యమహా ఎన్‌మ్యాక్స్ 155 రివీల్.. ఇండియాలో విడుదల ఎప్పుడంటే?

యమహా టూ వీలర్ల తయారీ దిగ్గజం ఇండోనేషియా మార్కెట్లో సరికొత్త ఎన్‌మ్యాక్స్ 155 (Nmax 155) ప్రీమియం స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఇది వరకే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎన్‌మ్యాక్స్ 155 స్కూటర్‌ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తాజాగా రివీల్ చేశారు. 

యమహా ఎన్‌మ్యాక్స్ 155 రివీల్.. ఇండియాలో విడుదల ఎప్పుడంటే?

యమహా ఎన్‌మ్యాక్స్ 155 స్కూటర్ 150సీసీ సెగ్మెంట్లోనే ఖరీదైన ప్రీమియం స్కూటర్, ఇండియన్ మార్కెట్లో ఉన్న సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 150 స్కూటర్‌‌కు గట్టి పోటీనిస్తుంది. ప్రస్తుతానికి ఇండోనేషియా మార్కెట్లో ఉన్న దీనిని ఫ్యూచర్‌లో దేశీయంగా విడుదల చేసేందుకు యమహా ఇండియా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.

యమహా ఎన్‌మ్యాక్స్ 155 రివీల్.. ఇండియాలో విడుదల ఎప్పుడంటే?

యమహా ఎన్‌మ్యాక్స్ 155 స్కూటర్ ఫ్రంట్ డిజైన్‌ లగ్జరీ బ్రాండ్ తరహాలో ఉంది. ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్, రీడిజైన్ చేయబడిన విండ్‌స్క్రీన్, స్టైలిష్ ఫ్రంట్ ఎప్రాన్స్ 2020 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో వచ్చాయి.

యమహా ఎన్‌మ్యాక్స్ 155 రివీల్.. ఇండియాలో విడుదల ఎప్పుడంటే?

రైడర్ పొజిషన్‌లోకి వస్తే, స్కూటర్ నడిపేటప్పుడు రైడర్‌కు కావాల్సిన సమాచారాన్ని అందించే ఎల్‌సీడీ స్క్రీన్ డిస్ల్పే కలదు. బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని ఫోన్ మరియు మెసేజ్ నోటిఫికేషన్, పార్కింగ్ లొకేషన్, మైలేజ్ మరియు ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తితే పూర్తి వివరాలను డిస్ల్పేలో పొందవచ్చు.

యమహా ఎన్‌మ్యాక్స్ 155 రివీల్.. ఇండియాలో విడుదల ఎప్పుడంటే?

స్కూటర్ సైడ్ డిజైన్‌లో టూ-పీస్ డీకాల్ ఫినిషింగ్ కలదు ఏదేమైనప్పటికీ సరికొత్త 2020 యమహా ఎన్‌మ్యాక్స్ 155 స్కూటర్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. అంతే కాకుండా స్మార్ట్ మోటార్ జనరేటర్, స్టార్ట్-స్టాప్ ఫంక్షన్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, కీలెస్ ఇగ్నిషన్, పార్కింగ్ లైట్లు మరియు ఎలక్ట్రిక్ పవర్ సాకెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

యమహా ఎన్‌మ్యాక్స్ 155 రివీల్.. ఇండియాలో విడుదల ఎప్పుడంటే?

సాంకేతింగా యమహా ఎన్‌మ్యాక్స్ 155లో 155సీసీ కెపాసిటీ గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. యమహా వారి వేరిబుల్ వాల్వ్ ఆక్టేషన్ (VVA) మరియు ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ గల ఇంజన్ గరిష్టంగా 16బిహెచ్‌పి పవర్ మరియు 13.9ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Most Read: ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన ఎంజీ మోటార్: మైలేజ్, ఫీచర్లు & ధరలు

యమహా ఎన్‌మ్యాక్స్ 155 రివీల్.. ఇండియాలో విడుదల ఎప్పుడంటే?

రైడర్ల సేఫ్టీ దృష్టా మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థ కోసం ఇరువైపులా డిస్క్ బ్రేకులు మరియు డ్యూయల్ -ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కలదు (ఇండోనేషియా మార్కెట్లో ఆప్షనల్‌ ఫీచర్‌గా లభిస్తోంది). సస్పెన్షన్ కోసం ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున గ్యాస్-ఛార్జ్‌డ్ స్ప్రింగ్స్ ఉన్నాయి.

Most Read: డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో

యమహా ఎన్‌మ్యాక్స్ 155 రివీల్.. ఇండియాలో విడుదల ఎప్పుడంటే?

రైడర్ మరియు పిలియన్ రైడర్ సౌకర్యవంతమైన ట్రావెల్ పొజిషన్ కోసం స్టెప్-అప్ స్టైల్ సీటును అందించారు, దీనికి అనుగుణంగానే ఫుట్-పెడల్స్‌ను సరైన ప్రదేశంలో అందించారు. ఎన్‌మ్యాక్ ఏబీఎస్ వేరియంట్ మ్యాట్ బ్లాక్, మ్యాట్ బ్లూ మరియు గ్లోజీ వైట్ అదే విధంగా స్టాండర్డ్ మోడల్ మ్యాట్ బ్లాక్, మ్యాట్ బ్లూ, గ్లోజీ వైట్ మరియు మ్యాట్ రెడ్ రంగుల్లో లభిస్తున్నాయి.

Most Read: మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!

యమహా ఎన్‌మ్యాక్స్ 155 రివీల్.. ఇండియాలో విడుదల ఎప్పుడంటే?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యమహా ఇండియాకు అతి సమీప మార్కెట్ అయిన ఇండోనేషియా ఈ స్కూటర్‌ను విక్రయిస్తోంది. దీనికి కొనసాగింపుగా 2020 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కూడా తీసకొచ్చింది. యమహా ఎన్‌మ్యాక్స్ 155 ప్రీమియం స్కూటర్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తే అద్భుతమైన సేల్స్ సాధిస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. మరి యమహా ఎన్‌మ్యాక్స్ 155 స్కూటర్‌ను ఇండియన్ రోడ్ల మీద చూడాలనుకుంటున్నారా..? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి!

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
New 2020 Yamaha Nmax 155 (facelift) revealed - Should it be launched in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X