కవాసకీ బైక్ ప్రియులకు బ్యాడ్ న్యూస్,ధర లను పెంచబోతున్న కవాసకీ..
భారతీయ మార్కెట్లో కవాసకీ ఉత్పత్తి శ్రేణిలో ధరల పెంచబోతూ ప్రకటనను విడుదల చేసింది,ఇది ఏప్రిల్ 1, 2019 అమలుకాబోతుంది కావున ఈ కవాసకీ బైక్ ప్రియులంతా త్వరగా తమకు కావలసిన మోడల్ ను తీసుకోవడం లో త్వరపడాలి. కవాసకీ ఈ క్రింది మోడల్ లపై ధరలను పెంచుతోంది.

కవాసకీ నింజా 400, నింజా 650, వెర్సైస్ 650, వల్కాన్ ఎస్ మరియు Z650 లతో కూడిన కవాసాకి మిడిల్వైట్ మోటార్సైకిల్ సెగ్మెంట్ల పై కూడా 7 శాతం వరకు పెరిగిపోతుంది. దీని ధర సుమారుగా 38,000 రూపాయలు ఉండవచ్చు మరియు కవాసాకి యొక్క పెద్ద మోటార్ సైకిల్ ఆఫర్లు నింజా 1000, వెర్సైస్ 1000 మరియు జెడ్ఎక్స్-10ఆర్, ధర 5 శాతం వరకు పెరగవచ్చును.

కవాసకీ నింజా 300 ను మాత్రమే ధరల పెంపును నిర్ధారించలేదు. ఈ యొక్క బ్రాండ్ మోటార్ సైకిళ్ల యొక్క సవరించిన ధరల జాబితాను ఏప్రిల్ 1, 2019 నుండి అప్డేట్ చేస్తుంది. కవాసకీ మోడల్ ధరల పెరుగుదల కారణం ప్రధానంగా ముడి పదార్ధాల ధరలు మరియు ఇతర ఇన్పుట్ ఖర్చులు పెరగడమే.

కవాసకి ఇటీవలే భారతీయ మార్కెట్లో కవాసకీ వెర్సైస్ 1000 ను ప్రారంభించారు దీనిని గత సంవత్సరం EICMA వద్ద ప్రదర్శించబడింది మరియు దీని యొక్క ధర భారతదేశం లో ఎక్స్ షోరూమ్ లో 10.69 లక్షల గా ఉన్నదీ, కవాసాకి వెర్సైస్ 1000 అనేది భారతీయ విపణిలో అత్యధికంగా మైలేజ్ అందించే వాటిలో ఒకటి.

భారతీయ మార్కెట్లో వెర్సైస్ 1000 ను ప్రారంభించడంలో, ముంబైలోని కవాసకీ డీలర్లు కవాసకి వెర్సైస్ 650 యజమానులు అద్భుతమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లును ప్రారంభించారు. ఈ ఆఫర్లో భాగంగా,కవాసకి వెర్సైస్ 650 యజమానులు తమ మోటార్సైకిల్లను వెర్సైస్ 1000 కు మార్పిడి చేసుకోవచ్చు, అలాగే తిరిగి కొనుగోలు చేసేవారికి 90 శాతం వరకు ఆఫర్ ని అందిస్తున్నారు.

వారి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కోసం బ్రాండ్ యొక్క మొదటి సెట్ పేటెంట్ చిత్రాలను ఇటీవల ఆన్లైన్లో వెల్లడించారు. కవసాకి ఈవీ యొక్క ప్రారంభ నమూనాలను వెల్లడించారు. అయితే ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ భారత మార్కెట్లోకి ప్రవేశించినట్లు ఎటువంటి నిర్ధారణ లేదు కావున
అది దాని ప్రారంభదశల్లోనే ఉంది.


Click it and Unblock the Notifications








