Just In
- 8 min ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- 1 hr ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 2 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 3 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
Don't Miss
- Movies
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దారుణంగా మోసపోయాం... జావా కంపెనీపై మండిపడుతున్న కస్టమర్లు
పురాతణ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థగా ప్రఖ్యాతిగాంచిన జావా మోటార్ సైకిల్స్ చాలా సంవత్సరాల తర్వాత మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించింది. పాత కాలపు డిజైన్ శైలిలో అత్యాధునిక టెక్నాలజీతో రెండు కొత్త బైకులను విపణిలోకి ప్రవేశపెట్టి కస్టమర్లను ఎంతగానో ఆకర్షించింది. రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు ఎనలేని ఫ్యాన్స్ ఉన్నట్లే జావా బైకులకు కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కానీ జావా దక్కించుకున్న ఈ గౌరవం ఎంత కాలమో నిలవలేదు. దేశవ్యాప్తంగా కస్టమర్ల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అవును.. జావా బైకులు కొన్న కస్టమర్లు ఇప్పుడు కంపెనీ మీద తీవ్రంగా మండిపడుతున్నారు.
దీనికంటే అసలు కారణమేంటో వివరంగా చూద్దాం రండి....

జావా బైకులను కంపెనీ ఇటీవల కస్టమర్లకు డెలివరీ ఇచ్చింది. కానీ ఏడాది కాలం కూడా గడవకుండానే బైకు విడి భాగాలన్నీ తుప్పుపట్టాయి. మోసపోయామని గ్రహించిన కస్టమర్లు ఆ ఫోటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. ఆదర్శ్ గుప్తా అనే కస్టమర్ ఫేస్‌బుక్‌లోని జావా ఓనర్స్ & లవర్స్ గ్రూపులో ఫోటోలు షేర్ చేశాడు.

ఆగష్టు 12, 2019 రోజున ఆదర్శ్ గుప్తా సరికొత్త జావా బైకును డెలివరీ తీసుకున్నాడు. కనీసం రెండు వారాలు కూడా గడవకుండానే బైకులోని వివిధ భాగాలు తుప్పుబట్టాయి. హ్యాండిల్ బార్ నట్ చుట్టు మరియు ఇంజన్ భాగాలు తీవ్రంగా తుప్పుపట్టాయి.

ఇంజన్ బ్లాక్ మీద బ్లాక్ పెయింట్ కాకుండా తుప్పుబట్టినట్లు కనిపించే మట్టిరంగును గుర్తించవచ్చు. ఇంజన్ చుట్టూ ఇలాగే మారిపోయినట్లు కస్టమర్ ఆదర్శ్ వాపోయాడు. పెయింట్ సరిగా చేయకపోవడం కూడా ఇందుకొక ప్రధాన కారణమని భావించవచ్చు.

నిజానికి ఇది రెండో కేసు, గతంలో కూడా ముంబాయ్‌కి చెందిన శైలేష్ స్వర్ణ అనే కస్టమర్ కొనుగోలు చేసిన జావా బైక్ కూడా ఇలాగే తుప్పుబట్టినట్లు సోషల్ మీడియా వేదికగా వివరించాడు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే బైకులోని కీలక విడిభాగాలు తీవ్రంగా తుప్పుపట్టినట్లు వెల్లడించాడు.

సైలెన్సర్ పైపు, హ్యాండిల్ బార్ నట్, డిస్క్ రోటార్లు, రిమ్ములు మరియు ఛాసిస్‌లోని పలు ఇతర ప్రధాన విడి భాగాలు తుప్పుబట్టాయి. స్పీడో మీటర్‌లోనికి నీరు కూడా ప్రవేశించింది.

డెలివరీ తీసుకున్న కేవలం నెల రోజుల్లోనే ఊహించని విధంగా బైకు తుప్పుబట్టడంతో జావా బైకుతో తన అనుభవాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన జావా సంస్థ తీవ్రంగా దెబ్బతిన్న, తుప్పబట్టిన విడి పరికరాలను కొత్త వాటితో రీప్లేస్ చేసి, రీపెయింటింగ్ చేయిస్తామని మాటిచ్చింది.
Most Read:కొత్త రోడ్డు స్కామ్ బయట పడింది..జాగ్రత్తగా ఉండండి

బైకులను ఆన్‌లైన్ డెలివరీ ఇచ్చే విషయంలో కూడా పలు అవకతవకలు జరుగుతున్నట్లు కస్టమర్లు తెలిపారు. జావా కంపెనీ వెబ్‌సైట్లోని ఆన్‌లైన్ డెలివరీ ఎస్టిమేటర్‌లో మోసం జరుగుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా సర్వీస్ ఛార్జి కింద కస్టమర్ల నుండి రూ. 9,000 వరకు అదనంగా వసూలు చేసినట్లు కస్టమర్లు ఫిర్యాదు చేశారు.
Most Read:బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

క్లాసిక్ బైక్ ప్రియులు నిజానికి క్వాలిటీ మరియు స్టాండర్డ్స్ అస్సలు పట్టించుకోరు. కానీ ఎంతో ఇష్టంగా తమ డ్రీమ్ బైకుగా భావించే కస్టమర్లు ఇలాంటి మోసాల కారణంగా ఎంతగానో బాధపడుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది కస్టమర్లు జావా బైకులను బుక్ చేసుకున్నారు. ప్రామిస్ చేసిన సమయంలో డెలివరీ ఇవ్వాలని, కస్టమర్ల నుండి ఎదురవుతున్న ఒత్తిడి కారణంగా క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోతోంది. దీంతో డెలివరీ చేసిన కొన్నాళ్లకే ఇలా తుప్పుపడుతున్నాయి.
Most Read:మీ వాహనంపై ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ ఉంటే అంతే ఇక...!

జావా మోటార్ సైకిళ్లు గురించి ప్రచారంలో ఉన్న వార్తల్లో సగానికి పైగా కంపెనీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. దీంతో ఎన్నో ఆశలతో మళ్లీ ప్రాణం పోసుకున్న జావా సంస్థ ఇలాంటి సమస్యలతో తమ ఆరంభానికి అంతం మొదలైందని తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఇలాంటి సమస్యలను గుర్తించి పుల్‌స్టాప్ పెట్టి, కస్టమర్లను సంతృప్తి పరిచే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జావా బైకుల మీద విపరీతమైన బుకింగ్స్ రావడంతో కస్టమర్లకు డెలివరీ ఇచ్చేందుకు సుధీర్ఘ వెయిటింగ్ పీరియడ్ ప్రకటించింది. డిమాండుకు తగ్గ ఉత్పత్తిని చేపట్టి అనుకున్న సమయానికి కస్టమర్లకు డెలివరీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. సమయాభావం మరియు ఒత్తిడి నేపథ్యంలో నాణ్యతను విస్మరిస్తే భవిష్యత్తులో కంపెనీ మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి తప్పది.