భారతదేశంలో నిలిపివేయబడిన కవాసకి నింజా 300

జపాన్ బైకుల తయారీ దిగ్గజమైన కవాసకి తన ఉత్పత్తులను ఇండియా మార్కెలతో విడుదలచేసి బాగా ప్రాచుర్యం పొందింది. అయితే ఇపుడు కవాసకి ఇండియా మార్కెలతో నింజా 300 ఉత్పత్తులను నిలిపివేసింది. బైక్ వాలే ప్రకారం నింజా 300 బైకులను ఈ ఏడాది అక్టోబర్ లో తన ఉత్పత్తులను ఆపివేసింది అని తెలియజేసింది. డీలర్ షిప్ వద్ద మిగిలి ఉన్న వాహనాలు మాత్రం అమ్ముడయ్యాయి.

భారతదేశంలో నిలిపివేయబడిన కవాసకి నింజా 300

కవాసకి నింజా 300 భారత మార్కెట్లో ప్రవేశించినప్పుడు దీని ధర రూ. 2.98 లక్షలతో వచ్చింది. అయితే మార్కెట్లో నింజా 400 రూపంలో పరిచయం చేసింది. అయితే ఇది 300 సిసి మోడల్ కంటే కూడా ఎక్కువ ప్రీమియం వస్తుంది.

భారతదేశంలో నిలిపివేయబడిన కవాసకి నింజా 300

భారతదేశంలో నింజా 300 యొక్క బిఎస్-6 వేరియంట్‌ను ప్రవేశపెట్టడం గురించి కవాసకి ప్రస్తుతం అధికారిక ప్రకటన చేయలేదు. కవాసకి నింజా 300 దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటారుసైకిల్. అందువల్ల ఈ మోడల్‌ను నిలిపివేయడం సంస్థ యొక్క అమ్మకాల పరంగా పెద్ద దెబ్బ అవుతుంది భావిస్తున్నారు.

భారతదేశంలో నిలిపివేయబడిన కవాసకి నింజా 300

కవాసకి నింజా 300 బైక్ 296 సిసి లిక్విడ్-కూల్డ్ ట్విన్ సిలిండర్ ఇంజన్ తో నడిచింది. ఇది ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. 39బిహెచ్‌పి మరియు 28ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటారుసైకిల్ లో అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్, వెనుక సస్పెన్షన్ కోసం సర్దుబాటు చేయగల మోనో-షాక్, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ తో ప్రామాణికంగా మరియు ఆధునిక డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో డిస్క్ బ్రేక్‌లు మొదలైన ప్రత్యేక లక్షణాలు ఇందులో ఉన్నాయి.

భారతదేశంలో నిలిపివేయబడిన కవాసకి నింజా 300

కవాసకి నింజా 400 బైక్ 399 సిసి లిక్విడ్-కూల్డ్ ట్విన్-సిలిండర్ యూనిట్‌తో వస్తుంది. ఇది ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన 47.5 బిహెచ్‌పి మరియు 38 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. నింజా 400 కూడా పెద్ద సస్పెన్షన్ మరియు బ్రేక్‌లతో పాటు అనేక అదనపు లక్షణాలతో ప్రీమియం ధరలను సమర్థిస్తుంది.

భారతదేశంలో నిలిపివేయబడిన కవాసకి నింజా 300

కవాసకి నింజా 300 తో పోలిస్తే నింజా 400 మరింత ఆధునిక డిజైన్‌తో వస్తుంది. ఈ వాహనం రెండు రంగులలో లభిస్తుంది. ఒకటి ఎబోనీ బ్లాక్ రెండవది లైమ్ గ్రీన్. కవాసకి కంపెనీ ఇటీవలే భారతదేశపు మోటారుసైకిల్ కవాసకి జెడ్ 900 ను ప్రవేశపెట్టింది. కొత్తగా రాబోతున్న కవాసకి జెడ్ 900 బిఎస్-6 యొక్క ధర 8.50 లక్షల నుండి 9 లక్షల వరకు ఉంటుంది. ఇది కొత్త ఫీచర్లతో వస్తుంది. దానికి సంబంధించిన వివరాలు మనకు ఇక్కడ తెలుస్తాయి.

భారతదేశంలో నిలిపివేయబడిన కవాసకి నింజా 300

కవాసకి నింజా 300 కంటే కవాసకి జెడ్ 900 చాలా అప్డేట్ గా ఉంటుంది. నింజా 300 కంటే కొత్త వెర్షన్లో ఉంటుంది. ధరలో కూడా చాలా వ్యత్యాసం ఉటుంది.

Read More:రహదారిపై ఉన్న ట్రక్కును నెట్టిన హైదరాబాద్ పోలీసులు : ఎందుకంటే...?

భారతదేశంలో నిలిపివేయబడిన కవాసకి నింజా 300

కవాసకి నింజా 300 నిలిపివేతపై ఆలోచనలు:

కవాసకి నింజా 300 భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన మోడల్. నింజా 300 భారతదేశంలో స్థానికంగా ఉండి, మార్కెట్లో పోటీ ధరను ఇవ్వడానికి వీలు కల్పించింది. కవాసకి నింజా 300, టివిఎస్ అపాచీ ఆర్ఆర్ 310, కెటిఎం ఆర్‌సి 390 మరియు యమహా ఆర్ 3 వంటి వాటికి ప్రత్యర్థిగా నిలిచింది.

Source:Bikewale

Most Read Articles

English summary
Kawasaki Ninja 300 Discontinued In India: Here Are All The Details- Read in Telugu
Story first published: Friday, December 27, 2019, 18:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X