హీరో స్ల్పెండర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బైక్ ఇలానే ఉంటుంది

హీరో మోటోకార్ప్ ఒక హైబ్రిడ్ మోటార్ సైకిల్ ను ప్రారంభించటానికి ప్రణాళికలు కలిగి ఉండకపోవచ్చు, కానీ ఒక వినియోగదారుడు ఒక అడుగు ముందుకు వేసాడు అతను కొన్ని కొత్త పరికరాలతో మార్కెట్ ఉత్పత్తులను ఉపయోగించి ఒక హైబ్రిడ్ హీరో స్ల్పెండర్ రూపొందించాడు. దీని గురించి వివరంగా తెలుసుకొందాం రండి..

హీరో స్ల్పెండర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బైక్ ఇలానే ఉంటుంది

యూట్యూబ్ ఛానెల్ క్రియేటివ్ సైన్స్ ద్వారా అప్ లోడ్ చేసిన ఒక వీడియోలో ఈ హైబ్రిడ్ బైక్ తయారీలో ఉపయోగించిన వివిధ రకాల కాంపోనెంట్స్ గురించి వివరంగా సమాచారాన్ని అందించాడు.

హీరో స్ల్పెండర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బైక్ ఇలానే ఉంటుంది

మాడిఫైడ్ బైక్ పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ పవర్ పై రెండింటితో పని చేస్తుంది. ఈ కస్టమైజేషన్ ప్రాజెక్ట్ కోసం, ఉపయోగించిన హీరో మోటార్ సైకిల్ వెనుక మరియు సీటు కింద చాలా ప్రధాన మార్పులు చేసారని తెలిపారు.

హీరో స్ల్పెండర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బైక్ ఇలానే ఉంటుంది

ఉదాహరణకు, రియర్ వీల్ ని కొత్త ఆఫ్టర్ మార్కెట్ 17 అంగుళాల వీల్ తో రీప్లేస్ చేయబడింది, ఇది BLDC హబ్ మోటార్, డ్రమ్ బ్రేక్ యూనిట్ మరియు ఛైయిన్ స్ప్రోరాకెట్ తో ముందస్తుగా అమర్చబడింది. ఈ వీల్ స్టాక్ యూనిట్ కంటే వెడల్పుగా ఉంటుంది కనుక, హోండా షైన్ నుంచి తీసుకోబడిన వెడల్పు రియర్ ఫోర్క్ తో రీప్లేస్ చేయబడింది.

హీరో స్ల్పెండర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బైక్ ఇలానే ఉంటుంది

ఈ కస్టమైజేషన్ ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన విధానాల్లో ఒకటి బ్యాటరీని ఇన్ స్టాల్ చేయడం అని చెప్పారు. స్టాక్ సీట్ పూర్తిగా తొలగించి బ్యాటరీని కింద ఫ్రేమ్కు అమర్చేవిధంగా సవరించారు.

హీరో స్ల్పెండర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బైక్ ఇలానే ఉంటుంది

బ్యాటరీకి సరిపోయే మరింత స్థలం కోసం స్టాక్ రియర్ సస్పెన్షన్ యూనిట్ తో కూడా భర్తీ చేశారు. ఒక 72వోల్ట్, 30 ఆంపియర్ లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగించారు, ఇది ఒక సారి ఛార్జింగ్ చేస్తే 90 నుండి 100 కి. మీ మైలేజ్ ఇస్తుందని పేర్కొన్నారు.

హీరో స్ల్పెండర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బైక్ ఇలానే ఉంటుంది

ఎలిమెంట్ల నుంచి రక్షణ కల్పించడం కొరకు బ్యాటరీని స్టీల్ బాక్సులో పెట్టబడింది. స్టాక్ ఎయిర్ ఫిల్టర్ తొలగించబడింది, ఆ స్థలంలో ఎలక్ట్రిక్ ఇంజిన్ కొరకు కంట్రోలర్ అమర్చడం చేయబడింది. స్టాక్ ఎయిర్ ఫిల్టర్ స్థానంలో, బైక్ హెచ్పి ఎయిర్ ఫిల్టర్ ను అమర్చడం జరిగింది.

Most Read:జీఎస్టీ ఎఫెక్ట్.. ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్ లపై ధరల తగ్గింపు

ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ కొరకు సపరేట్గా ఆన్/ఆఫ్ స్విచ్ ను రైట్ హ్యాండెబార్ మీద అమర్చారు. మరో ఉపయోగకరమైన ఫీచర్ ఏంటంటే, పెట్రోల్ ఇంజన్ రన్ అయినప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీ ఆటోమేటిక్ గా రీచార్జ్ చేసుకోవచ్చు. దీని వల్ల బైకు యొక్క మైలేజి పెరుగుతుంది.

Most Read:300 ఫాస్ట్ ఛార్జింగ్ లను ఏర్పాటు చేయనున్న టాటా మోటార్స్

హీరో స్ల్పెండర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బైక్ ఇలానే ఉంటుంది

సీటు కస్టమైజ్ చేయబడ్డ యూనిట్లా కనిపిస్తుంది మరియు ఇది బ్యాటరీని పూర్తిగా కనబడకుండా చేస్తుంది. మొత్తం ప్రాజెక్ట్ ని ఒక పద్దతి ప్రకారం అమలు చేశారు, అయితే మొదటి సరిగా చూస్తే దీనిని హైబ్రిడ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ గా గుర్తించడం కష్టం.

Most Read:' డ్రైవర్ లెస్ ' కారు లో సచిన్ టెండూల్కర్.. వీడియో సంచలనం

హీరో స్ల్పెండర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బైక్ ఇలానే ఉంటుంది

ఈ విధమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బైక్ ను హీరో మోటార్ సైకిల్ సంస్థ తీసుకొస్తుందో లేదో కానీ, ఇతను మనకు ఎలా ఉంటుంది అనేది చేసి చూపించాడు. దీనిని చూసి హీరో సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Source: Creative Science/YouTube

Most Read Articles

English summary
Hero Splendor hybrid electric DIY with 100 kms range – Explained on video - Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X