హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ బిఎస్-6 బైక్ విడుదల: ధర మరియు ప్రత్యేకతలు..

హీరో మోటోకార్ప్ భారతదేశపు మొట్టమొదటి బిఎస్-6 మోటార్ సైకిల్‌ "స్ల్పెండర్ ఐస్మార్ట్"ను మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ బిఎస్-6 మోటార్ సైకిల్ రూ. 64,900 ప్రారంభ ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధరతో లభ్యమవుతోంది. మునుపటి మోడల్ కంటే దీని సుమారుగా రూ. 8,000 పెరిగింది.

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ బిఎస్-6 బైక్ విడుదల: ధర మరియు ప్రత్యేకతలు..

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ బిఎస్-6 బైకును బిఎస్-6 సర్టిఫికేట్ లభించినపుడే ప్రదర్శించింది. అయితే, ఎట్టకేలకు బిఎస్-6 వెర్షన్ స్ల్పెండర్ ఐస్మార్ట్ అధికారికంగా మార్కెట్లోకి వచ్చింది. హీరో కంపెనీ పేటెంట్ హక్కులు పొందినటువంటి ఐ3ఎస్ సిస్టమ్ యధావిధిగా ఇందులో వచ్చింది. ఉద్గారాలు తగ్గించి, అధిక మైలేజ్ పొందడంలో ఈ టెక్నాలజీ సహాయపడుతుంది.

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ బిఎస్-6 బైక్ విడుదల: ధర మరియు ప్రత్యేకతలు..

సరికొత్త హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ బిఎస్6 బైకులో సాంకేతికంగా 113సీసీ కెపాసిటీ గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 9.1బిహెచ్‌పి పవర్ మరియు 989ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 109సీసీ గల పాత ఇంజన్‌ పవర్ 9.6బిహెచ్‌పితో పోల్చితే కొత్త ఇంజన్ కాస్త తక్కువ పవర్ ఇస్తుంది.

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ బిఎస్-6 బైక్ విడుదల: ధర మరియు ప్రత్యేకతలు..

సాంకేతికంగా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నప్పటికీ, డిజైన్ మరియు కొలతల పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు. పొడవు 2,048ఎమ్ఎమ్, వెడల్పు 726ఎమ్ఎమ్ మరియు ఎత్తు 1,110ఎమ్ఎమ్‌గా ఉన్నప్పటికీ.. వీల్ బేస్ సుమారుగా 36ఎమ్ఎమ్ వరకు పెరిగి, మొత్తం 1,270ఎమ్ఎమ్‌గా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 15ఎమ్ఎమ్ వరకు పెరిగి 180ఎమ్ఎమ్‌కు చేరుకుంది. అదే విధంగా సీటు 799ఎమ్ఎమ్ ఎత్తులో ఉంది.

(ఎమ్ఎమ్=మిల్లీ మీటర్లు)

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ బిఎస్-6 బైక్ విడుదల: ధర మరియు ప్రత్యేకతలు..

బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించే కొత్త ఇంజన్ అందివ్వడం మినహాయిస్తే పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. బిఎస్6 హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ బైకులో అదే మునుపటి 9.5-లీటర్ కెపాసిటీ గల ఫ్యూయల్ ట్యాంక్ యధావిధిగా వచ్చింది. బైక్ మొత్తం బరువు 116కిలోలుగా ఉంది.

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ బిఎస్-6 బైక్ విడుదల: ధర మరియు ప్రత్యేకతలు..

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ బిఎస్6 బైకులో ఇరువైపులా 18-అంగుళాల పరిమాణంలో ఉన్న స్టీల్ వీల్స్ ఉన్నాయి. హీరో కంపెనీకి చెందిన ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్ సైకిల్‌లో సస్పెన్షన్ పరంగా ముందువైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్వర్లు వచ్చాయి. సస్పెన్షన్ 15ఎమ్ఎమ్ వరకప పెరిగింది. బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ వీల్‌కు డిస్క్, రియర్ వీల్‌కు డ్రమ్ బ్రేక్ అందివ్వడం జరిగింది.

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ బిఎస్-6 బైక్ విడుదల: ధర మరియు ప్రత్యేకతలు..

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ భారతదేశపు మొట్టమొదటి బిఎస్-6 మోటార్ సైకిల్. హీరో స్ల్పెండర్ ప్రస్తుతం ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్, ఇందులో బిఎస్-6 ఇంజన్ పరిచయం చేయడంతో బైక్ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. విపణిలో ఉన్న హోండా సీడీ110 మరియు టీవీఎస్ రేడియాన్ మోడళ్లకు పోటీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, November 11, 2019, 9:45 [IST]
English summary
Hero Splendor iSmart BS-VI Launched In India At Rs 64,900: Country’s First BS6 Motorcycle. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+