ఎక్ట్స్రీమ్ 1.ఆర్ కాన్సెప్ట్ బైకును ఆవిష్కరించిన హీరో
హీరో మోటోకార్ప్ సరికొత్త ఎక్ట్స్రీమ్ 1.ఆర్ కాన్సెప్ట్ మోటార్ సైకిల్‌ను ఐక్మా 2019 మోటార్ సైకిల్ షోలో ఆవిష్కరించింది. ప్రపంచపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఎక్ట్ర్సీమ్ 200ఆర్ బైక్ యొక్క నెక్ట్ జనరేషన్ వెర్షన్ ఎక్ట్ర్సీమ్ 1.ఆర్ బైకును తొలిసారిగా రివీల్ చేసింది.

హీరో ఆవిష్కరించిన అత్యాధుని ఎక్ట్స్రీమ్ 1.ఆర్ కాన్సెప్ట్ బైకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎక్ట్స్రీమ్ 200ఆర్‌తో పోల్చుకుంటే ఎంతో కొత్తగా ఉంది. హీరో తీసుకొచ్చిన ఈ కొత్త బైక్ డిజైన్ మరియు స్టైలింగ్ చూస్తే కాస్త పాత కాలం ధోరణికి వీడ్కోలు పలికినట్లు ఉంది.

సరికొత్త హీరో ఎక్ట్స్రీమ్ 1.ఆర్ కాన్సెప్ట్ బైకులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, భారీ పరిమాణంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, రైడింగ్ పొజిషన్ కల్పించే సీట్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ వంటివి ఎంతో కొత్తగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మార్కెట్లోకి వచ్చేటప్పటికీ ఇందులో ఇంకా మార్పులు జరగనున్నాయి.

హీరో వద్ద ఉన్న ఇతర బైకు నుండు సేకరించిన ఛాసిస్ మీదనే ఎక్ట్స్రీమ్ 1.ఆర్ కాన్సెప్ట్ బైకును నిర్మించినట్లు ప్రకటించింది. అంతే కాకుండా, అత్యంత మెరుగైన రైడింగ్ డైనమిక్స్ మరియు అత్యుత్తమ హ్యాండ్లింగ్ కల్పిస్తున్నట్లు పేర్కొంది.

హీరో ఎక్ట్స్రీమ్ 1.ఆర్ కాన్సెప్ట్ బైకులో ముందువైపున భారీ పరిమాణంలో ఉన్న ఫ్రంట్ ఫోర్క్స్, ఇరువైపులా డిస్క్ బ్రేకులు మరియు ధృడమైన రైడింగ్ టైర్లు ఉన్నాయి. కానీ ప్రొడక్షన్ వెర్షన్ బైకులో చాలా వరకు మార్పులే జరగనున్నాయి.

సరికొత్త ఎక్ట్స్రీమ్ 1.ఆర్ కాన్సెప్ట్ చూడటానికి రెడ్ అండ్ వైట్ పెయింట్ స్కీమ్‌లో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. కార్బన్ ఫైబర్ టిప్స్ ఉన్న సింగల్ పీస్ హ్యాండిల్‌బార్స్, రెడ్ పెయింట్ స్కీమ్ గల బ్రేక్ మరియు క్లచ్ లీవర్లు మరియు ఇంజన్ క్రింది వైపున పెద్ద పరిమాణంలో ఉన్న రెడ్ కలర్ బెల్లీ ప్యాన్ వచ్చింది.

ఎక్ట్స్రీమ్ 1.ఆర్ బైక్ గురించి ఎన్నో ముఖ్యమైన వివరాలు వెల్లడించలేదు. చూడటానికి ఎంతో అట్రాక్టివ్‌గా ఉంది. కానీ ప్రొడక్షన్ వరకు వెళుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎన్నో మోడళ్లతో పోల్చుకుంటే డిజైన్ మరియు స్టైలింగ్ పరంగా మంచి మార్కులే పడ్డాయి.

ఇంజన్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఎక్ట్స్రీమ్ 200ఆర్ బైకులో ఉన్న అదే ఇంజన్‌ను అప్‌డేటెడ్ వెర్షన్‌లో అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఇంజన్ కంటే అత్యుత్తమ పవర్ మరియు మెరుగైన టార్క్ ప్రొడ్యూస్ చేయవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ప్రస్తుతం హీరో విక్రయిస్తున్న ఎక్ట్స్రీమ్ 200ఆర్ మోడల్ యొక్క నెక్ట్స్ జనరేషన్ మోడల్ హీరో ఎక్ట్స్రీఎమ్ 1.ఆర్. భవిష్యత్తులో ఎక్ట్స్రీమ్ 200ఆర్ బైకును అప్‌గ్రేడ్ చేసినప్పుడు కొత్త తరం మోడల్‌గా ఎక్ట్స్రీమ్ 1.ఆర్ మార్కెట్లోకి వస్తుంది. 2020 నాటికి దీనిని విపణిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కస్టమర్లు ఆ కాలానికి తగ్గట్లుగా 1.ఆర్ బైకును ఇష్టపడతారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.


Click it and Unblock the Notifications








