విపణిలోకి ఇవోలెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు: వేరియంట్లు, ధర మరియు మైలేజ్

ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారు చేసే అంకుర సంస్థ రిస్సాల మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇవోలెట్ బ్రాండ్ పేరుతో మూడు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విపణిలోకి లాంచ్ చేసింది. పోలో, డెర్బీ మరియు పోలో పోని అనే మూడు విభిన్న ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది.

విపణిలోకి ఇవోలెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు: వేరియంట్లు, ధర మరియు మైలేజ్

పోలో మరియు పోలో పోని రెండు స్కూటర్లను కూడా మళ్లీ మరో రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. పోలో స్కూటర్‌ను ఇజడ్ మరియు క్లాసిక్ అనే వేరియంట్లలో లభిస్తోంది. పోలో ఇఎజ్ 48వోల్ట్ 24Ah VRLA బ్యాటరీ ప్యాక్ స్కూటర్ ధర రూ. 34,499 మరియు పోలో క్లాసిక్ 48వోల్ట్ 24Ah లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ గల స్కూటర్ ధర రూ. 54,499 లుగా ఉన్నాయి.

విపణిలోకి ఇవోలెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు: వేరియంట్లు, ధర మరియు మైలేజ్

ఇవోలెట్ డెర్బీ మరియు పోలో పోని మోడళ్లను కూడా డెర్బీ ఇజడ్, పోలో పోని ఇజ్, డెర్బీ క్లాసిక్ మరియు పోలో పోని క్లాసిక్ అనే నాలుగు సబ్ వేరియంట్లుగా పరిచయం చేశారు. పోలో పోని ఇజడ్ స్కూటర్‌లో 48వోల్ట్ 24Ah VRLA బ్యాటరీ ప్యాక్ మరియు పోలో పోని క్లాసిక్ స్కూటర్లో 48వోల్ట్ 24Ah లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 39,499 మరియు రూ. 49,499 లుగా ఉన్నాయి.

విపణిలోకి ఇవోలెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు: వేరియంట్లు, ధర మరియు మైలేజ్

ఇవోలెట్ డెర్బీ మిగతా వాటికంటే కాస్త శక్తివంతమైన స్కూటర్లు. డెర్బీ ఇజడ్ స్కూటర్లో 60వోల్ట్ 30Ah VRLA బ్యాటరీ ప్యాక్ మరియు డెర్బీ క్లాసిక్ స్కూటర్లో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ కలదు. వీటి ధరలు వరుసగా రూ. 46,499 మరియు రూ. 59,999లుగా ఉన్నాయి.

విపణిలోకి ఇవోలెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు: వేరియంట్లు, ధర మరియు మైలేజ్

వివిధ రకాల వేరియంట్లు, బ్యాటరీ ప్యాక్ మరియు మోటార్ కెపాసిటీ ఉన్నప్పటికీ... వీటన్నింటి టాప్ స్పీడ్ మరియు మైలేజ్ ఒకేలా ఉన్నాయి. మూడు స్కూటర్ల గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మరియు ఒక్కసారి ఛార్జింగ్‌తో 60కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి.

విపణిలోకి ఇవోలెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు: వేరియంట్లు, ధర మరియు మైలేజ్

మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లకు అదనంగా ఇవోలెట్ బ్రాండ్ విపణిలోకి తమ తొలి ఎలక్ట్రిక్ క్వాడ్-బైక్‌ను లాంచ్ చేసింది. ఇవోలెట్ వారియర్ క్వాడ్ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 1.40 లక్షలుగా ఖరారు చేసింది. ఇందులో 72వోల్ట్ 40Ah లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ మరియు 3kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. గంటకు 60కిమీల వేగంతో పరుగులుపెట్టే ఇవోలెట్ వారియర్ క్వాడ్ బైక్ సింగల్ ఛార్జింగ్‌తో 50కిమీల మైలేజ్‌నిస్తుంది.

విపణిలోకి ఇవోలెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు: వేరియంట్లు, ధర మరియు మైలేజ్

ఫీచర్ల విషయానికి వస్తే ఇవోలెట్ టాప్ ఎండ్ వేరియంట్ స్కూటర్లో ఇంటర్నెట్‌కు సంభందించి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఇవోలెట్ యాప్ ద్వారా స్కూటర్‌కు సంభందించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చు. స్కూటర్ మరియు బ్యాటరీ పనితీరు, పరిస్థితి, జీపీఎస్ మరియు సెక్యూరిటీ ట్రాకింగ్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

విపణిలోకి ఇవోలెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు: వేరియంట్లు, ధర మరియు మైలేజ్

ఇవోలెట్ సంస్థ ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మరియు హర్యాణా రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులోకి తీసుకరానున్నారు. రానున్న రెండు నెలల్లోపు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

విపణిలోకి ఇవోలెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు: వేరియంట్లు, ధర మరియు మైలేజ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇవోలెట్ ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ల మైలేజ్ మరియు టాప్ స్పీడ్ చాలా తక్కువగా ఉన్నాయి. సిటీల్లో మరియు చిన్న చిన్న అవసరాలకు ఈ స్కూటర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇవోలెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసే అంకుర సంస్థ, భవిష్యత్తులో మరిన్ని నూతన ఎలక్ట్రిక్ బైకులు మరియు స్కూటర్లను తీసుకొస్తామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

Most Read Articles

English summary
Evolet Electric Scooters Launched In India: Four New EVs With A Starting Price of Rs 39,000. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X