అసలైన హీరో: భారీ సేల్స్‌తో దుమ్ములేపిన హీరో అడ్వెంచర్ బైక్

దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త ఎక్స్‌పల్స్ 200 మరియు ఎక్స్‌పల్స్ 200టి బైకులను విడుదల చేసింది. ఎక్స్‌పల్స్ 200టి రోడ్ వెర్షన్ కాగా.. ఎక్స్‌పల్స్ 200 మోడల్ పూర్తిగా ఆఫ్-రోడ్ వెర్షన్.

అసలైన హీరో: భారీ సేల్స్‌తో దుమ్ములేపిన హీరో అడ్వెంచర్ బైక్

హీరో ఎక్స్‌పల్స్ 200టి ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో లభించే అత్యంత సరసమైన (చీపెస్ట్) అడ్వెంచర్ మోటార్ సైకిల్. దీని ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధర రూ. 94,000 లుగా ఉంది.

అసలైన హీరో: భారీ సేల్స్‌తో దుమ్ములేపిన హీరో అడ్వెంచర్ బైక్

తాజాగా విడుదలైన సేల్స్ గణాంకాలను పరిశీలిస్తే జూన్ 2019లో 2,674 యూనిట్ల హీరో ఎక్స్‌పల్స్ 200టి బైకులు అమ్ముడయ్యాయి. దీంతో ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే అడ్వెంచర్(ADV) బైకుగా రికార్డు సృష్టించింది.

అసలైన హీరో: భారీ సేల్స్‌తో దుమ్ములేపిన హీరో అడ్వెంచర్ బైక్

హీరో ఎక్స్‌‌పల్స్ 200టి మోడల్‌కు ప్రధాన పోటీగా నిలిచిన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోడల్ సేల్స్‌ను కూడా దాటిపోయింది. జూన్ 2019 నెలలో 1,223 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఎక్స్‌‌పల్స్ 200టి మోడల్‌తో పోల్చితే సుమారుగా రూ. 1.80 లక్షలు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు అధికంగా ఉంది.

అసలైన హీరో: భారీ సేల్స్‌తో దుమ్ములేపిన హీరో అడ్వెంచర్ బైక్

హీరో మోటోకార్ప్ తీసుకొచ్చిన ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైక్ ఎక్స్‌పల్స్ 200టి మోడల్‌లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఇంజన్ క్రింద మెటల్ బాష్ ప్లేట్, డ్యూయల్-పర్పస్ 17-ఇంచ్ వీల్స్, కాస్త ఎత్తులో అందించిన ఎగ్జాస్ట్ పైప్ మరియు ఎత్తైన విండ్ స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ గల ఫుల్లీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

అసలైన హీరో: భారీ సేల్స్‌తో దుమ్ములేపిన హీరో అడ్వెంచర్ బైక్

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

హీరో ఎక్స్‌పల్స్ 200టి బైకులో సాంకేతికంగా 200సీసీ కెపాసిటీ గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 18బిహెచ్‌పి పవర్ మరియు 17.1ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

అసలైన హీరో: భారీ సేల్స్‌తో దుమ్ములేపిన హీరో అడ్వెంచర్ బైక్

ఎక్స్‌పల్స్ 200టి బైకులో ముందువైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ కలదు. బ్రేకింగ్ విధులు నిర్వర్తించేందుకు రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు అందివ్వడం జరిగింది.

అసలైన హీరో: భారీ సేల్స్‌తో దుమ్ములేపిన హీరో అడ్వెంచర్ బైక్

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్‌తో పోల్చుకుంటే... ఇందులో 411సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 24.5బిహెచ్‌‌పి పవర్ మరియు 32ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

అసలైన హీరో: భారీ సేల్స్‌తో దుమ్ములేపిన హీరో అడ్వెంచర్ బైక్

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ బైకులో ముందువైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్, అదే విధంగా ఇరువైపులా పెద్ద పరిమాణంలో ఉన్న డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

అసలైన హీరో: భారీ సేల్స్‌తో దుమ్ములేపిన హీరో అడ్వెంచర్ బైక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హీరో ఎక్స్‌పల్స్ 200టి మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఎంట్రీలెవల్ చీపెస్ట్ అడ్వెంచర్ మోటార్ సైకిల్. నిజానికి ఈ సెగ్మెంట్లో స్టార్టింగ్ మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఉండేది.. కానీ దీని కంటే తక్కువ ధరలో వచ్చిన హీరో ఎక్స్‌‌పల్స్ 200టి హిమాలయన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. దీంతో హిమాలయన్ మోడల్ సేల్స్ హీరో అడ్వెంచర్ బైక్ తినేసింది. హిమాలయన్ కాకుండా.. విపణిలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్ అడ్వెంచర్ మోడల్‌కు కూడా కాస్త పోటీనిస్తోంది.

Most Read Articles

English summary
Hero XPulse 200T Sales Higher Than Competition — Becomes The Best-Selling ADV In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X