విపణిలోకి రెండు ఖరీదైన బైకులు లాంచ్ చేసిన ఇండియన్ మోటార్ సైకిల్స్

ఇండియన్ మోటార్ సైకిల్స్ దేశీయ మార్కెట్లోకి రెండు ఖరీదైన బైకులను ప్రవేశపెట్టింది. ఇండియన్ ఎఫ్‌టిఆర్ 1200 ఎస్ మరియు ఎఫ్‌టిఆర్ 1200 రేస్ రెప్లికా అనే రెండు మోడళ్లను రూ. 15.99 లక్షలు మరియు రూ. 17.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా) ధరలతో అందుబాటులోకి తీసుకొచ్చారు.

విపణిలోకి రెండు ఖరీదైన బైకులు లాంచ్ చేసిన ఇండియన్ మోటార్ సైకిల్స్

ఇండియన్ ఎఫ్‌టిఐఆర్ 1200 మోడల్ లభించే రెండు వేరియంట్లు కూడా డిజైన్ పరంగా స్క్రాంబ్లర్ స్టైల్‌కు చెందిన మోటార్ సైకిళ్లు. ఎఫ్‌టిఆర్ 1200 మోడల్‌ను కంపెనీకి చెందిన పాత ఎఫ్‌టిఆర్ 750 ఫ్లాట్-ట్రాక్ రేస్ బైక్ ఆధారంగా అభివృద్ది చేశారు. పాతం కాలం నాటి రేస్ బైక్ మరియు ఆధుని సాంకేతి పరిజ్ఞానపు సమ్మేళనంతో ఎఫ్‌టిఆర్ 1200 మోడల్‌ను రూపొందించారు.

విపణిలోకి రెండు ఖరీదైన బైకులు లాంచ్ చేసిన ఇండియన్ మోటార్ సైకిల్స్

డిజైన్ పరంగా ఎఫ్‌టిఆర్ 1200 మోడల్ లభించే రెండు వేరియంట్లు కూడా ఆరంబడమైన గొప్పలకు పోకుండా అతి తక్కువ బాడీ వర్క్‌ డిజైన్ చేయబడ్డాయి. బైక్ ఫ్రేమ్ మొత్తం బయటికి కనిపించే ఆకర్షణీయంగా మరియు ధృడంగా తయారు చేశారు.

విపణిలోకి రెండు ఖరీదైన బైకులు లాంచ్ చేసిన ఇండియన్ మోటార్ సైకిల్స్

ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, టెయిల్ ల్యాంప్ యూనిట్, 4.3-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్-స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ డిస్ల్పే మరియు కాస్త పైవైపుకు వంచినటువంటి ఎగ్జాస్ట్ సిస్టమ్ వంటి ఆకర్షణీయమైన అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

విపణిలోకి రెండు ఖరీదైన బైకులు లాంచ్ చేసిన ఇండియన్ మోటార్ సైకిల్స్

ఇండియన్ మోటార్ సైకిల్స్ ఎఫ్‌టిఆర్ 1200 ఎస్ మరియు 1200 రేస్ రెప్లికా మోడళ్లను సరికొత్త ఫ్లాట్‌ఫామ్ మీద ఆవిష్కరించింది. భవిష్యత్తులో కంపెనీ ఆవిష్కరించాలని భావిస్తున్న నేక్డ్ స్ట్రీట్-ఫైటర్ బైకులను కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్ డెవలప్ చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఫ్యూచర్‌లో ఇంకా ఎన్నో మోడళ్లకు ఈ డిజైన్ ఫ్లాట్‌ఫామ్ వేదిక కానుంది.

విపణిలోకి రెండు ఖరీదైన బైకులు లాంచ్ చేసిన ఇండియన్ మోటార్ సైకిల్స్

సాకేతికంగా ఎఫ్‌టిఆర్ 1200 ఎస్ మరియు ఎఫ్‌టిఆర్ 1200 రేస్ రెప్లికా బైకుల్లో ఒకే రకమైన ఇంజన్ కలదు. 1203సీసీ కెపాసిటీ గల లిక్విడ్-కూల్డ్ వి-ట్విన్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 120బిహెచ్‌పి పవర్ మరియు 112.5ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

విపణిలోకి రెండు ఖరీదైన బైకులు లాంచ్ చేసిన ఇండియన్ మోటార్ సైకిల్స్

సస్పెన్షన్ కోసం ముందు వైపున 43-ఎమ్ఎమ్ ట్రావెల్ గల ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ఫుల్లీ-అడ్జస్టబుల్ పిగ్గీబ్యాక్ ఐఎఫ్‌పి సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. బ్రేకింగ్ డ్యూటీ కోసం రెండు బైకుల్లో ఫ్రంట్ వీల్‌కు 320ఎమ్ఎమ్ డ్యూయల్ డిస్క్ మరియు రియర్ వీల్‌కు 265ఎమ్ఎమ్ చుట్టుకొలత గల సింగల్ డిస్క్ బ్రేక్ కలదు.

Most Read: 68 వేల ధరకే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: పెట్రోల్ అవసరం లేదు!

విపణిలోకి రెండు ఖరీదైన బైకులు లాంచ్ చేసిన ఇండియన్ మోటార్ సైకిల్స్

రెండు బైకుల్లో రైడర్లు సులభంగా, సురక్షితమైన రైడింగ్ చేసేందుకు ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ ఫీచర్లను పరిచయం చేశారు. అందులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, సిక్స్-యాక్సిస్ ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్ (IMU), బాష్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు పలు రకాల రైడింగ్ మోడ్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి.

Most Read: ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అదిరిపోయే ఆఫర్లు: ఇప్పుడే చెక్ చేసుకోండి

విపణిలోకి రెండు ఖరీదైన బైకులు లాంచ్ చేసిన ఇండియన్ మోటార్ సైకిల్స్

ఇండియన్ మోటార్ సైకిల్స్ ఈ రెండు బైకులను గత ఏడాది డిసెంబర్‌లోనే ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధరలను కూడా అప్పుడే ఖరారు చేసింది. కానీ పలు కారణాల రీత్యా అధికారికంగా వీటి విడుదల ఆలస్యమైంది. రెండు మోడళ్ల మీద దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ షోరూముల్లో రూ. 2 లక్షల ధరతో బుకింగ్స్ ప్రారంభించారు, డెలివరీలు త్వరలో మొదలవనున్నాయి.

Most Read: బజాజ్ మరియు కెటిఎమ్ కలయికలో వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్

విపణిలోకి రెండు ఖరీదైన బైకులు లాంచ్ చేసిన ఇండియన్ మోటార్ సైకిల్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మోటార్ సైకిల్స్ తమ పాత మోడల్ ఎఫ్‌టిఆర్ 750 స్కౌట్ ఫ్లాట్-ట్రాక్ రేస్ బైక్ ఆధారంగా ఎఫ్‌టిఆర్ 1200ఎస్ మరియు ఎఫ్‌టిఆర్ రేస్ రెప్లికా మోడళ్లను తీసుకొచ్చింది. పాత డిజైన్ లక్షణాలు మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ రెండు కూడా విపణిలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ నైన్ టి స్క్రాంబ్లర్ మరియు ట్రయంప్ స్క్రాంబ్లర్ మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Indian FTR 1200 S & FTR 1200 Race Replica Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X