మహీంద్రా చేతికి యూరోపియన్ టూ వీలర్ దిగ్గజం ప్యూజో

దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా యూరప్‌కు చెందిన ప్యూజో మోటార్‌సైకిల్స్ 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. మహీంద్రా టూ వీలర్స్ యూరప్ విభాగం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ప్యూజో మోటార్ సైకిల్స్‌లో 2015లోనే 51 శాతం వాటాను కొనుగోలు చేసిన మహీంద్రా యూరోపియన్ టూ వీలర్ మార్కెట్లో పట్టుని సాధించేందుకు తాజాగా 100 శాతం వాటాను దక్కించుకుంది.

మహీంద్రా చేతికి యూరోపియన్ టూ వీలర్ దిగ్గజం ప్యూజో

ప్యూజో మోటార్ సైకిల్స్‌లో రెండవ అత్యధిక వాటాను కలిగి ఉన్న ఫ్రెంచ్ దిగ్గజం పీఎస్ఎ గ్రూపుకు సుమారు 13 లక్షల పౌండ్లు (109 కోట్ల రూపాయలు) చెల్లించింది. ప్యూజో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ క్రింద నూతన ఉత్పత్తుల అభివృద్ది కోసం మొత్తం వాటా కొనుగోలుతో పాటు 15 లక్షల పౌండ్లు (136 కోట్ల రూపాయలు) పెట్టుబడిపెట్టింది.

మహీంద్రా చేతికి యూరోపియన్ టూ వీలర్ దిగ్గజం ప్యూజో

ప్యూజో మోటార్ సైకిల్స్‌లో పెట్టుబడి పెట్టినప్పటి నుండి సానుకూలమైన ఫలితాలు నమోదవుతున్నాయని మహీంద్రా వెల్లడించింది. యూరోపియన్ మార్కెట్లో ప్యూజో విక్రయిస్తున్న కిస్బీ (Kisbee) 50సీసీ మోపెడ్ స్కూటర్ ఈ సెగ్మెంట్లోనే బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా రాణిస్తోంది.

మహీంద్రా చేతికి యూరోపియన్ టూ వీలర్ దిగ్గజం ప్యూజో

అదనంగా, ప్యూజో ఫ్లాగ్‌షిప్ మోడల్ త్రీ-వీల్ స్కూటర్ "మెట్రోపోలిస్" యూరోపియన్ మరియు చైనీస్ మార్కెట్లో అద్భుతమైన ఫలితాలు కనబరుస్తోంది. ఇటీవలె విడుదలైన ప్యూజో అర్బన్ జీటీ మ్యాక్సీ-స్కూటర్ పలు మార్కెట్లో బాగా రాణిస్తోంది.

మహీంద్రా చేతికి యూరోపియన్ టూ వీలర్ దిగ్గజం ప్యూజో

మహీంద్రా టూ వీలర్స్ యూరోపియన్ మరియు ఆసియా మార్కెట్లలో పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ లక్ష్యంతోనే ఫ్రెంచ్ స్కూటర్ బ్రాండ్ ప్యూజో కంపెనీ 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. అంతే కాకుండా 2021 నాటికి ప్యూజో సుమారు 7 కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తుందని కంపెనీ పేర్కొంది.

మహీంద్రా చేతికి యూరోపియన్ టూ వీలర్ దిగ్గజం ప్యూజో

కొనుగోలులో భాగంగా జరిగిన లైసెన్స్ అగ్రిమెంట్ ప్రకారం, పూర్తి స్థాయిలో మహీంద్రా కొనుగోలు చేసినప్పటికీ ప్యూజో స్కూటర్ల మీద ప్యూజో బ్రాండ్ లోగో యధావిధిగా వస్తుంది. ప్యూజో డిజైన్ బృందం స్కూటర్లతో పాటు అదనంగా రెండు కొత్త మోటార్ సైకిళ్లను కూడా డిజైన్ చేయనున్నారు.

మహీంద్రా చేతికి యూరోపియన్ టూ వీలర్ దిగ్గజం ప్యూజో

మహానగరాల్లోని రద్దీని తగ్గించేందుకు యూరోప్ తీవ్రంగా శ్రమిస్తోంది, కానీ నగరవాసులు టూ వీలర్లను యధావిధిగా వినియోగించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్యూజో మోటార్ సైకిల్స్‌లో పూర్తిస్థాయి పెట్టుబడి పెట్టిన మహీంద్రా యూరోప్ మరియు ఇతర మార్కెట్లలో ప్యూజో బ్రాండ్‌ను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది.

మహీంద్రా చేతికి యూరోపియన్ టూ వీలర్ దిగ్గజం ప్యూజో

పూర్తి స్థాయి యాజమాన్య బాధ్యతలు దక్కించుకోవడంతో మహీంద్రా సంస్థ ప్యూజో కంపెనీలో ఇకపై ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయాలనైనా తీసుకోవచ్చు. ప్యూజో ఉత్పత్తి చేస్తున్న పలు మోడళ్లను మహీంద్రా తమ సొంత ప్రొడక్షన్ ప్లాంటుకు తరలించే అవకాశం ఉంది. దీంతో తయారీ ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

మహీంద్రా చేతికి యూరోపియన్ టూ వీలర్ దిగ్గజం ప్యూజో

ప్యూజో ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసే విషయం గురించి ఎలాంటి సమాచారం లేదు. కానీ ప్యూజోకి చెందిన అప్రిలియా బ్రాండ్ మహీంద్రా మీద ఒత్తిడి తెస్తే ప్యూజో టూ వీలర్లు దేశీయ రోడ్ల మీద దూసుకెళ్లే ఛాన్స్ ఉంది. 2020 ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్యూజో స్కూటర్లను ఆవిష్కరించే అవకాశం ఉంది.

మహీంద్రా చేతికి యూరోపియన్ టూ వీలర్ దిగ్గజం ప్యూజో

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశపు దిగ్గజ వాహన తయారీ సంస్థ ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలో ధీటుగా రాణించేందుకు చేతికొచ్చే ప్రతి అవకాశాన్ని అందుకుంటోంది. ఫ్రెంచ్ మరియు యూరోపియన్ దేశాలకు చెందిన పలు పురాతణ బైకులు, స్కూటర్లు మరియు సూపర్ కార్ల తయారీ సంస్థలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి ప్రపంచ దేశాల్లో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది. ప్యూజో మోటార్ సైకిల్స్, జావా మోటార్ సైకిల్స్ మరియు పినిన్ఫారినా లగ్జరీ కార్ బ్రాండ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో మహీంద్రా చేతిలో ఉన్నాయి.

Most Read Articles

English summary
Mahindra Two Wheelers Acquires 100 Percent Stake In Peugeot Motocycles. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X