కెటిఎమ్ 790 అడ్వెంచర్ కూడా వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

గోవాలో జరుగుతున్న "ఇండియా బైక్ వీక్ 2019" ఈవెంట్లో కెటిఎమ్ ఇండియా రెండు సరికొత్త అడ్వెంచర్ బైకులను ఆవిష్కరించింది. 390 అడ్వెంచర్‌కు కొనసాగింపుగా 790 అడ్వెంచర్ బైకును కూడా తీసుకొచ్చింది. మిడ్-వెయిట్ అడ్వెంచర్-టూరర్ కెటిఎమ్ 790 అడ్వెంచర్ బైక్ రాష్ట్రాలు, దేశాలు దాటుకుని ఎన్ని వేల కిలోమీటర్లనైనా ఈజీగా చేధిస్తుంది.

కెటిఎమ్ 790 అడ్వెంచర్ కూడా వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

అత్యంత కఠినమైన మార్గాల్లో రైడింగ్ చేసే ఆఫ్-రోడ్ ఎక్స్‌పర్ట్స్‌కు కెటిఎమ్ 790 అడ్వెంచర్ బెస్ట్ ఛాయిస్. ఇండియన్ మార్కెట్లో మిడ్-సైడ్ అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిళ్లకు గిరాకీ బాగానే ఉంది. వీలైనన్ని ఎక్కువ సేల్స్ సాధించేందుకు కెటిఎమ్ ప్లాన్ చేస్తోంది.

కెటిఎమ్ 790 అడ్వెంచర్ కూడా వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

కెటిఎమ్ ఇండియా ఈ 790 అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ను 2020 ఏడాది మలి సగంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ప్రతి ఏటా జరిగే ఇండియా బైక్ వీక్ 2019 బైక్ ప్రేమికులకు ఎంతో ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా ప్రదర్శించి వీలైనంత ఎక్కువ మంది చూపించే ఉద్దేశ్యంతోనే విడుదలకు ఆరు నెలలు ముందుగానే ఇండియాలో ఆవిష్కరించినట్లు తెలిసింది.

కెటిఎమ్ 790 అడ్వెంచర్ కూడా వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

సెప్టెంబర్ 2019లో కెటిఎమ్ ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసిన 790 డ్యూక్ ఆధారంగానే 790 అడ్వెంచర్ బైకును డెవలప్ చేశారు. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి లాంచ్ అయితే ప్యార్లల్-ట్విన్ సిలిండర్ ఇంజన్‌తో లభించే కెటిఎమ్ రెండవ మోటార్ సైకిల్ ఇదే.

కెటిఎమ్ 790 అడ్వెంచర్ కూడా వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

కెటిఎమ్ 790 అడ్వెంచర్ బైకులో 799సీసీ కెపాసిటి గల ప్యార్లల్ ట్విన్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్ అవసరానికి అనుగుణంగా ట్యూనింగ్ చేయబడిన ఈ ఇంజన్ గరిష్టంగా 94బిహెచ్‌పి పవర్ మరియు 88ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కెటిఎమ్ 790 అడ్వెంచర్ కూడా వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

790 అడ్వెంచర్‌లో 790 డ్యూక్ బైకు నుండి సేకరించిన ఇంజన్‌తో పాటి 6-స్పీడ్ గేర్‌బాక్స్ కూడా తీసుకొచ్చారు, కెటిఎమ్ 790 అడ్వెంచర్ మొత్తం బరువు 189 కిలోలు (ఖాళీ ట్యాంకుతో) ఇదే సెగ్మెంట్లో ఉన్న ఇతర అడ్వెంచర్ బైకులతో పోల్చితే ఇది ఎంతో తేలికగా ఉంటుంది.

Most Read: జావా మోటార్‌సైకిళ్లకోసం ఎదురుచూడాల్సిన కాలం కేవలం 5నెలలు మాత్రమే

కెటిఎమ్ 790 అడ్వెంచర్ కూడా వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

సస్పెన్షన్ కోసం ముందువైపున 43ఎమ్ఎమ్ నాన్-అడ్జస్టబుల్ అప్-సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ప్రిలోడెడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ అబ్జార్ ఉంది,రెండింటినీ కూడా ఫేమస్ సస్పెన్షన్ సిస్టమ్స్ తయారీ సంస్థ డబ్ల్యూపీ (WP) నుండి సేకరించారు.

Most Read: హస్క్‌వర్ణ నుండి స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 బైకులు

కెటిఎమ్ 790 అడ్వెంచర్ కూడా వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు స్ట్రీట్, ఆఫ్-రోడ్, రెయిన్ & ర్యాలీ అనే నాలుగు విభిన్న రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇందులో ముందు వైపున 21-ఇంచుల మరియు వెనుక వైపున 18-ఇంచుల చక్రాలకు డ్యూయల్-పర్పస్ టైర్లను జోడించారు.

Most Read: రింగ్ రోడ్‌లో 10ఏళ్ల పిల్లవాడు కారుడ్రైవ్ చేస్తుండగా గుర్తించారు: వారికి విధించిన కాప్స్ ఇష్యూ చలాన్

కెటిఎమ్ 790 అడ్వెంచర్ కూడా వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మిడ్-సైజ్ టూరర్ అడ్వెంచర్ సెగ్మెంట్లో విడుదలకు ఎంతగానో ఎదురు చూస్తున్న మోడళ్లలో కెటిఎమ్ 790 అడ్వెంచర్ ఒకటి. ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఎంతో మంది అడ్వెంచర్ బైక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. అడ్వెంచర్ 790 రిలీజ్ మరియు డెలివరీ కోసం 790 డ్యూక్ ప్రొడక్షన్‌ను కొన్నాళ్లపాటు నిలిపివేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

కెటిఎమ్ 790 అడ్వెంచర్ మోటార్ సైకిల్ ఒక్కసారిగా ఇండియన్ మార్కెట్లోకి విడుదలైతే దీని ధర సుమారుగా రూ. 10 లక్షల నుండి 11 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు.

Most Read Articles

English summary
KTM 790 Adventure Showcased At India Bike Week Ahead Of 2020 Launch
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X