మార్కెట్లోకి జావా యానివర్సరీ ఎడిషన్: తొలి 90 కస్టమర్లకు మాత్రమే!

జావా మోటార్ సైకిల్స్ కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి జావా యానివర్సరీ ఎడిషన్ బైకులను విడుదల చేసింది. చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన జావా బ్రాండ్ 90 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకొని జావా బైకులను యానివర్సరీ ఎడిషన్‌లో తీసుకొచ్చారు. సరికొత్త జావా స్పెషల్ యానివర్సరీ ఎడిషన్ బైక్ ధర రూ. 1.73 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

మార్కెట్లోకి జావా యానివర్సరీ ఎడిషన్: తొలి 90 కస్టమర్లకు మాత్రమే!

జావా యానివర్సరీ ఎడిషన్ బైకు పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే లిమిటెడ్ ఎడిషన్ కూడా... అంటే కంపెనీ 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేవలం 90 బైకులను మాత్రమే అందుబాటులో ఉంచింది. పలు రకాల హైలెట్స్ మరియు ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్‌తో ప్రతి బైకు మీద 1 నుండి 90 వరకు నెంబర్లు కూడా ఉంటాయి. అంతే కాకుండా జావా కంపెనీ 1929లో తీసుకొచ్చిన తొలి బైకు - జావా 500 OHV మోడల్‌కు నివాళిగా ఈ స్పెషల్ ఎడిషన్ బైకులో ప్రత్యేకమైన బాడీ డీకాల్స్ కూడా ఉంటాయి.

మార్కెట్లోకి జావా యానివర్సరీ ఎడిషన్: తొలి 90 కస్టమర్లకు మాత్రమే!

జావా స్పెషల్ యానివర్సరీ ఎడిషన్ మోడల్ డిజైన్ పరంగా చూడటానికి అచ్చం రెగ్యులర్ మోడల్‌నే పోలి ఉంటుంది. అదే రెడ్ కలర్ పెయింట్ స్కీమ్ మరియు బాడీ స్టైలింగ్స్ ఇందులో అలాగే వచ్చేశాయి.

మార్కెట్లోకి జావా యానివర్సరీ ఎడిషన్: తొలి 90 కస్టమర్లకు మాత్రమే!

యానివర్సరీ ఎడిషన్ జావా బైకులో చక్కగా మెరిసే క్రోమ్ ఎగ్జాస్ట్ పైప్ మరియు ఇంజన్ ఉన్నాయి. దీనికి తోడు ఫ్యూయల్ ట్యాంక్ మీద జావా చిహ్నం మరియు విభిన్నమైన సీరియల్ నెంబర్ కూడా వచ్చింది.

మార్కెట్లోకి జావా యానివర్సరీ ఎడిషన్: తొలి 90 కస్టమర్లకు మాత్రమే!

పైన పేర్కొన్న కాస్మొటిక్ మార్పులు మినహాయిస్తే, సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు. యానివర్సరీ ఎడిషన్ జావా బైకులో 293సీసీ కెపాసిటీ గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ గల ఇంజన్ గరిష్టంగా 26బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మార్కెట్లోకి జావా యానివర్సరీ ఎడిషన్: తొలి 90 కస్టమర్లకు మాత్రమే!

సస్పెన్షన్ సిస్టమ్ పరంగా ముందువైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుకవైపున డ్యూయల్ షాక్-అబ్జార్వర్లు వచ్చాయి. బ్రేకింగ్ వ్యవస్థ కోసం రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు వచ్చాయి, మెరుగైన బ్రేకింగ్ కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ఫీచర్ స్టాండర్డ్ ఫీచర్‌గా లభిస్తోంది.

మార్కెట్లోకి జావా యానివర్సరీ ఎడిషన్: తొలి 90 కస్టమర్లకు మాత్రమే!

లిమిటెడ్ ఎడిషన్ జావా మోటార్ సైకిళ్లు అక్టోబర్ 15 నుండి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జావా షోరూముల్లో లభిస్తోంది. ఇది వరకే జావా బైకును బుక్ చేసుకున్న కస్టమర్లు యానివర్సరీ ఎడిషన్ బైకును ఎంచుకోవచ్చు. ఆసక్తి ఉన్న కస్టమర్లు అక్టోబర్ 22 లోపు ఈ మోడల్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగానే ప్రకటించిన గడువులోగా వచ్చిన బుకింగ్స్ రిక్వెస్టుల్లో లక్కీ డ్రా ద్వారా 90 మంది కస్టమర్లను ఎంపిక చేస్తారు. నవంబర్ నుండి డెలివరీలు ప్రారంభమవుతాయి.

జావా మోటార్ సైకిల్ బ్రాండ్ 2018 నంవబరులో ఇండియన్ మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ ప్రస్తుతం జావా మరియు జావా 42 అనే రెండు మోటార్ సైకిళ్లను విక్రయిస్తోంది. విడుదలైన అనతి కాలంలోనే ఈ రెండు మోడళ్లకు విపరీతమైన రెస్పాన్ వచ్చింది. ప్రస్తుతం రెండింటి మీదా 9 నుంచి 10 నెలల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు సమాచారం. త్వరలో మరో మూడు కొత్త బైకులను విపణిలోకి ప్రవేశపెట్టాలని జావా సంస్థ ప్రయత్నిస్తోంది.

మార్కెట్లోకి జావా యానివర్సరీ ఎడిషన్: తొలి 90 కస్టమర్లకు మాత్రమే!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జావా యానివర్సరీ ఎడిషన్ మోటార్ సైకిల్ జావా బ్రాండ్ 90 సంవత్సరాల ఉనికిని చాటుతోంది. జావా కంపెనీ ప్రవేశపెట్టిన తొలి మోటార్ సైకిల్ జావా 500 OHV ప్రేరణతో ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను తీసుకొచ్చారు.

పాత డిజైన్ లక్షణాలు మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మేళవింపుతో మళ్లీ పుట్టిన జావా మోటార్ సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్‌కు ధీటైన జవాబిస్తోంది. దేశీయ మార్కెట్లో క్లాసిక్ స్టైల్ బైకులను అత్యంత సరసమైన ధరలో విక్రయిస్తున్న ఈ రెండు సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. జావా బైకులు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్‌కు సరాసరి పోటీనిస్తోంది.

Most Read Articles

English summary
New Jawa 90th Anniversary Edition Model Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X