విడుదలకు సిద్దమవుతున్న కెటిఎమ్ చీపెస్ట్ అడ్వెంచర్ బైక్

కెటిఎమ్ ఇండియా తమ తొలి అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్, కెటిఎమ్ 390 అడ్వెంచర్ బైకును దేశీయ మార్కెట్లోకి విడుదల చేసేందుకు సర్వం సిద్దం చేసుకుంది. జనవరి 2020 నుండి ఇండియన్ మార్కెట్లోని అన్ని కెటిఎమ్ షోరూముల్లో అందుబాటులోకి రానుంది.

అయితే, తాజాగా అందిన సమాచారం మేరకు, కెటిఎమ్ ఇండియా "250 అడ్వెంచర్" బైకును కూడా తీసుకొస్తున్నట్లు తెలిసింది. దీని గురించి పూర్తి సమాచారం ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి..

విడుదలకు సిద్దమవుతున్న కెటిఎమ్ చీపెస్ట్ అడ్వెంచర్ బైక్

ఆటోకార్ ఇండియా కథనం మేరకు కెటిఎమ్ 390 అడ్వెంచర్ మాత్రమే కాదు, 250 అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ను కూడా ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చే అలోచనలో ఉన్నట్లు తెలిసింది. దీనిని ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ టూరర్‌ మోడల్‌గా 2020 మధ్య భాగానికల్లా విపణిలోకి ప్రవేశపెడుతున్నట్లు సమాచారం.

విడుదలకు సిద్దమవుతున్న కెటిఎమ్ చీపెస్ట్ అడ్వెంచర్ బైక్

సరికొత్త కెటిఎమ్ 250 అడ్వెంచర్ మోటార్ సైకిల్ చూడటానికి డిజైన్ పరంగా అచ్చం 390 అడ్వెంచర్ మోడల్‌నే పోలి ఉంటుంది. ఇంజన్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి, దీనికి అనుగుణంగా ఛాసిస్ మరియు ఫ్రేమ్ కాస్త చిన్నగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య తేడా కోసం స్వల్ప మార్పలు జరిగే అవకాశం ఉంది.

విడుదలకు సిద్దమవుతున్న కెటిఎమ్ చీపెస్ట్ అడ్వెంచర్ బైక్

డిజైన్ పరంగా బాడీ ప్యానల్స్, బెల్లీ ప్యాన్, ఫ్యూయల్ ట్యాంక్ స్టైలింగ్స్, రేడియేటర్ గార్డ్ మరియు టెయిల్ సెక్షన్ వంటివి 390 మరియు 250 అడ్వెంచర్ బైకుల్లో దాదాపు ఒకేలా ఉంటాయి. కెటిఎమ్‌ 250 అడ్వెంచర్‌లో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ బదులుగా హ్యాలోజియన్ హెడ్‌ల్యాంప్ యూనిట్ వస్తుంది.

విడుదలకు సిద్దమవుతున్న కెటిఎమ్ చీపెస్ట్ అడ్వెంచర్ బైక్

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, కెటిఎమ్ 250 అడ్వెంచర్‌లో 390 అడ్వెంచర్ నుండి సేకరించిన అవే అల్లాయ్ వీల్స్, అదే తరహా టైర్లు వస్తున్నాయి. ముందు వైపున 19-ఇంచుల మరియు వెనుక వైపున 17-ఇంచుల అల్లాయ్ వీల్స్‌కు 100/90 మరియు 130/80 కొలతల్లో ఉన్న 390 అడ్వెంచర్ టైర్లు వస్తాయి.

విడుదలకు సిద్దమవుతున్న కెటిఎమ్ చీపెస్ట్ అడ్వెంచర్ బైక్

సరికొత్త కెటిఎమ్ 250 అడ్వెంచర్ బైకులో ముందు TFT డిస్ల్పే, 43ఎమ్ఎమ్ ట్రావెల్ గల అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్వర్ యధావిధిగా వస్తాయి. కానీ రెండింటి మధ్య తేడా చూపించేందుకు పలు ఫీచర్లు మాత్రం కచ్చితంగా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

విడుదలకు సిద్దమవుతున్న కెటిఎమ్ చీపెస్ట్ అడ్వెంచర్ బైక్

సాంకేతికంగా 250 అడ్వెంచర్ మోటార్ సైకిల్‌లో బిఎస్-6 వెర్షన్ 249సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 30బిహెచ్‌పి పవర్ మరియు 24ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

విడుదలకు సిద్దమవుతున్న కెటిఎమ్ చీపెస్ట్ అడ్వెంచర్ బైక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో అడ్వెంచర్ మోటార్ సైకిళ్లను ఎంచుకునే కస్టమర్ల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అడ్వెంచర్ బైకుల ధర 3 లక్షల ధరల రేంజ్‌లో ఉంది. 2 లక్షల ధరలోపు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 400 మరియు హీరో ఎక్స్‌పల్స్200 బైకులు ఉన్నాయి. పవర్ మరియు ధర పరంగా వీటికి ధీటైన పోటీనిచ్చేలా కెటిఎమ్ ఇప్పుడు 250 అడ్వెంచర్ బైకును సిద్దం చేస్తోంది. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే అడ్వెంచర్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Most Read Articles

English summary
KTM 250 Adventure India Launch Timeline Confirmed: Will Rival The Hero XPulse 200. Read in Telugu.
Story first published: Thursday, December 26, 2019, 18:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X