుబాటులో ఉంది స్టాండర్డ్ మరియు SP. డుకాటి హైపర్ మోటార్డ్ 950 పూర్తిగా కొత్త మోడల్, సవరించిన స్టైలింగ్, కొత్త ఇంజన్ మరియు నవీకరించబడిన చట్రం, సస్పెన్షన్ మరియు ఎలక్ట్రానిక్స్ అప్డేట్ లతో వస్తుంది.

భారతదేశంలో ఇదువరకే ప్రవేశపెట్టిన పాత హైపర్ మోటార్డ్ 939 స్థానాన్ని హైపర్ మోటార్డ్ 950 భర్తీ చేస్తుంది.దీనికి 937సిసి టెస్టాస్ట్రెట్టా L- ట్విన్ ఇంజన్ను 7,250ఆర్పిఎమ్ వద్ద 96ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది,

మరియు 114బిహెచ్పి qat 9,000ఆర్పిఎమ్ ను కలిగి ఉంది. దీనికి ఆరు స్పీడ్ గేర్బాక్స్ తో జత చేయబడింది. కొత్త ఇంజిన్ అధిక కంప్రెషన్ నిష్పత్తులు, కొత్త ఇంజన్ మాపింగ్, కొత్త ఎగ్సాస్ట్ కామ్ ప్రొఫైల్ మరియు కొత్త 53మిమి థొరెటల్ లను కలిగి ఉంది.

ఇందులో మార్జోకి నుండి పూర్తి సర్దుబాటు ముందు ఫోర్కులు మరియు వెనుకవైపు సాచ్స్ నుండి ఒక మోనోషాక్ సస్పెన్షన్తో వస్తుంది.

మరోవైపు, హైపర్ మోటార్డ్ 950 SP లో, ముందు మరియు వెనుక పూర్తి ఓహ్లిన్స్ సస్పెన్షన్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ SP వేరియంట్,స్టాండర్డ్ వేరియంట్ కంటే 2కేజీలు తక్కువ బరువు ఉంటుంది.

డుకాటి హైపర్ మోటార్డ్ 950 SP 890మిమి సీటు ఎత్తుతో వస్తుంది, ఇది స్టాండర్డ్ వేరియంట్ కంటే దాదాపు 120మిమి పొడవైనది.

వీటితో పాటు,డుకాటి స్టాండర్డ్ వేరియంట్ 950 యొక్క రెండు రకాలైన లక్షణాలను మరియు సామగ్రిని కలిగి ఉంటుంది. వీటిలో బాష్ కార్నింగ్ ABS ఉన్నాయి.

వీల్లీ కంట్రోల్, మల్టిపుల్ రైడ్ మోడ్లు (స్పోర్ట్, టూరింగ్ & అర్బన్), కొత్త 4.3-అంగుళాల TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ ని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








