ఇండియాలో లేటెస్ట్ బైక్ విడుదల చేసిన కవాసకి ...ధర రూ. 6.25 లక్షలు

కవాసకి ఇండియా ఇప్పుడు భారత మార్కెట్లోకి మరో కొత్త వేరియంట్ ని విడుదలచేయబోతోంది. దానిపేరే కవాసకి జెడ్ 650. కొత్తగా విడుదలచేయబోతున్న ఈ వెహికల్ ఇప్పుడు మార్కెట్లోకి భారీ ధరతో రాబోతుంది. 2020 కవాసకి జెడ్ 650 బిఎస్-6 మోటార్ సైకిల్ ధర రూ. 6.25 లక్షలనుండి రూ. 6.50 లక్షల మధ్య ఉటుంది. కొత్తగా వస్తున్న ఈ మోటార్ సైకిల్ మునుపటి బిఎస్ 4 మోడల్ కంటే దాదాపు రూ.55,000 ఎక్కువ ధర ఉండబోతుంది.

ఇండియాలో లేటెస్ట్ బైక్ విడుదల చేసిన కవాసకి ...ధర రూ. 6.25 లక్షలు

కొత్త 2020 జెడ్ 650 బైక్ జెడ్ 900 తరువాత భారతీయ లైనప్ నుండి బిఎస్-6 సమ్మతిని సాధించిన రెండవ వాహనం. 2020 లో రాబోయే ఉద్గార నిబంధనలకు అనుగుణంగా జెడ్650 యొక్క ఎగ్జాస్ట్ మరియు ఎయిర్-బాక్స్‌కు పునరుద్ధరణ చేయబడ్డాయి. ఇది మిడిల్-వెయిట్ నేకెడ్ మోటార్‌సైకిల్. దీనికి లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ మరియు 649 సిసి ఇంజిన్‌తో శక్తినివ్వడం జరుగుతుంది. ఇది 8,000rpm వద్ద 67.3bhp మరియు 6,500rpm వద్ద 65.7ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. జెడ్ 650 ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఇండియాలో లేటెస్ట్ బైక్ విడుదల చేసిన కవాసకి ...ధర రూ. 6.25 లక్షలు

2020 కవాసకి జెడ్ 650 కొన్ని డిజైన్లతో మరియు కొత్త పరికరాలతో కొంత కొత్తగా సవరించబడి ఉంది. ఇందులో పునః రూపకల్పన చేయబడిన హెడ్ లైట్ ఉంటుంది. ఇది పదునైన సుగోమి డిజైన్ లో ఉంటుంది. 4.3-అంగుళాల టిఎఫ్‌టి స్క్రీన్ రూపంలో కొత్త ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంది. కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్మార్ట్‌ఫోన్ జత చేయడానికి వీలుగా బ్లూటూత్ ప్రారంభించబడింది. ఇంకా అదనపు లక్షణాలకోసం కవాసకి యొక్క రైడాలజీ అప్లికేషన్ ను స్మార్ట్‌ఫోన్ లో ఉపయోగించుకోవచ్చు.

ఇండియాలో లేటెస్ట్ బైక్ విడుదల చేసిన కవాసకి ...ధర రూ. 6.25 లక్షలు

బిఎస్-6 బైక్ యొక్క టైర్లు ఇప్పుడు స్పోర్ట్‌మాక్స్ రోడ్‌స్పోర్ట్ కి అనుగుణంగా నవీనీకరించబడ్డాయి. ఈ మార్పులు మాత్రమే కాకుండా మునుపటి బైక్ యొక్క కొన్ని లక్షణాలను కూడా ఇది కలిగి ఉంటుంది.

