ఎలక్ట్రిక్ స్కూటర్లను 2020 కి ముందే ఆవిష్కరించనున్న మహీంద్రా!

భారతదేశంలో ప్రసిద్ధిపొందిన సంస్థలలో ఒకటి మహీంద్రా. మహీంద్రా నుంచి చాల రకాల వెహికల్స్ వెలువడ్డాయి. ఇదే రీతిలో ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ప్రవేశపెట్టబోతుంది. ఇప్పుడు దాని గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం!

ఎలక్ట్రిక్ స్కూటర్లను 2020 కి ముందే ఆవిష్కరించనున్న మహీంద్రా!

భారతదేశ ఆధారిత ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అయిన మహీంద్రా 2020 మొదటి త్రైమాసికంలో ఆల్-ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. సాధారణంగా ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ ఉత్పత్తిని ప్రదర్శిస్తుందని ప్రచారం ఉంది. అయితే మహీంద్రా ఆటో ఎక్స్‌పోకు ముందే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరిస్తామని చెప్పారు.

ఎలక్ట్రిక్ స్కూటర్లను 2020 కి ముందే ఆవిష్కరించనున్న మహీంద్రా!

మహీంద్రా ఆల్-ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించి, లాంచ్ చేస్తే దేశవ్యాప్తంగా ఒకేసారి రెండు, మూడు మరియు నాలుగు చక్రాల వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను అందించే ఏకైక తయారీదారుగా ఇదే అవుతుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్లను 2020 కి ముందే ఆవిష్కరించనున్న మహీంద్రా!

ఇప్పుడు ఈ సంస్థ అడ్వాన్స్ స్టేజ్ టెస్టింగ్ మధ్యలో ఉందని, మరియు మహీంద్రా గస్టో యొక్క ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారు చేయబడిన ఆల్-ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మహీంద్రా గస్టో ఆధారంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారు చేసే పనిలో ఉందని ఇంతకుముందు నివేదికలు స్పష్టం చేసాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్లను 2020 కి ముందే ఆవిష్కరించనున్న మహీంద్రా!

రాబోయే మహీంద్రా ఎలక్ట్రిక్ స్కూటర్ 3 కిలోవాట్ల మోటారును కలిగి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇది మహీంద్రా జెంజ్ మరియు ప్యుగోట్ ఇ-లుడిక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లలోని లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒకే ఛార్జీలో సుమారు 80 కిలోమీటర్ల పరిధిని మరియు దాదాపు 55 కిలోమీటర్ల వేగంతో ఇవ్వగలదు.

ఎలక్ట్రిక్ స్కూటర్లను 2020 కి ముందే ఆవిష్కరించనున్న మహీంద్రా!

మహీంద్రా సంస్థ యొక్క ఆల్-ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే ARAI చే ధృవీకరించబడింది. ఇంకా ఫేమ్-IIలో మరియు రాష్ట్ర ప్రభుత్వ అందించిన రాయితీల తరువాత సుమారు దీని ధర 80,000 రూపాయలు ఉంటుందని అంచనా.

ఎలక్ట్రిక్ స్కూటర్లను 2020 కి ముందే ఆవిష్కరించనున్న మహీంద్రా!

మహీంద్రా సంస్థ ప్రస్తుతం విదేశాలలో కూడా రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారీ సంస్థలను కలిగి ఉంది. ఒకటి యుఎస్ఎలో, ఇక్కడ మహీంద్రా జెంజ్ తయారు చేస్తారు. రెండవది ఫ్రాన్సులో ఇక్కడ ప్యుగోట్ మోటోసైకిల్స్ తయారు చేస్తారు. మహీంద్రాలో ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ప్యుగోట్ ఇ-లుడిక్స్ లెక్ట్రిక్ స్కూటర్లు పితాంపూర్ ప్లాంట్లో తయారుచేయబడి ఐరోపా కి ఎగుమతి చేయబడుతున్నాయి.

Read More:భారతదేశంలో కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించిన ఆంపియర్

ఎలక్ట్రిక్ స్కూటర్లను 2020 కి ముందే ఆవిష్కరించనున్న మహీంద్రా!

గత రెండు నెలలుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో అనుకోని మార్పులు జరిగాయి. అథర్ ఎనర్జీ హోసూర్‌లో కొత్త ప్లాంట్ కోసం ప్రణాళికలను ప్రకటించింది. బజాజ్ ఆటో సరికొత్త ఎలక్ట్రిక్ చేతక్ ని వెల్లడించింది. ఇంకా ఆల్ట్రా వొయిలేట్ ఒక ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని ప్రదర్శించింది. ఇప్పుడు ఇండియాలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహన శకం ప్రారంభమైందని చెప్పవచ్చు.

Read More:ప్రియాంక గాంధీని స్కూటర్‌పై తీసుకెళ్లిన వ్యక్తికి జరిమానా విధించిన పోలీసులు... ఎందుకంటే?

ఎలక్ట్రిక్ స్కూటర్లను 2020 కి ముందే ఆవిష్కరించనున్న మహీంద్రా!

ఆల్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించడం గురించి మహీంద్రా ఆలోచనలు:

ఆల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించడం గురించి మహీంద్రా ఆలోచనలు బాగానే ఉన్నాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎకో-సిస్టమ్‌లో మహీంద్రా ఎల్లప్పుడూ చురుకుగా ఉంటుంది. సంస్థ యొక్క మంచి అమ్మకపు స్కూటర్లలో మహీంద్ర ఒకటి. ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారులందరికి ఆకర్షణీయంగా ఉండటానికి కొత్త రూపాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Mahindra To Unveil All Electric Scooter Before Delhi Auto Expo 2020-Read in Telugu
Story first published: Tuesday, December 31, 2019, 12:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X