హోండా కొత్త స్కూటర్: సైడ్ స్టాండ్ వేసి ఉంటే స్టార్ట్ కాదు!

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (HMSE) తొలి BS-6 టూ వీలర్ హోండా యాక్టివా 125 స్కూటర్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. హోండా టూ వీలర్స్ సంస్థ తీసుకొచ్చిన తొలి బీఎస్-6 టూ వీలర్ ఇదే కావడం విశేషం. 2020, ఏప్రిల్ 01 నుండి అన్ని ఇంజన్‌లు కూడా బీఎస్-6 ప్రమాణాల పాటించాలనే భారత ప్రభుత్వ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని సరికొత్త ఇంజన్‌తో యాక్టివా స్కూటర్‌ను మళ్లీ లాంచ్ చేసింది.

ఇందులో కొత్త ఇంజన్‌తో పాటు ఎన్నో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకుందాం రండి...

హోండా కొత్త స్కూటర్: సైడ్ స్టాండ్ వేసి ఉంటే స్టార్ట్ కాదు!

సరికొత్త 2019 హోండా యాక్టివా 125 బీఎస్-6 స్కూటర్ ధర రూ. 67,490 ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఖరారు చేశారు. డిజైన్ పరంగా మునుపటి యాక్టివా స్కూటర్‌తో పోల్చుకుంటే బిఎస్-6 యాక్టివాలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఫ్రంట్ డిజైన్, ఎల్ఈడీ లైట్లు మరియు టర్న్ సిగ్నల్స్ కాస్త కొత్తగా ఉన్నాయి.

హోండా కొత్త స్కూటర్: సైడ్ స్టాండ్ వేసి ఉంటే స్టార్ట్ కాదు!

స్కూటర్ ఓవరాల్ డిజైన్‌లో అనేక రకాల క్రోమ్ ఫినిషింగ్ ఎలిమెంట్లను గుర్తించవచ్చు. ఎల్ఈడీ లైట్ల మధ్య, సైడ్ ప్యానళ్ల మీద క్రోమ్ హైలెట్స్ చూడొచ్చు. ఇందుకు అదనంగా యాక్టివా 125 బిఎస్-6 స్కూటర్‌కు మ్యాట్-ఫినిషింగ్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ కొత్త లుక్ తీసుకొచ్చాయి.

హోండా కొత్త స్కూటర్: సైడ్ స్టాండ్ వేసి ఉంటే స్టార్ట్ కాదు!

ఫీచర్ల విషయానికి వస్తే.. యాక్టివా 125 బిఎస్-6 స్కూటర్లో సీట్ ఓపెన్ చేయకుండానే పెట్రోల్ నింపుకునేలా బయటివైపున ఫ్యూయల్ క్యాప్, నిశ్శబ్దంగా స్టార్ట్ అయ్యే ఎలక్ట్రిక్ ఇంజన్ స్టార్టర్, చిన్నపాటి స్టోరీజీ బాక్స్, ఎల్ఈడీ లైటింగ్ మరియు అనలాగ్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్ స్టాండ్ సెన్సార్ కలదు- సైడ్ స్టాండ్ వేసి ఉంటే ఇంజన్ స్టార్ట్ కాదు ఈ రేంజ్‌ స్కూటర్లలో కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఇది.

హోండా కొత్త స్కూటర్: సైడ్ స్టాండ్ వేసి ఉంటే స్టార్ట్ కాదు!

2019 హోండా యాక్టివా 125 స్కూటర్లో సాంకేతికంగా 124సీసీ కెపాసిటీ గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 8.4-బిహెచ్‌పి పవర్ మరియు 10.54ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఈ ఇంజన్ భారత ప్రభుత్వం 2020 ఏప్రిల్ 01 నుండి తప్పనిసరి చేసిన బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటిస్తుంది.

హోండా కొత్త స్కూటర్: సైడ్ స్టాండ్ వేసి ఉంటే స్టార్ట్ కాదు!

యాక్టివా 125 బిఎస్-6 లోని ఇంజన్ త్వరితంగా మరియు నిశ్శబ్దంగా స్టార్ట్ చేసేందుకు హోండా కంపెనీ సైలెంట్ స్టార్ట్ సిస్టమ్ ప్రవేశపెట్టింది. విభిన్నమైన మెకానిజమ్ ద్వారా స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఎలాంటి శబ్దం రాకుండానే ఇంజన్ ఆన్ అయిపోతుంది.

Most Read: విపణిలోకి టీవీఎస్ స్టార్ సిటీ+ స్పెషల్ ఎడిషన్: పండుగ ప్రత్యేకం!

హోండా కొత్త స్కూటర్: సైడ్ స్టాండ్ వేసి ఉంటే స్టార్ట్ కాదు!

సరికొత్త 2019 హోండా యాక్టివా 125 బీఎస్-6 స్కూటర్ ఆరు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. అవి, రెబల్ రెడ్, మెటాలిక్ బ్లాక్, హెవీ గ్రే మెటాలిక్, మిడ్ నైట్ బ్లూ మెటాలిక్, పర్ల్ ప్రీసియస్ వైట్ మరియు మాజెస్టిక్ బ్రౌన్ మెటాలిక్.

Most Read:ఫార్చ్యూనర్ ఫ్యాన్స్ కోసం: సెప్టెంబర్ 12న వస్తున్నా... సిద్దంగా ఉండండి

హోండా కొత్త స్కూటర్: సైడ్ స్టాండ్ వేసి ఉంటే స్టార్ట్ కాదు!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ స్కూటర్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ హోండా యాక్టివా. కొత్త వెర్షన్ విడుదలతో యాక్టివా సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. హోండా యాక్టివా 125 మార్కెట్లో ఉన్న టీవీఎస్ ఎన్‌టార్క్ 125, సుజుకి యాక్సెస్ 125 మరియు హీరో మాయెస్ట్రో ఎడ్జ్ 125 వంటి స్కూటర్ల గట్టి పోటీనిస్తోంది.

Most Read Articles

English summary
Honda Activa 125 BS-VI Launched In India: Priced At Rs 67,490
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X