ఇండియాలో లేటెస్ట్ బైక్ విడుదల చేసిన కవాసకి ...ధర రూ. 6.25 లక్షలు

జెడ్ఎస్ 650 నేకెడ్ మోటారుసైకిల్ ముందు భాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు వెనుక భాగంలో మోనోషాక్ యూనిట్ ప్రీలోడ్ తో ఉంటుంది. బ్రేకింగ్ డ్యూటీలను ముందు భాగంలో 300 ఎంఎం పేటల్ డిస్క్ మరియు వెనుక భాగంలో 220 ఎంఎం యూనిట్, ఎబిఎస్ స్టాండర్డ్‌గా అందిస్తారు.

ఇండియాలో లేటెస్ట్ బైక్ విడుదల చేసిన కవాసకి ...ధర రూ. 6.25 లక్షలు

భారతదేశంలో మిడిల్ వెయిట్ స్పోర్ట్ బైక్ క్యాటగిరిలో ఇది మొదటి స్థానాన్ని దక్కించుకుంటుంది. ఇప్పుడు కవాసకి బిఎస్-6 అప్‌డేట్‌ దేశంలో జెడ్ 900 మోటార్ సైకిల్ తో ప్రారంభమవుతుంది. ఇది కొత్త మోటార్ సైకిల్ కొన్ని ఫీచర్స్ తో మరియు కొన్ని మార్పు చేర్పులతో నవీనీకరించింది. ఇది ఇండియాలో సూపర్‌నేక్డ్ మోటార్‌సైకిల్‌.

ఇండియాలో లేటెస్ట్ బైక్ విడుదల చేసిన కవాసకి ...ధర రూ. 6.25 లక్షలు

ఇప్పుడు కవాసకి కి బిఎస్-VI ఉద్గార నిబంధనల గడువు ఏప్రిల్ 1, 2020 కి నిర్ణయించబడింది. గడువు సమీపిస్తున్నందున కవాసకి వాహన తయారీదారులందరూ తమ బిఎస్-4 మోడళ్లకు కొత్తగా నవీనీకరణలు చేస్తున్నారు. ఏదేమైనా కవాసకి ప్రీమియం మోటారుసైకిల్ విభాగంలో హెడ్ స్టార్ట్ సంపాదించినట్లు మనకు తెలుస్తోంది.

Read More:డ్యూయల్ టోన్ లో రాబోతున్న మారుతి ఎస్-ప్రెస్సో

ఇండియాలో లేటెస్ట్ బైక్ విడుదల చేసిన కవాసకి ...ధర రూ. 6.25 లక్షలు

ఇండియాలో 2020 జెడ్ 650 బిఎస్-VI మోటార్‌సైకిల్ లాంచ్ చేయడంపై ఆలోచనలు:

కవాసకి మోటార్ సైకిల్స్ కి బిఎస్-6 ఇచ్చిన గడువుకు ముందే ప్రారంభించినందుకు వినియోగదారులకు కొంత సౌలభ్యంగా ఉండటమే కాకుండా అమ్మకాలలో బాగా స్కోర్ చేస్తుంది. జపనీస్ తయారీదారు అయినా కవాసకి ఇప్పుడు విడుదల చేస్తున్న వాహనాలలో బ్లూటూత్ తో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ వంటి అదనపు ఫీచర్లతో అప్‌డేట్ చేయబడింది. ఇటువంటి అధునాతన ఫీచర్స్ ని ప్రవేశపెట్టడం వల్ల ఇప్పుడు యువకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ విధమైన లక్షణాలతో విడుదలవుతున్న కవాసకి అతి తక్కువ కాలంలోనే తన వైభవాన్ని చాటుకుంటుంది.

Read More:డ్రైవింగ్ రాకపోతే అద్దెకార్లు తీసుకోకండి అన్న గోవా సిఎం ప్రమోద్ సావంత్... ఇంతకీ ఎం జరిగింది...?

Most Read Articles

English summary
2020 Kawasaki Z650 BS6 Launched In India At Rs 6.25 Lakh- Read in Telugu
Story first published: Sunday, December 29, 2019, 9:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X