విపణిలోకి 2020 కవాసకి జడ్900: ధర తెలిస్తే షాకవుతారు!

జపాన్ సూపర్ బైకుల తయారీ దిగ్గజం కవాసకి ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త Z900 మోటార్ సైకిల్‌ను రిలీజ్ చేసింది. సరికొత్త కవాసకి Z900 బిఎస్-6 వెర్షన్ 8.50 లక్షల నుండి రూ. 9 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ (ఇండియా) ధరతో లభిస్తోంది.

9 లక్షల ఖరీదైన కవాసకి Z900 బైకులో ఉన్న విశేషాలేంటో ఫోటోలతో సహా చూద్దాం రండి..

విపణిలోకి 2020 కవాసకి జడ్900: ధర తెలిస్తే షాకవుతారు!

కవాసకి Z900 బైకులో భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన బిఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా 948సీసీ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ వచ్చింది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ గల ఇది గరిష్టంగా 123బిహెచ్‌పి పవర్ మరియు 98.4ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే, మారుతి స్విఫ్ట్ కంటే అత్యంత శక్తివంతమైనది.

విపణిలోకి 2020 కవాసకి జడ్900: ధర తెలిస్తే షాకవుతారు!

సరికొత్త కవాసకి Z900 బిఎస్-6 మోటార్‌సైకిల్‌లో ఎన్నో అత్యాధునిక ఫీచర్లు వచ్చాయి. సరికొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్స్, అప్‌డేటెడ్ సస్పెన్షన్ సెట్టింగ్స్, కొత్త 4.3-ఇంచుల TFT ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చింది, రైడియాలజీ (Rideology) అనే మొబైల్ యాప్ ద్వారా ఈ డిస్ల్పేకు మీ స్మార్ట్‌ఫోన్ అనుసంధానం చేసుకోవచ్చు.

విపణిలోకి 2020 కవాసకి జడ్900: ధర తెలిస్తే షాకవుతారు!

2020 మోడల్ ఇయర్‌తో లభించే ఈ సరికొత్త కవాసకి Z900 బైకులో నూతన రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, ధృడమైన ఫ్రేమ్ మరియు కొత్త సెట్ డన్‌లప్ స్పోర్ట్స్‌మ్యాక్స్ రోడ్‌స్పోర్ట్ 2 టైర్లు వచ్చాయి.

విపణిలోకి 2020 కవాసకి జడ్900: ధర తెలిస్తే షాకవుతారు!

2020 కవాసకి Z900 బిఎస్6 మోటార్ సైకిల్‌ రెండు రకాల డ్యూయల్-టోన్ రంగుల్లో లభిస్తుంది. అవి, మెటాలిక్ గ్రాఫైట్ గ్రే/మెటాలిక్ స్పార్క్ బ్లాక్ మరియు మెటాలిక్ స్పార్క్ బ్లాక్/ మెటాలిక్ ఫ్లాట్ స్పార్క్ బ్లాక్.

విపణిలోకి 2020 కవాసకి జడ్900: ధర తెలిస్తే షాకవుతారు!

పైన పేర్కొన్న మార్పులు మినహాయిస్తే 2020 కవాసకి Z900 మోడల్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. అయితే, మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే మెరుగైన సస్పెన్షన్ సిస్టమ్‌తో వచ్చింది. ఇందులో అవే మునుపటి 41ఎమ్ఎమ్ సస్పెన్షన్ ట్రావెల్ గల అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్వర్ వచ్చింది.

విపణిలోకి 2020 కవాసకి జడ్900: ధర తెలిస్తే షాకవుతారు!

బ్రేకింగ్ సిస్టమ్‌లో కూడా ఎలాంటి మార్పులు జరగలేదు. ఫ్రంట్ వీల్‌కు 300ఎమ్ఎమ్ డిస్క్ మరియు రియర్ వీల్‌కు 250ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు వచ్చాయి. డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ స్టాండర్డ్ ఫీచర్‌గా వచ్చింది.

విపణిలోకి 2020 కవాసకి జడ్900: ధర తెలిస్తే షాకవుతారు!

బిఎస్-6 ప్రమాణాలతో వచ్చిన మొట్టమొదటి ప్రీమియం మోటార్ సైకిల్ కవాసకి Z900. ఏప్రిల్ 2020 నుండి మార్కెట్లోకి అమ్ముడయ్యే ప్రతి బైకులో కూడా బిఎస్-6 ప్రమాణాలను పాటించే అప్‌డేటెడ్ ఇంజన్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో కవాసకి ఒక్కొక్కటిగా తమ మోడళ్లను బిఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేస్తోంది.

విపణిలోకి 2020 కవాసకి జడ్900: ధర తెలిస్తే షాకవుతారు!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కవాసకి Z900 మోడల్ 1000సీసీ సెగ్మెంట్లో ఇండియన్ మోస్ట్ పాపులర్ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్. బిఎస్-6 వెర్షన్ కవాసకి Z900 విపణిలో ఉన్న ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్, కెటిఎమ్ 790 డ్యూక్ మరియు సుజుకి జిఎస్ఎక్స్-ఆర్750 మోడళ్లకు పోటీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 26, 2019, 17:09 [IST]
English summary
2020 Kawasaki Z900 BS6 Launched In India At Rs 8.50 Lakh: India’s First Premium BS-VI Motorcycle. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+